spot_img
Homeవింతలు-విశేషాలుMale Lion Mane Loss: మగాళ్ళకే కాదు.. మగ సింహాలకు కూడా రాలిపోతోంది..

Male Lion Mane Loss: మగాళ్ళకే కాదు.. మగ సింహాలకు కూడా రాలిపోతోంది..

Male Lion Mane Loss: పాతికేళ్లకే తెల్ల జుట్టు వస్తోంది. 30 సంవత్సరాలకే ఉన్న జుట్టు ఊడిపోతుంది. 35 ఏళ్లకే అంకుల్ అని పిలిపించుకోవాల్సి వస్తోంది. ఇటీవల కాలంలో సగటు మగాళ్ల పరిస్థితి ఇలా మారిపోయింది. చదువు పూర్తికాకముందే 60, 70 లలో రావాల్సిన తెల్ల జుట్టు వస్తోంది. దానిని కవర్ చేయడానికి నలుపు రంగు వేసుకోవాల్సి వస్తోంది.

ఎలాగోలా కవర్ చేసినప్పటికీ.. మళ్లీ ఇంకో సమస్య ఎదురవుతోంది. ఉన్న ఆ కాస్త జుట్టు కూడా ఊడిపోతుంది. స్నానం చేస్తున్నప్పుడు.. నెత్తి దువ్వుకుంటున్నప్పుడు చేతికి వస్తున్న వెంట్రుకలను చూస్తే గుండె తరుక్కుపోతుంది. ఇలా చూస్తుండగానే ఉన్న జుట్టు మొత్తం ఊడిపోయి బట్ట తల కనిపిస్తోంది. దానికి కవర్ చేయడానికి క్యాప్ లేదా విగ్గు వాడాల్సి వస్తోంది. ఈ సమస్య మగాళ్ళకు మాత్రమే కాదు.. మగ సింహాలకు కూడా ఉంది. మగాళ్ళకు ఎన్నో రకాల ఒత్తిళ్లు ఉంటాయి.. కానీ మగ సింహాలకు ఎందుకు జుట్టు ఊడిపోతుంది అనేకదా మీ డౌటు.. దీనికి సంబంధించి కొంతమంది శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో కీలక విషయం వెలుగు చూసింది.

కేవలం మనుషులకు మాత్రమే కాదు అడవికి రాజు అయిన సింహానికి కూడా జుట్టు ఊడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. దట్టమైన జుట్టుతో గంభీరమైన ముఖంతో కనిపించాల్సిన ఒక సింహం.. తలపై జుట్టు ఊడిపోవడంతో అంకుల్ లుక్ లోకి వచ్చేసింది. వయసు పైబడిపోవడం.. ఒత్తిడి పెరిగిపోవడం.. తక్కువ స్థాయిలో టెస్టోస్టిరాన్ ఉత్పత్తి కావడం.. పోషకాహార లోపం.. విపరీతమైన వేడి వల్ల సింహాలు జుట్టును కోల్పోతున్నాయి. యూనివర్సిటీ ఆఫ్ మిన్నే సోటా పరిశోధకులు ఇటీవల ఈ సింహాల గురించి అధ్యయనం చేశారు. అనేక అంశాలను పరిశీలించారు. చివరికి జుట్టు ఊడిపోవడానికి అసలు కారణాలను విశ్లేషించారు.

మనుషులంటే విగ్గులు పెట్టుకుంటారు. రంగులు వేసుకుంటారు. కానీ, సింహాలు అలా కాదు. జుట్టు ఊడిపోతే సింహాలకు విగ్గు పెట్టుకునే అవకాశం ఉండదు. కనీసం కవర్ చేసుకునే ఆప్షన్ కూడా ఉండదు. అడవికి రాజు అనే మాటగాని.. జుట్టు ఊడిపోతే సింహాన్ని మిగతా జంతువులు రాజుగా ఎలా పరిగణిస్తాయి.. జుట్టు ఉంటేనే సింహానికి అందం. పైగా అది వేటాడుతుంటే జుట్టు మొత్తం గాలికి ఎగురుతుంటుంది. అప్పుడు సింహం సరికొత్తగా కనిపిస్తూ ఉంటుంది. ఇలా జుట్టు ఊడిపోతుంటే.. సింహం ముఖం మారిపోతుంటే.. అది అడవికి రాజు ఎలా అవుతుంది.. జుట్టు ఊడిపోతే సింహం ముఖమే మారిపోతుంది. అలాంటప్పుడు సింహం కనిపిస్తే భయపడకుండా.. మిగతా జంతువులు వ్యవహరిస్తాయి. అంతేకాదు, హే అంకుల్ వచ్చాడు అంటూ ట్రోల్ చేస్తాయి. ఇందులో డౌటే లేదు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular