Jagannath Temple Mahaprasad Mystery: భగభగ మండే కట్టెల పొయ్యి.. ఒకదానిమీద ఒకటి అన్నట్టుగా ఏడు మట్టి కుండలు.. ప్రతి కుండ అంచులకు పచ్చి మట్టి పూస్తారు. చివరి పాత్రను అలానే వదిలేస్తారు. ఇలా కట్టెలు మండుతుండగా మొదటి పాత్రలో కాకుండా.. చివరి పాత్రలో ఆహారం ఉడుకుతుంది. ఇది ఎలా సాధ్యమవుతుందో ఇప్పటికీ ఎవరికి తెలియదు. ఇదంతా కూడా ఒడిశా పూరి జగన్నాథ స్వామి ఆలయం మహిమాన్విత చరిత్ర.
బియ్యం పప్పులతో..
ఇక్కడ స్వామివారికి సంబంధించి బియ్యం.. పప్పులతో ప్రసాదాన్ని తయారుచేస్తారు. ఇందులో ఎట్టి పరిస్థితుల్లో ఉల్లిపాయలు.. వెల్లుల్లి.. కృత్రిమ రసాయనాలను ఉపయోగించరు. కేవలం కట్టెల పొయ్యి మీద మాత్రమే వండుతారు. ప్రసాదాన్ని వండుతున్నప్పుడు ఎటువంటి వాసన రాదు. ప్రసాదం తయారైన తర్వాత స్వామివారికి నివేదించే క్రమంలో అద్భుతమైన వాసన వస్తూ ఉంటుంది. ఇది ఎలా సాధ్యమో ఇప్పటికి తెలియదు. స్వామివారి ప్రసాదం తయారీకి అత్యంత పవిత్రమైన గంగ, యమునా అనే భావుల నుంచి సేకరించిన నీటిని మాత్రమే వాడుతారు. పొరపాటున కూడా ప్రసాదం తయారీకి గ్యాస్ సిలిండర్లను ఉపయోగించరు. కేవలం కట్టెల పోయి మీద మాత్రమే ఇది చేస్తారు.
ఎకరం విస్తీర్ణంలో..
పూరి జగన్నాథ స్వామి ఆలయంలో అన్నప్రసాదం తయారీ కేంద్రాన్ని రోసా ఘరా అని పిలుస్తుంటారు. ఈ వంటగది దాదాపు ఒక ఎకరం విస్తీర్ణంలో.. 37 గదులతో ఉంటుంది.. ఇక్కడ మహా ప్రసాదం తయారు చేయడానికి 752 మట్టి పొయ్యిలు ఉంటాయి. వీటిని చుల్తాలు అని పిలుస్తుంటారు.. మహా ప్రసాదం తయారీలో సువారాలు.. మహా సువారాలు అనే వంశంపారంపర్య వంటవారు మాత్రమే నిమగ్నమై ఉంటారు. ప్రతిరోజు వందలమంది వంటవాళ్లు ప్రసాదాన్ని తయారు చేస్తారు. ప్రసాదాన్ని తయారు చేయడానికి కొత్త మట్టి కుండలు ఉపయోగిస్తారు. ఒకసారి ప్రసాదం తయారు చేసిన తర్వాత ఆ మట్టి కుండలను మళ్లీ ఉపయోగించరు. వాటిని పగలగొట్టి.. మళ్లీ కుండలని తయారుచేస్తారు.
800 ఏళ్ల క్రితమే స్టీమ్ కన్వెన్షన్
కుండలను ఒకదానిమీద మరొకటి ఇలా ఏడింటిని పేర్చుతుంటారు. మొదటి ఆరుకుండల మీద చివరి అంచుల్లో పచ్చి మట్టిని పూతగా పూస్తారు. అయితే మండుతున్న మంటకు కింది కుండలో ముందుగా ఆహారం ఉడకాలి. కానీ ఇక్కడ కిందికి ఉండదు కాకుండా పైకుండలో ఆహారం ఉడుకుతూ ఉంటుంది. దీనికి ప్రధాన కారణం ధర్మం డైనమిక్స్.. ఇక్కడ 800 సంవత్సరాలుగా ఇదే తీరుగా స్వామివారికి ప్రసాదాన్ని తయారు చేస్తున్నారు. వంటగదిలో 800 ఏళ్ల క్రితమే స్టీమ్ కన్వెన్షన్ ఏర్పాటు చేశారంటే ఎంతటి అద్భుతమైన ముందుచూపు ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఎర్మిటిక్ సీలింగ్ విధానంలో..
ప్రతి మట్టి కుండను పచ్చిమటితో అంచుల వద్ద పూయడం వల్ల ఎర్మెటిక్ సీలింగ్ ప్రక్రియ ద్వారా పైన ఉన్న కుండలో ఆహారం ఉడుకుతుంది. ఇది వర్టికల్ ప్రెజర్ కుక్కర్ సిస్టం లాగా పనిచేస్తూ ఉంటుంది. కింద ఉన్న నిప్పు వల్ల వచ్చే వేడిని అది అత్యంత శక్తివంతమైన ఆవిరిగా మార్చేస్తూ ఉంటుంది. ఆవిరి సాంద్రత తక్కువ ఉండడంతో అది దశలవారీగా పై కుండలలోకి వెళ్లిపోతుంది. పార్ట్ అండ్ హీట్ ట్రాపింగ్ విధానం ద్వారా ఆవిరి సాంద్రత గరిష్ట ఉష్ణోగ్రతను చేరుకుంటుంది. దానివల్ల పైకుండలో ఆహారం త్వరగా ఉడుకుతూ ఉంటుంది.
లీనియర్ స్కేలింగ్ ద్వారా..
మోడ్రన్ పాత్రలు త్వరగా వేడిని బయటికి పంపిస్తాయి. మట్టికుండలు మాత్రం అలా వేడిని బయటికి పంపించవు. యూనిట్రీ మ్యాథమెటికల్ మెథడ్ లో లక్ష మందికి లీనియర్ స్కేలింగ్ విధానంలో ఇక్కడ ఆహారం వండుతారు. 17వేల కుండల్లో ఒకేసారి ఆహారం వండి భక్తులకు పంపిణీ చేస్తారు. ఇప్పుడు ప్రపంచం మొత్తం గ్రీన్ విధానం వైపు వెళ్ళిపోతుంది. పర్యావరణానికి హితమైన పనులు చేస్తోంది. కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితమే పూరి జగన్నాథ స్వామి ఆలయంలో గ్లోబల్ గ్రీన్ స్టాండర్డ్ విధానం మొదలైంది.
అత్యంత అద్భతమైనవి..
స్వామివారి ప్రసాదం ముందుగా వాసన ఎందుకు ఉండదు.. ఆ తర్వాత ఎందుకు ఆ స్థాయిలో రుచి వస్తూ ఉంటుంది.. కట్టెల పొయ్యి మీద వండితే కిందికుండలో కాకుండా పైకుండలో ఆహారం ఎలా ఉడుకుతుంది.. ఇవన్నీ కూడా ఇక్కడ అద్భుతాలే. ఇంతవరకు ఏ సైన్స్ కూడా దీనిని చేదించలేదు. ఈ ఆధునిక ప్రపంచానికి వివరించలేదు. మన పురాణాలు గొప్పవి. మన శాస్త్రాలు అద్భుతమైనవి. మన ధర్మాలు అనితరసాధ్యమైనవి. వాటి వెనుక ఉన్న నిజాలు అత్యంత అద్భుతమైనవి.
