Why Wives get so Wild: సరిగ్గా మూడు నెలల క్రితం ఇండోర్ జంట హనీమూన్ ఘటన తర్వాత.. దేశంలో భర్తలను చంపే భార్యలు పెరిగి పోయారు. ఒక్కో ఘటన ఒక్కో తీరుగా ఉండడంతో భర్తలలో భయం పెరిగిపోయింది. పైగా సామాజిక మాధ్యమాలు అందుబాటులోకి రావడంతో భర్తలను చంపడానికి రకరకాల ప్రణాళికలను భార్యలు అమలులో పెడుతున్నారు. కొన్ని సందర్భాలలో తమ ప్రియుళ్ళ సహకారం కూడా తీసుకుంటున్నారు. అంతిమంగా భార్యల చేతిలో భర్తలు బలవుతున్నారు.
ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాలు పెట్టుకునే భార్యలు పెరిగిపోయారు. వాస్తవానికి ఇది కొత్త ఇబ్బందికరమైనప్పటికీ.. వివాహేతర సంబంధాలు పెట్టుకునే విషయంలో భార్యలు ఏమాత్రం తగ్గడం లేదు. పైగా కొత్త కొత్త విధానాలలో తమ సంబంధాలను నడుపుతున్నారు. ఇటీవల హైదరాబాద్ నగరానికి చెందిన ఓ మహిళ తన ప్రియుడితో ఉండడానికి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. వెళ్తూ వెళ్తూ తన కొడుకుని కూడా తీసుకొని వెళ్ళింది. ఒక లెటర్ రాసి.. నీతో ఉండడం ఇష్టం లేదు.. నా ప్రియుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాను అంటూ అందులో పేర్కొంది. వాస్తవానికి ఇటీవల కాలంలో జరిగిన సంఘటనలలో ఈ భర్త మాత్రమే బతికి బట్ట కట్టాడు. మిగతా వాళ్ళందరూ చనిపోయారు.
అందువల్లే భార్యలలో మార్పు
సామాజిక మాధ్యమాలు.. రకరకాల పరిణామాలు భార్యల మీద ప్రభావం చూపిస్తున్నాయి. అందువల్లే వారి ప్రవర్తన మారుతోంది. ఫలితంగా దారుణాతి దారుణాలకు పాల్పడే విధంగా వారిని పురిగొల్పుతోంది. ఇలాంటి క్రమంలో కొంతమంది తెలివైన భర్తలు సాంకేతిక పరిజ్ఞానం సహాయాన్ని ఉపయోగించుకుంటున్నారు. భార్య ఏం చేస్తోంది? ఎక్కడికి వెళ్తోంది? ఎవరితో వెళ్తోంది? అనే విషయాలను ఆరా తీస్తున్నారు. అయితే ఈ వ్యవహారానికి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అందులో ఉన్న దృశ్యాల ప్రకారం ఓ భర్త తన భార్యను కనిపెట్టడానికి.. కనిపెట్టుకొని ఉండడానికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాడు. ఇక అప్పట్నుంచి ఆమె ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. ఇంటి పట్టున ఉండలేక.. బయటికి వెళ్లలేక.. సీసీ కెమెరాలను ఏమీ చేయలేక.. ఆమె నరకం చూసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వివిధ మాధ్యమాలలో సంచలనంగా మారింది. ఇప్పటికే ఇది వేలాది వీక్షణలు సొంతం చేసుకుంది.
Husband installed a surveillance camera to monitor his wife’s movements while she was sleeping, and this was the result.
— Science girl (@gunsnrosesgirl3) September 5, 2025