Pure Love Viral Video: ఊరు కాని ఊరు.. దేశం కానీ దేశం.. వెళ్లాడు ఆ యువకుడు. మన భాష కాదు. మన యాస కాదు. మన మనుషులు అంతకంటే కాదు. అటువంటి చోటకు అతడు వెళ్ళాడు. వెళ్లినచోట అతనికి భయం కాకుండా ప్రేమ కనిపించింది. చీత్కారం కాకుండా సత్కారం దర్శనమిచ్చింది.
సామాజిక మాధ్యమాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత రకరకాల వీడియోలు తెరపైకి వస్తున్నాయి. ఇది కూడా అలాంటి వీడియోనే. కాకపోతే ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రపంచంలో భారతీయతకు ఏ స్థాయిలో విలువ లభిస్తుందో కళ్ళకు కట్టేలా చూపిస్తోంది.
మన పక్కనే ఉన్న ఆఫ్గనిస్తాన్ దేశానికి కైలాష్ మీనా అనే వ్యక్తి వెళ్ళాడు. ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో ఉన్న అందమైన దృశ్యాలను అతడు తన కెమెరాలో బంధిస్తున్నాడు. అదృశ్యాలు కూడా అద్భుతంగా ఉన్నాయి. హిమాలయ పర్వతాలకు ఆఫ్ఘనిస్తాన్ దగ్గరగా ఉంటుంది కాబట్టి అక్కడి వాతావరణం కూడా అద్భుతంగా ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల పరిపాలనలో ఉంది కాబట్టి.. అక్కడ ప్రజాస్వామ్యం ఉండదని.. ప్రజలకు హక్కులు ఉండవని.. ఇలా రకరకాల వదంతులు వినిపిస్తున్నాయి. అయితే అవన్నీ నిజం కాదని.. అక్కడి ప్రజల్లో ప్రేమ, నమ్మకం, స్వచ్ఛత సజీవంగా ఉన్నాయని కైలాష్ మీనా నిరూపించాడు.
కైలాస్ మీనా యూట్యూబ్ వ్లాగర్. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అందమైన ప్రాంతాలను అతడు సందర్శించి వస్తుంటాడు. అక్కడ ఉన్న విషయాలను పంచుకుంటాడు. ఆఫ్గనిస్తాన్లో కూడా అతడు అందమైన ప్రదేశాలను తనను అనుసరించే వారికి చూపించాలని భావించాడు. ఇందులో భాగంగానే అందమైన ప్రదేశాల వీడియోలు తీసి ఆకట్టుకుంటున్నాడు. అయితే అతడు ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో ఉన్న ఓ వ్యాపారి వద్ద దానిమ్మ జ్యూస్ తాగాడు. ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో దానిమ్మ కాయలు విపరీతంగా పండుతాయి. ఆ జ్యూస్ తాగిన అతడు ఓ వ్యాపారికి డబ్బులు ఇవ్వాలని ప్రయత్నించాడు. దానికి ఆ వ్యాపారి ఒప్పుకోలేదు. ఎన్ని డబ్బులు ఇచ్చినా సరే తీసుకోలేదు. పైగా “మీరు మా అతిధులు. భారతీయులను మేము అత్యంత ప్రేమగా చూస్తాం. మీరు మాకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని” ఆ వ్యక్తి అనడంతో కైలాష్ ఆనందం వ్యక్తం చేశాడు. ఇదే సందర్భాన్ని అతడు వీడియో ద్వారా పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సంచలనం సృష్టిస్తోంది.
❤️ PURE LOVE: An Afghan street vendor refuses to take money from Indian vlogger Kailash Meena for juice!
“You are our guest,” he insisted. Locals say Indians are always treated with deep respect there. This bond is winning the internet today! ✨
Have you ever… pic.twitter.com/oCwhaDR6qK
— Mahender Bogi (@xxmahibogixx) December 3, 2025