Homeవింతలు-విశేషాలుJamun Trees Predicted El Nino: శాస్త్రవేత్తలు కాదు.. ఉపగ్రహాలూ కాదు..ఎల్ నీనో గురించి నేరేడు...

Jamun Trees Predicted El Nino: శాస్త్రవేత్తలు కాదు.. ఉపగ్రహాలూ కాదు..ఎల్ నీనో గురించి నేరేడు చెట్లు ముందుగానే చెప్పేశాయ్..

Jamun Trees Predicted El Nino: కత్తెర కార్తె లో వర్షాలు పడకూడదు. అలా వర్షాలు కురిస్తే కరువు వస్తుంది. సూర్యుడు అస్తమించే దిక్కులో ఎరడాలు (ఎరుపు రంగులో ఉన్న చారికలు) వేయాలి. దక్షిణం, తూర్పు మధ్య భాగంలో ఉరుము పుట్టాలి. మేఘం ఏర్పడాలి. అప్పుడే వర్షాలు కురుస్తాయి.. సంక్రాంతి సమయంలో సంక్రుడు(తెలంగాణ ప్రాంతాల్లో సంక్రాంతి సమయంలో ఎడ్ల పండుగప్పుడు మట్టితో చేసే దేవుడు) వరాహం మీద ఊరేగాలి. అప్పుడే కాలం గట్టిగా అవుతుంది. మెండుగా వర్షాలు కురుస్తాయి.. ఇవన్నీ తెలుగు రాష్ట్రాల్లో పెద్దలు ఏదో ఒక సందర్భంలో మనకు చెబుతూనే ఉంటారు. అదంతా మూఢ నమ్మకమని.. పెద్దవాళ్ళకు ఏం తెలియదని ఈ తరం వాళ్లు అనుకుంటారు. కానీ సైన్స్ కూడా చేదించలేని అద్భుతమైన జ్ఞానం అది. ప్రకృతిని అంచనా వేస్తూ.. ప్రకృతితో మమేకమవుతూ జీవనం సాగిస్తున్న వారికి ఆ విషయాలు తెలుస్తాయి.

నేటి చాట్ జీపీటీ కాలంలో కూడా.. శాస్త్రవేత్తలు ముందుగా చెప్పలేనిది.. ఉపగ్రహాలు అంచనా వేయలేనిది నేరేడు చెట్టు చెప్పేసింది. ఈ సంవత్సరం ఎన్నడు లేనివిధంగా నేరేడు చెట్లు కాయలుకాచాయి. ఆకులతో సమానంగా ఒక్కో చెట్టుకు కాయలు ఉన్నాయి. అయితే ఇలా బంపర్ క్రాఫ్ నమోదు వెనుక ఆశ్చర్యకరమైన సంగతులు ఉన్నాయి. ప్రకృతిలో మార్పులు.. మనుగడ సాగించేందుకు ఎదురయ్య ఇబ్బందులను నేరేడు చెట్లు ముందుగానే అంచనా వేస్తాయి. వాటికి ప్రకృతి నుంచి సంకేతాలు ముందుగానే అందుతాయి. అలాంటప్పుడు తన మనుగడ సాగించడానికి.. నేరేడు చెట్లు విపరీతంగా పండ్లను కాస్తూ ఉంటాయి. అప్పుడు ఆ పండ్ల ద్వారా తన సంతతిని నేరేడు చెట్లు పెంచుకుంటాయి. అదే సమయంలో కొత్త చిగుళ్ళు వేయడానికి నేరేడు చెట్లు సంకోచిస్తూ ఉంటాయి. కొత్త చిగుళ్లను వేయడానికంటే ముందు పండ్లను ఎక్కువగా కాసేలా చేస్తాయి. తాను బతకడానికంటే.. తన సంతతిని కొనసాగించడానికి నేరేడు చెట్లు ఇష్టపడుతుంటాయి.

తీవ్రమైన కరువు.. ప్రకృతి విపత్తులు జరుగుతాయి అని సంకేతాలు ఉన్నప్పుడే నేరేడు చెట్లు ఇలా చేస్తూ ఉంటాయి. ఈ ఏడాది ఎన్నడు లేనివిధంగా నేరేడు చెట్లు విపరీతంగా కాయలు కాచాయి. దీనిని గ్రామీణ ప్రాంత రైతులు తీవ్రమైన కరువుగా భావిస్తున్నారు. ఇప్పటికే శాస్త్రవేత్తలు కూడా ఈ సంవత్సరం వర్షాలు అంతగా కురిసే అవకాశం లేదని చెబుతున్నారు. దీనిని బలపరుస్తూ నేరేడు చెట్లు కూడా విపరీతంగా కాయలు కాచాయి. సరిగ్గా 2003లో కూడా ఇదే తీరుగా నేరేడు చెట్లు కాయలు కాచాయి. దీనిని బట్టి అప్పటి మాదిరిగానే ఇప్పుడు కూడా కరువు సంభవిస్తుందని.. సంకేతాలు అదే విధంగా ఉన్నాయని తెలుస్తోంది. ఫసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో.. ఋతుపవనాల విస్తరణ సాగడం లేదు. ఒకవేళ హిందూ మహాసముద్రం లేదా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడితేనే రుతుపవనాల విస్తరణకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. అప్పుడే వర్షాలు కురవడానికి ఆస్కారం ఉంటుంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version