Inspiring Life Story: జీవితంలో లక్ష్యాలను ఏర్పరచుకొని వాటిని సాధించడానికి చాలామంది ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ కొందరు మాత్రమే గమ్యాన్ని చేరుకుంటారు. ఇలా గమ్యం చేరుకునే వారిలో ప్రతిభతో పాటు కృషి, పట్టుదల వంటి లక్షణాలు ఉంటాయి. అయితే ఈ లక్షణాలు ఉన్న వారసైతం సరైన సమయంలో గమ్యాన్ని చేరుకోలేక పోతారు. అందుకు వారు చేసే కొన్ని పొరపాట్లు అని మానసిక నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగులు తాము అనుకున్న పొజిషన్లో ఉండడానికి ఎంతో కష్టపడుతూ ఉంటారు. అయితే వారు చేసే ఒక తప్పిదం వల్ల అనుకున్న గమ్యానికి చేరలేకపోతుంటారు. అలాగే కుటుంబానికి కొందరు కుక్కల కష్టపడుతూ ఉంటారు. అయినా వారిని పట్టించుకోరు. ఇలాంటి వారి కోసం స్ఫూర్తినిచ్చే ఓ కథ మీకోసం..
ఒక ఊళ్లో ఒక కుక్క ఉంటుంది. అది నేరుగా కిరాణం షాప్ కు వెళ్లి డబ్బులు చూపిస్తుంది. అలాగే ఒక కిరాణం షాపు లిస్టును కూడా ఇస్తుంది. దీంతో ఆ కొట్టువాడు లిస్టులో ఉన్న సరుకులు ఒక కవర్లో ఉంచి.. దానిని మళ్లీ కుక్కకు ఇస్తాడు. అయితే ఇదే సమయంలో కుక్కను ఆ కొట్టు వాడు వెంబడిస్తాడు. అయితే ఆ కుక్క సరుకులను జాగ్రత్తగా తీసుకెళ్తుంది. రోడ్డుపై సిగ్నల్స్ దగ్గర ఆగి మరి వెళ్తుంది. క్రమశిక్షణతో బస్సులో ప్రయాణిస్తుంది. ఆ తర్వాత ఒక ఇంటికి చేరుతుంది. తన కాలుతో కాలింగ్ బెల్ కొడుతుంది. అయినా లోపటి నుంచి యజమాని రాడు. ఆ తర్వాత కిటికీలోనుంచి డోర్ కొట్టుతుంది. దీంతో తలుపు దగ్గరికి యజమాని వచ్చి కుక్క తలపై తన్నుతాడు.
అయితే కుక్కను ఫాలో అయిన కొట్టు వాడు ఆ యజమానిని అడుగుతాడు. కుక్క ఎంతో జాగ్రత్తగా సరుకులు తీసుకువస్తే ఎందుకు కొడుతున్నావు అని ప్రశ్నిస్తాడు. అయితే అప్పుడు ఆ యజమాని రోజు ఇంటి తాళం చెవి తీసుకెళ్ళమని కుక్కకు చెప్పినా వినడం లేదు.. కుక్క బుద్ధి చూపిస్తుంది.. అని కోపడుతాడు. కానీ ఆ కొట్టు వాడు మాట్లాడుతూ.. కుక్క ఎంతో జాగ్రత్తగా సరుకులు తీసుకువచ్చింది. సమయానికి కూడా నీకు అందించింది. కేవలం చిన్న కారణంతో కుక్కను వారిస్తావా? అని అంటాడు. అంతేకాకుండా ఈ కుక్కకు బయట ఎంతో విలువ ఉంది. సినిమాల్లోని వారు దీనిని లక్షలు పెట్టి కొనుగోలు చేస్తారు అని చెబుతాడు. అయినా సరే ఆ యజమాని వినిపించుకోకుండా ఇంట్లోకి వెళ్తాడు.
