Homeవింతలు-విశేషాలుBaobab Tree: ఒంటెల్లాంటి చెట్లు.. ఎక్కడుంటాయో తెలుసా?

Baobab Tree: ఒంటెల్లాంటి చెట్లు.. ఎక్కడుంటాయో తెలుసా?

బేయాబాబ్‌ చెట్లకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఇవి నిట్టనిలువుగా పెరుగుతాయి. కాండానికి చిట్టచివరన మాత్రమే కొమ్మలు ఉంటాయి.ఈ చెట్లు ఒంటెల్లాంటివి.

Baobab Tree: మనం ఎన్నోరకాల చెట్లను చూసుంటాఇం. అందులో పొట్టిగా, పొడవుగా ఉండేవి ఉంటాయి. కానీ ఈ వింతైన చెట్లు అరుదుగా కనిపిస్తాయి. గజస్తంభాలను పోలిన విధంగా ఉంటాయి. ఒంటె మెడలా పొడవుగా, ఏనుగు ఆకారంలో భారీగా ఉంటాయి.

బేయాబాబ్‌ చెట్లు..
నిలువునా స్తంభాల్లా పెరిగే ఈ చెట్లను బేయాబాబ్‌ చెట్లు అంటారు. ఇవి ఎక్కువగా మడగాస్కర్‌లోనూ, అరేబియన్‌ ద్వీపకల్పంలోనూ, ఆఫ్రికా ప్రధాన భూభాగంలోనూ, ఆస్ట్రేలియాలో కనిపిస్తాయి. బేయాబాబ్‌ చెట్లలో తొమ్మిది రకాలు ఉంటాయి. వాటిలో ఆరు రకాలు కేవలం మడగాస్కర్‌లోనే ఉంటాయి. రెండు రకాలు అరేబియన్‌ ద్వీపకల్పంలో, ఆఫ్రికా ప్రధాన భూభాగంలో, మరొక రకం ఆస్ట్రేలియాలో కనిపిస్తాయి.

అనేక ప్రత్యేకతలు..
బేయాబాబ్‌ చెట్లకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఇవి నిట్టనిలువుగా పెరుగుతాయి. కాండానికి చిట్టచివరన మాత్రమే కొమ్మలు ఉంటాయి.ఈ చెట్లు ఒంటెల్లాంటివి. వీటి కాండం చుట్టుకొలత 23 నుంచి 36 అడుగుల వరకు ఉంటాయి. ఆకురాలే కాలంలో కూడా ఈ చెట్లు తమ కాండంలో లీటర్ల కొద్దీ నీటిని నిల్వ ఉంచుకుంటాయి. ఈ చెట్లు వెయ్యేళ్లనాటివని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ శతాబ్ది ప్రారంభంలో దక్షిణాఫ్రికాలో బేయాబాబ్‌ చెట్లు పెద్ద సంఖ్యలో మరణిచాయి. అయితే అవి చీడపీడల కారణంగా కాకుండా, నీటి కొరత కారణంగా మరణించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper