Hot balloon ride:ఎవరైనా దేహాన్ని విల్లు లాగా వంచితే ఒంట్లో ఎముకలు ఉన్నాయా? లేవా? అని అనుకుంటాం.. ఇక జిమ్నాస్టిక్స్ చేసేవాళ్లను చూస్తుంటే ఆశ్చర్యానికి గురైతుంటాం. దేహాన్ని వారు మలచుకున్న తీరును చూసి షాక్ కు గురవుతాం. జిమ్నాస్టిక్స్ చేసే వాళ్లు ప్రొఫెషనల్ గా ట్రైనింగ్ తీసుకుంటారు. గంటలకు గంటలు సాధన చేస్తుంటారు. అందువల్లేవారు ఆ స్థాయిలో ప్రదర్శన చేస్తూ ఉంటారు.
అనేక సందర్భాలలో జిమ్నాస్టిక్స్ చేసేవాళ్లు అద్భుతాలను చేసి చూపిస్తుంటారు. దేహంతో రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటారు. కానీ జిమ్నాస్టిక్స్ చేసేవాళ్లు కచ్చితంగా ఇండోర్ మైదానాలలోని ప్రదర్శనలు ఇస్తుంటారు. కానీ ఆకాశ వీధిలో ప్రదర్శనలు ఇవ్వడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఇండోర్ మైదానాలలో జిమ్నాస్టిక్స్ ప్రదర్శన చేసే వారికి ఒక ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. దానికి తగ్గట్టుగానే వారు ప్రదర్శనలు చేస్తుంటారు. పైగా జిమ్నాస్టిక్స్ చేసే వాళ్లకు ఒక నిర్ణీత పరిధిలో మైదానం ఉండాలి. దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు ఉండాలి. అప్పుడే వారు ప్రదర్శన ఇవ్వడానికి అవకాశం ఉంటుంది.. అయితే రష్యా దేశానికి చెందిన ఓ వ్యక్తి మాత్రం విభిన్న ప్రయోగం చేశాడు. ఆకాశ వీధిలో అది కూడా వేడిగాలి బెలూన్ నుంచి వేలాడుతూ అదిరిపోయే ప్రదర్శన ఇచ్చాడు.
రష్యా దేశానికి చెందిన సెర్గీ బోయోటోత్సవ్ ప్రొఫెషనల్ అథ్లెట్. ఇతడు వేడిగాలి బెలూన్ నుంచి వేలాడుతూ ఇటీవల ప్రదర్శనలు చేశాడు. గురుత్వాకర్షణ శక్తి అనేది ఒకటుందనే విషయాన్ని మర్చిపోయి ప్రదర్శనలు చేశాడు. అంతేకాదు ప్రపంచ రికార్డు సృష్టించాడు. 30 సంవత్సరాల వయసు ఉన్న అతడు వేడిగాలి నుంచి వేలాడదీసిన క్షితిజ సమాంతర బార్ పై ప్రదర్శనలు చేశాడు.. వేడి గాలి బెలూన్ ముందుకు వెళ్తుండగా.. క్షితిజ సమాంతర బార్ పై అతడు అద్భుతం అనే స్థాయిలో ప్రదర్శనలు చేశాడు. ఆ దృశ్యాలు చూస్తుంటే వెన్నులో వణుకు పుడుతోంది.
ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఆ వీడియోని చూసిన చాలామంది అద్భుతం అని వ్యాఖ్యానిస్తుంటే.. మరికొత్త మంది అతను ఎటువంటి పారాచూట్ తీసుకెళ్లకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి విన్యాసాలు చేయడం వల్ల ప్రాణాలు ప్రెస్ కుల పడతాయని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఆ వ్యక్తి గాలిలో విన్యాసాలు చేస్తున్నప్పుడు వేడి గాలి బెలూన్ గాలిలో 1500 మీటర్ల ఎత్తులో ఉన్నట్టు తెలుస్తోంది. అంతటి ఎత్తులో కూడా ఏమాత్రం భయం లేకుండా అతడు ఆ స్థాయిలో విన్యాసాలు చేయడం నిజంగా అభినందించాల్సిన విషయం.