అంటే ఇక్కడ కుక్క ఎంతో తన ప్రతిభను చూపిస్తుంది. అయినా ఆ యజమాని పట్టించుకోడు. అంటే విలువ లేని చోట పని చేయడం వృధా అని అర్థమవుతుంది. కానీ కుక్క మాత్రం ఆ యజమాని దగ్గరే పని చేస్తుంది.
Also Read: An Inspiring Journey Of A Horse: అంధత్వాన్ని జయించిన గుర్రం ఇది.. చివరికి ఎన్ని అద్భుతాలు చేసిందంటే!
ప్రతి పదిమందిలో కనీసం ఐదుగురు తెలివైన వారు ఉంటారు. వీరికి మిగతా వారి కంటే ఎక్కువగా నైపుణ్యం ఉంటుంది. అందుకే వారు ఒక్కో మెట్టెక్కుతూ మంచి పొజిషన్ లోకి వెళ్తారు. అయితే ఈ ఐదుగురు లో ఒకరు మాత్రం కొన్ని తప్పిదాలు చేస్తారు. అవేంటంటే వారికి నైపుణ్యం ఉన్న వాటిని సరైన చోట ప్రదర్శించలేకపోవడమే. అంటే ఒక వ్యక్తి మంచి పొజిషన్లో ఉండడానికి అనేక రకాల ప్రతిభాపాటవాలు ఉంటాయి. కానీ తనను గుర్తించని వారి దగ్గర పని చేయడం వల్ల అవి మాయమైపోతూ ఉంటాయి. అంటే ఒక వ్యక్తి ఎంతో తెలివిగా పనిచేసిన తనను గుర్తించకపోవడం వల్ల అతను అక్కడే ఆగిపోతాడు. అయితే ఇలాంటి సమయంలో ప్రతిభ పాటవాలు ఉన్నవారు.. జీవితంలో రాణించాలని అనుకునేవారు.. తమ ఉద్యోగాలను మారుస్తూ ఉండాలి. అప్పుడే తమ గురించి ఇతరులకు తెలిసి అవకాశాలు ఇచ్చే అవకాశం ఉంటుంది.
కొంతమందిలో ఎంతో టాలెంట్ ఉన్న గోడ దాటి బయటకు వెళ్లడానికి ఇష్టపడరు. అంటే ఉన్న ఊర్లోనే చిన్న ఉద్యోగమైన చేసుకుంటూ గడపాలని చూస్తారు. ఇలాంటివారు జీవితంలో అనుకున్న స్థాయికి ఎదిగే అవకాశం ఉండదు. అంతేకాకుండా బావిలో కప్పలాగా వీరు నెక్స్ట్ పొజిషన్కు వెళ్లే అవకాశం ఏమాత్రం ఉండదు. అందువల్ల టాలెంట్ ఉన్నవారు తమ ప్రతిభను ప్రదర్శిస్తూ ఎప్పటికప్పుడు కొత్తవారికి చూపిస్తూ ఉండాలి. అంటే ఒక వ్యక్తి ఒక ఉద్యోగం లో ఉన్నప్పుడు తనను గుర్తించకపోయినప్పుడు.. మరో కంపెనీలో తన ప్రతిభను చూపించే ప్రయత్నం చేయాలి. అలా ఒకరు గుర్తించకపోయినా.. మరో కంపెనీ గుర్తించే అవకాశం ఉంటుంది. దీంతో ఆ వ్యక్తి అనుకున్న పొజిషన్కు వెళ్లే అవకాశం ఉంటుంది.
ఇదే సమయంలో కొందరు అడ్డంకులు సృష్టించే అవకాశం కూడా ఉంటుంది. వారిని చాకచక్యంతో దాటుకుంటూ ముందుకు వెళ్లే ప్రయత్నం చేయాలి. ఎవరో చెబుతున్నారని.. ఎవరో అడ్డుకుంటున్నారని టాలెంటును మగ్గిపెట్టి అవసరం లేదు.