Maharloo Lake: రంగు మార్చుకునే సరస్సు.. ఎక్కడుందో తెలుసా?

ఎత్తయిన ప్రాంతంలో కొలువుదీరిన ఈ కొలను కాలానుగుణంగా తన రంగు మార్చుకుంటుంది. షిరాజ్‌కు ఆగ్నేయంగా 27.0 కిమీల(16.8 మైళ్ల)వరకూ ప్రవసిస్తుంది. సాధారణంగా వేసవి చివరినాటికి ఈ సరస్సు ఎండిపోతుంది.

Written By: Raj Shekar, Updated On : May 26, 2024 4:07 pm

Maharloo Lake

Follow us on

Maharloo Lake: ప్రకృతిలో ఎన్నో అద్భుతాలు, మరెన్నో వింతలు, విశేషాలు దాగి ఉన్నాయి. అలాంటి వాటిలో రంగు మార్చుకునే సరస్సు ఒకటి. దక్షిణ ఇరాన్‌లోని షిరాజ్‌ నగరానికి సమీపంలో 00 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ ఉప్పునీటి సరస్సు పేరు మహర్లూ సరస్సు. ఇది ఒకపక్క తెలుపు, మరోపక్క లేత గులాబీ రంగుతో సందర్శకులను ఆశ్చర్యపరుస్తుంది.

కాలానుగుణంగా రంగు..
ఎత్తయిన ప్రాంతంలో కొలువుదీరిన ఈ కొలను కాలానుగుణంగా తన రంగు మార్చుకుంటుంది. షిరాజ్‌కు ఆగ్నేయంగా 27.0 కిమీల(16.8 మైళ్ల)వరకూ ప్రవసిస్తుంది. సాధారణంగా వేసవి చివరినాటికి ఈ సరస్సు ఎండిపోతుంది. ఆ సమయంలో ఇది పింక్‌ కలర్‌లోకి మారి ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తుంది. సూక్ష్మజీవుల కారణంగా ఇది పింక్‌ కలర్‌లోకి మారుతుందని శాస్త్రవేత్తల నిర్ధారించారు. నీటిమట్టం మరింతగా తగ్గగానే ముదురు గులాబీ రంగులోకి మారుతుంది. ఇందులో పేరుకున్న ఉప్పే ఈ సరస్సు మధ్యలో లేదా తీరంలో నిలబడడానికి, దిమ్మలా ఒడ్డులా మారుతుంది.

ప్రపంచ వ్యాప్తంగా మరిన్ని..
ఇలాంటి పింక్‌ సరస్సులు ప్రపంచవ్యాప్తంగా మరిన్ని ఉన్నాయి. రష్యాలోని అలై్టపర్వత ప్రాంతంలో ఉన్న సైబీరియన్‌ పింక్‌ లేక్‌ కూడా గతంలో వైరల్‌ అయింది. ఆ సరస్సు మధ్యలో నుంచి రైలు పట్టాలు వేయడంతో సందర్శకులను మరింత ఆకట్టుకుంటోంది. ‘ఆర్టెమియా సాలినా’ అనే ఉప్పునీటి రొయ్యల జాతి కారణంగానే ఆగస్టు సమయంలో సైబీరియన్‌ సరస్సుకు గులాబీ రంగు వస్తుందని నిపుణులు నిర్ధారించారు.