Snake Catcher Gives Water To Cobra: ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 10 దాటితే చాలు సూర్యుడు నిప్పులు కక్కుతున్నాడు. బయటికి ఏదైనా పనిమీద వెళ్దామంటేనే భయపడే పరిస్థితి ఏర్పడుతోంది. దీనికి తోడు ఉక్క పోత ఇబ్బంది పెడుతోంది. ఇక వేడిగాలులు సరే సరే. ఎన్ని నీళ్లు తాగినా సరే దాహార్తి తీరడం లేదు. మనుషుల పరిస్థితి ఇలా ఉంటే.. ఇక జంతువులు ఎంతలా ఇబ్బంది పడతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
వర్షాకాలంలో నీటి వనరులలో నీటి నిల్వలు ఉంటాయి. అందులో ఉన్న నీటిని తాగి జంతువులు తమ దాహార్తి తీర్చుకుంటాయి. ఎండాకాలంలో పరిస్థితి అలా ఉండదు. వనరుల్లో ఉన్న నీరు మొత్తం ఇంకిపోతుంది. అప్పుడు జంతువులకు దాహార్తి తీర్చుకునే మార్గం కనిపించదు. దీంతో జంతువులు జనావాసాల బాట పడతాయి.
ఎండాకాలంలో జంతువులు మాత్రమే కాదు.. సరిసృపాలు కూడా జనావాసాల్లోకి వస్తుంటాయి. ఎందుకంటే ఎండాకాలంలో వాటికి విపరీతమైన దాహం అవుతుంది. దాహం తీర్చుకోవడానికి అవి అడవులను దాటి గ్రామాల్లోకి వస్తుంటాయి. నీటి తడివున్న ప్రాంతాలలో సేద తీరుతూ ఉంటాయి. నీరు దొరికితే దాహార్తి తీర్చుకుంటాయి.. తడి ఉన్న ప్రాంతాలలో సరిసృపాలు కనిపిస్తే చాలామంది భయపడుతుంటారు. ఎందుకంటే సరిసృపాలలో పాములు కూడా ఉంటాయి. పాములను చూస్తే చాలామంది భయపడిపోతుంటారు. ఎందుకంటే అది కరుస్తాయని.. కరవడం వల్ల విషం శరీరంలోకి వెళ్తుందని ఆందోళన చెందుతుంటారు.
తిరుపతి జిల్లాలోని పుత్తూరు ప్రాంతంలో వాటర్ ట్యాంక్ కిందికి నాగుపాము వచ్చింది. ఎండాకాలం కావడంతో అది ఓ ఇంట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించింది. అయితే ఆ పాము అక్కడికి రావడానికి ప్రధాన కారణం దాహార్తి తీర్చుకోవడానికే. అయితే పాము తమను కాటు వేస్తుందని భయపడి ఆ ఇంట్లో వాళ్ళు ఆందోళన చెందారు. ఇదే సమయంలో శ్రీకాంత్ అనే స్నేక్ క్యాచర్ అక్కడికి వచ్చాడు. పామును పట్టుకున్నాడు. దానికి నీటిని తాగించి బయటికి పంపించాడు. ఎండాకాలంలో పాములకు విపరీతంగా దాహం వేస్తుందని.. నీటి వనరులు ఉన్న ప్రాంతానికి అవి వచ్చినప్పుడు భయపడకుండా ఉండాలని.. అవి నీటిని తాగి వెళ్లిపోతాయని స్నేక్ క్యాచర్ శ్రీకాంత్ చెబుతున్నాడు.
నాగుపాముకు నీళ్లు తాగించి..
AP: తిరుపతి జిల్లా పుత్తూరులో దాహంతో ఉన్న నాగుపాము ఒక ఇంట్లోకి చొరబడటం కలకలం రేపింది. వాటర్ ట్యాంక్ కింద ఉన్న పామును స్నేక్ క్యాచర్ శ్రీకాంత్ సురక్షితంగా పట్టుకున్నారు. ఎండ తీవ్రతకు అల్లాడుతున్న ఆ పాముకు ఆయన నీళ్లు తాగించగా, అది సేద తీరింది. అనంతరం… pic.twitter.com/M355W5j6iU
— ChotaNews App (@ChotaNewsApp) April 7, 2026