La Bomba River: పెరూ ప్రాంతంలోని పర్వత ప్రాంతంలో లా బొంబా అనే నది ఉద్భవిస్తూ ఉంటుంది. దానిని షానే టాంపిష్కా లేదా హిర్వింటే అని పిలుస్తుంటారు. ఇది తూర్పు పెరూ ప్రాంతంలో అమెజాన్ నదికి ఉపనదిగా ఉంటుంది. 1930 కాలంలో శిలాజ ఇంధనాల కోసం ఇక్కడి కొండల్లో చమురు కంపెనీలు తీవ్రంగా అన్వేషణ సాగించాయి.. అయితే లా బొంబా నదిలో అన్వేషణ సాగిస్తున్న క్రమంలో పాశ్చాత్య దేశాల శాస్త్రవేత్తలకు అనేక రహస్యాలు తెలిసాయి. అయితే వాటిని వారు ఇప్పుడిప్పుడే భయపెడుతున్నారు. లా బొంబా నది ప్రవహించే ప్రాంతంలో అత్యంత లోతున ఉష్ణ మూలాలు ఉన్నాయి. దానివల్ల ఆ నది వేడెక్కుతోంది. ఈ నది పొడవునా పెద్ద చెట్లు ఎక్కువగా లేవు. ఉన్న చెట్లు కూడా ఎండిపోయి కనిపిస్తున్నాయి. సమశీతోష్ణ వాతావరణం ఉన్న అమెజాన్ అడవిలో కూడా ఇంతటి వేడి ఉండదని పరిశోధకులు చెబుతున్నారు. ” ప్రపంచ వ్యాప్తంగా భూతాపం పెరుగుతోంది. ఉష్ణోగ్రతల్లో మార్పులు అందువల్లే చోటు చేసుకుంటున్నాయి. అయితే అవి అమెజాన్ అటవీ ప్రాంతాన్ని ఎలా మార్చేస్తాయో తెలుసుకోవడానికి మేం ప్రయోగాలు చేస్తుంటే.. లా బొంబా నది లో జరుగుతున్న మార్పులు మాకు కనిపించాయి. అయితే ఇది ఒక ఉదాహరణ లాగా మాత్రమే ఉంది. ఆ కోణంలో గనక చూస్తే ఆ వేడి నీటినది.. ప్రకృతి చేస్తున్న ఒక ప్రయోగంలాగా ఉంది. అయితే ఈ నదిపై అధ్యయనం చేయడం అంత సులువు కాదు. ఇది ఆవిరి స్నానం చేయడం లాంటిదని” పరిశోధకులు చెబుతున్నారు.
ఉష్ణోగ్రతలను కొలిచారు
ఈ నది లో ఉష్ణోగ్రతలను నమోదు చేయడానికి 13 రకాల పరికరాలను పరిశోధకులు ఉపయోగించారు.. నది పొడవునా చల్లగా ఉన్న ప్రాంతాల్లోనూ ఉష్ణోగ్రతను కొలిచే పరికరాలను ఏర్పాటు చేశారు.. అయితే సగటు వార్షిక ఉష్ణోగ్రత శీతల ప్రదేశాలలో 24 నుంచి 25 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. అదే వెచ్చని ప్రాంతాల్లో అయితే 28 నుంచి 29 డిగ్రీల మధ్య వరకు ఉంటుంది. వేడిగా ఉంటే మాత్రం 28 నుంచి 29 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత ఉంటుంది. అయితే లా బొంబా నదిలో మాత్రం గరిష్ట ఉష్ణోగ్రత 45 డిగ్రీలు గా నమోదయింది. ఇక నదిలో నీటి సగటు ఉష్ణోగ్రత 86 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంది. ఆ నదిలో మొక్కలు, చెట్లను పూర్తిగా విశ్లేషించడానికి పరిశోధకులు మరింత అన్వేషణ సాగిస్తున్నారు. ఈ నదిలో నీరు వేడిగా ఉన్నచోట వృక్షాల సంఖ్య తక్కువగా ఉంది. మరికొన్ని చోట్ల అయితే వృక్షాలు ఏమాత్రం లేవు. ఈ నది తీరంలో గ్వారియా గ్రాండి ఫోలియా అనే చెట్లు తీవ్ర ప్రతికూలతను ఎదుర్కొంటుంటాయి. ఇవి 50 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతాయి.. అయితే నీటిలో ఉన్న వేడి వల్ల ఈ చెట్లు ఏ మాత్రం ఎదగలేక పోతున్నాయి. ఈ నదిలో నుంచి వస్తున్న వేడి ఆవిరి వల్ల జీవవైవిధ్యం ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొంటున్నది.. ఈ నది నుంచి వెలువడే నీటి ఆవిరి గాల్లోకి చేరడంతో.. పక్షులు, ఇతర జంతువులు ఆ సమీప ప్రాంతంలో కూడా సంచరించలేకపోతున్నాయి. అయితే ఈ నదిలో నీరు మరింత వేడిగా మారితే ఆమెజాన్ అడవి ఎండిపోతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.