Girls Four Types: ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ప్రత్యేకమే. ఒక మనిషి ఆలోచనలు, ప్రవర్తన మరో మనిషికి భిన్నంగా ఉంటాయి. ముఖ్యంగా అమ్మాయిల మనసు, వారి ఆలోచనా విధానాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం అంటారు. కానీ వారి స్వభావం ఆధారంగా అమ్మాయిలను నాలుగు ప్రధాన రకాలుగా విభజించవచ్చని తాజాగా నిర్వహించిన ఓ సర్వే ద్వారా మానసిక విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నాలుగు రకాల వెనుక వారి ఆలోచనలు, జీవితం పట్ల వారి వైఖరి ఉంటుంది.
డబ్బుకే ప్రాధాన్యత ఇచ్చేవారు
ఈ రకం అమ్మాయిలకు డబ్బు, హోదా చాలా ముఖ్యం. ప్రేమ, నిజాయితీ, బంధాలు వంటి వాటికి వీరు అంత ప్రాధాన్యత ఇవ్వరు. వీరి దృష్టిలో డబ్బే బలం, అదే భవిష్యత్తు. అందుకే ఎవరి దగ్గర ఎక్కువ డబ్బు, ఆస్తులు ఉంటే వారితోనే ఉంటారు. పరిస్థితులు మారినప్పుడు, లేదా మరింత మెరుగైన అవకాశం వచ్చినప్పుడు, వెనుకాడకుండా మరో వ్యక్తిని ఆశ్రయిస్తారు. తమకు కావలసింది సాధించుకోవడానికి బ్లాక్‌మెయిల్ చేయడానికి కూడా వెనుకాడరు. చివరికి ఆర్థికంగా స్థిరపడిన వ్యక్తిని పెళ్లి చేసుకుని జీవితంలో సుఖంగా ఉంటారు. ఇలాంటి అమ్మాయిల వల్ల ఎక్కువగా బాధపడేది మాత్రం నిస్వార్థంగా ప్రేమించిన అబ్బాయిలే.
నిస్వార్థంగా ప్రేమించేవారు
వీరి మనసు చాలా స్వచ్ఛమైనది. డబ్బు, ఆస్తులు, కులం, ఉద్యోగం, గౌరవం వంటివి వీరికి అస్సలు ముఖ్యం కావు. వీరు కోరుకునేది కేవలం నిజమైన ప్రేమ మాత్రమే. “అతను బాగుంటే చాలు, నేను చూసుకుంటా” అనే మనస్తత్వం వీరిది. ప్రేమలో పడితే సర్వం ఆ అబ్బాయికే అంకితం చేస్తారు. కానీ ఇలాంటి నిస్వార్థ ప్రేమకు చాలాసార్లు ప్రతిఫలం దక్కదు. వీరు ఎక్కువగా అబ్బాయిల చేత మోసపోతూ, కన్నీళ్లతో బాధపడే అవకాశం ఉంది.
నిజమైన ప్రేమతో ఆచరణాత్మకంగా ఆలోచించేవారు
ఈ రకం అమ్మాయిలు ప్రేమలో చాలా నిజాయితీగా ఉంటారు. కానీ వారి ప్రేమకు ఒక హద్దు ఉంటుంది. వారు కేవలం హృదయం మాట వినడమే కాకుండా, బుద్ధి కూడా ఉపయోగిస్తారు. ప్రేమ విషయంలో కుటుంబం, సమాజం, భవిష్యత్తు వంటి విషయాలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. మొదట్లో కులం, మతం, ఆస్తులు వంటివి పట్టించుకోకపోయినా, చివరికి పెద్దల అభిప్రాయానికి, సమాజానికి తల వంచుతారు. ప్రేమ విఫలమైనా, కుటుంబం చూసిన వ్యక్తిని పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. వీరి జీవితం సాధారణంగా సజావుగా సాగిపోతుంది, కానీ ప్రేమించిన అబ్బాయికి మాత్రం తీరని బాధ మిగులుతుంది.
ప్రేమ కోసం సర్వస్వం త్యాగం చేసేవారు
వీరి మనసులో ప్రేమ అంటే కేవలం ఒక భావన కాదు, అది వారి జీవితమే. ప్రేమను ప్రాణం కంటే ఎక్కువగా భావిస్తారు. ప్రేమ విఫలమైతే, మోసపోతే లేదా విడిపోతే వారి జీవితం మొత్తం ఖాళీ అయిపోయినట్లు భావిస్తారు. క్షణికావేశంలో ఆత్మహత్యకు పాల్పడటానికి కూడా వెనుకాడరు. వీరు ప్రేమలోనూ, జీవితంలోనూ ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో బ్రతికినా, జీవచ్ఛవంలా నిస్సత్తువగా ఉంటారు.
ఏ రకం అయినా సరే…
ఈ నాలుగు రకాల అమ్మాయిల జీవితాలు వేర్వేరుగా ఉంటాయి. మొదటి రకం స్వార్థాన్ని తమ కవచంగా చేసుకుని సుఖంగా జీవిస్తే, రెండవ రకం కన్నీళ్లతో బాధపడతారు. మూడవ రకం ప్రేమలో ఓడిపోయినా జీవితంలో గెలిచి కొత్త జీవితాన్ని మొదలు పెడతారు. నాలుగవ రకం మాత్రం ప్రేమలోనూ, జీవితంలోనూ ఓడిపోతారు.
ప్రతి అమ్మాయి మనసులోనూ ఒక ప్రత్యేకమైన భావజాలం ఉంటుంది. అయితే, ఒక విషయం మాత్రం నిజం..నిజమైన ప్రేమకు విలువ ఇచ్చినవారే ఎప్పటికీ గుర్తుండిపోతారు.