husband Shocking Act After Divorce: అతని పేరు యోగేష్. ఉండేది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. కొంతకాలం క్రితం అతడికి ఒక యువతి తో పెళ్లయింది. మొదట్లో వారి వైవాహిక జీవితం బాగానే ఉండేది. ఆ తర్వాత గొడవలు మొదలయ్యాయి. పెద్ద మనుషులు ఎంట్రీ ఇచ్చారు. యోగేష్, అతని భార్యకు సర్ది చెప్పారు. కలిసి ఉండాలని.. కలహాలు పెట్టుకోవద్దని సూచించారు. దానికి వారిద్దరు ఓకే అన్నారు. మళ్లీ గొడవలు మొదలయ్యాయి. ఈసారి గొడవలు మరింత పెరిగాయి. ఇద్దరు చదువుకున్న వారు కావడంతో ఎవరి దారి వారు చూసుకుందామనుకున్నారు.
విడాకుల కోసం యోగేష్ కోర్టు మెట్లు ఎక్కాడు. తనని ఇబ్బంది పెడుతున్న భార్య నుంచి విముక్తి కలిగించాలని న్యాయమూర్తులను కోరాడు. అయితే అతడి భార్య అనేక రకాల కండిషన్లు పెట్టడంతో యోగేష్ తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. భరణం.. ఇతర విషయాలలో అతడి భార్య తీవ్రంగా బెట్టు చేసింది. దీంతో యోగేష్ తట్టుకోలేకపోయాడు.. అనేక రకాలుగా కష్టాలు పడి.. తన భార్య కోరినట్టుగా భరణం ఇచ్చాడు. దానికంటే ముందు అతడు తనకు విడాకులు మంజూరు కావాలని అమ్మవారికి మొక్కుకున్నాడు. అత్యంత కఠినమైన దండావత్ యాత్ర చేశాడు.
విడాకులు మంజూరైన తర్వాత అతడు దాదాపు 12 గంటల పాటు అత్యంత కఠినమైన దండావత్ యాత్ర నిర్వహించారు. ఉత్తర ప్రదేశ్ లో చదువు, ఉద్యోగం, పెళ్లి, పిల్లలు కలగాలని దేవుళ్ళకు మొక్కుకుంటారు. అవి నెరవేరిన తర్వాత దేవతామూర్తులకు మొక్కులు చెల్లించుకుంటారు. దీనిని దండావత్ యాత్ర అని పిలుస్తుంటారు. ఇది అత్యంత కఠినమైనది. 12 గంటల పాటు నిష్టతో చేయాల్సి ఉంటుంది. ఆహారం తినకూడదు. నీళ్లు ముట్టుకోకూడదు. 9 కిలోమీటర్ల పాటు సాష్టాంగ నమస్కారాలు చేసుకుంటూ వెళ్లాలి. యోగేష్ కూడా విడాకులు మంజూరు కావడంతో దండావత్ యాత్ర నిర్వహించాడు.
అతడు యాత్ర నిర్వహిస్తుండగా చాలామంది వీడియో తీశారు. వాటిని సోషల్ మీడియాలోకి పంపించారు. అతని నేపథ్యాన్ని.. పడిన ఇబ్బందులు.. కోర్టు ద్వారా లభించిన విడాకులు.. ఈ వ్యవహారంలో అతడు పడిన ప్రయాస.. అన్ని విషయాలను అందులో పేర్కొన్నారు. దీంతో అతని మీద చాలా మంది జాలి పడుతున్నారు. మొత్తానికి దేవుడు అతని కష్టాన్ని చూశాడని.. విముక్తి ప్రసాదించాడని కామెంట్లు చేస్తున్నారు.