https://oktelugu.com/

Uttar Pradesh : యాటకూర ముక్కలు గట్టిగా వేయలేదని.. పెళ్లి క్యాన్సిల్.. ఆ తర్వాత వరుడి కుటుంబ సభ్యులు ఏం చేశారంటే?

పెళ్లంటే ఒకప్పుడు విందు వినోదాలకు ప్రాధాన్యం ఇచ్చేవారు కాదు. కానీ ఇప్పుడు విందు వినోదాలకే ఫస్ట్ ప్రయారిటీ. నేను విషయంలో కూడా ఏమాత్రం వెనకాడటం లేదు. స్తోమతకు మించి ఖర్చు పెడుతున్నారు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : December 30, 2024 / 06:00 AM IST

    wedding cancel

    Follow us on

    Uttar Pradesh :  స్థితిమతులైతే విందులు వినోదాలకు విపరీతంగా ఖర్చు చేస్తున్నారు. పెళ్లిని తూతూ మంత్రంగా కాకుండా అట్టహాసంగా జరుపుతున్నారు. మెహందీ.. హల్ది.. సంగీత్.. ఇలా భిన్నమైన వేడుకలు జరుపుతూ భారీగా ఖర్చు పెడుతున్నారు. ఇక వంటకాల విషయంలో తగ్గేదే లేదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. వెజ్, నాన్ వెజ్ కలిపి కొడుతున్నారు.. అయితే కొన్ని కుటుంబాలలో మాత్రం విందు విషయంలో చోటుచేసుకుంటున్న తేడాల వల్ల వివాదాలు చెలరేగుతున్నాయి. అంతిమంగావి గొడవలకు దారితీస్తున్నాయి. పెళ్లిలో సరిగా మటన్ ముక్కలు వేయలేదని.. బిర్యాని కడుపు నిండా పెట్టలేదని.. ఇలా రకరకాల కారణాలతో గొడవలు జరగడం.. ఇటీవల కాలంలో పరిపాటిగా మారింది. కేవలం నల్లిబొక్క వేయలేదని కారణంతో ఏకంగా ఓ కుటుంబం మధ్య ఎంతటి అగాధలు ఏర్పడ్డాయో బలగం సినిమా దర్శకుడు చూపించాడు. అయితే అది కొంతమందికి అతిశయోక్తి లాగా అనిపించినప్పటికీ.. వాస్తవంగా జరుగుతున్నది అదే.

    ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో..

    ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చందౌలి అనే జిల్లా ఉంది. ఇక్కడ మెహతాబ్ అనే యువకుడికి సరిగ్గా ఏడు నెలల క్రితం యువతి తో వివాహం కుదిరింది.. కట్న కానుకలు కూడా భారీగానే ఇచ్చేందుకు యువతీ కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు. అయితే సరిగ్గా పెళ్లిరోజు ఆడపిల్ల వారు విందు సరిగా ఇవ్వడంతో మెహతాబ్ కుటుంబ సభ్యులు గొడవపడ్డారు. ఆడ పెళ్లి వారు ఎంత నచ్చ చెప్పినా మెహతాబ్ కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. అవివాదం ఏకంగా పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళింది. ఎట్టి పరిస్థితుల్లోనూ తాను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోనని మెహతాబ్ స్పష్టం చేయడంతో పోలీసులు కూడా చేసేది ఏమీ లేక.. మీరే సమస్యను పరిష్కరించుకోండి అంటూ ఇరు కుటుంబాల సభ్యులకు చెప్పి వెళ్లిపోయారు. అప్పటికే రాత్రి కావడంతో.. అమ్మాయి పెళ్లివారు ఇంటికి వెళ్లి పోయారు. ఇదే క్రమంలో మెహతాబ్ అదే రాత్రి మరో అమ్మాయిని రహస్యంగా వివాహం చేసుకున్నాడు. అదే ఫంక్షన్ హాల్ పక్కన ఉన్న మరో ఈవెంట్ హాల్ లో అతడు ఈ వివాహం చేసుకోవడం విశేషం. మెహతాబ్ రాత్రికి రాత్రే వివాహం చేసుకోవడం మొదటి అమ్మాయి తరఫున వారి బంధువులకు నచ్చలేదు. దీంతో వారు మరుసటి రోజు ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ అంశం మీద పోలీసులు విచారణ జరుపుతున్నారు. ” విందు పేరుతో నాటకాలు ఆడారు. మేము భారీగానే కట్నం ఇస్తామని చెప్పాం. విందు లో కూడా మటన్, చికెన్, బిర్యాని వంటి వంటకాలను కూడా సిద్ధం చేశాం. అయినప్పటికీ అవి నచ్చలేదని వారు పేచి పెట్టారు. చివరికి మాతో గొడవ మరింత పెద్దది చేసుకున్నారు. మేము బతిమిలాడినప్పటికీ వినిపించుకోలేదు. అందువల్లే ఆరోజు రాత్రి ఇంటికి వెళ్లిపోయాం. వారి ప్రణాళిక వేరే విధంగా ఉంది. అదే రోజు రాత్రి మరో అమ్మాయిని అతడు వివాహం చేసుకున్నాడు. ఇంతకంటే దారుణం మరొకటి ఉండదు కదా.. అందువల్లే పోలీసులకు ఫిర్యాదు చేశామని” అమ్మాయి తరఫున బంధువులు విలేకరులకు వెల్లడించారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ జరుగుతున్నదని పోలీసులు చెబుతున్నారు.