Bihar Wedding: బీహార్ రాష్ట్రంలో కైమూరు జిల్లాలో ఇటీవల ఓ యువతి యువకుడికి వివాహం నిశ్చయమైంది. సరిగ్గా పెళ్లి తేదీ రానే వచ్చింది. ఇరు కుటుంబాలు ఘనంగా పెళ్లి జరపడానికి ఏర్పాట్లు చేశాయి. వారి సాంప్రదాయం ప్రకారం పెళ్లి వేదిక మీదకు ముందుగా పెళ్లి కుమారుడు వచ్చాడు. ఈ లోగానే చేయాల్సిన క్రతువులను అర్చకుడు పూర్తి చేయిస్తున్నాడు. ఈ క్రమంలోనే పెళ్లి కుమార్తె వేదిక మీదికి వచ్చింది. కొన్ని తంతులు పూర్తయిన తర్వాత.. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె నుదుటన సిందూరం పెట్టడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో పెళ్లి కుమారుడి చెయ్యి వణికింది. అది పెళ్లి కుమార్తెకు ఇబ్బంది లాగా అనిపించింది. మరో మాటకు తావు లేకుండా ఆమె ఈ పెళ్లి చేసుకోను అని చెప్పేసింది. అంతేకాదు పెళ్లి కుమారుడికి వ్యాధి ఉందని.. అతడి మానసిక పరిపక్వత సరిగ్గా లేదని.. అతడు ఒక పిచ్చివాడని.. అతడిని పెళ్లి చేసుకోనని.. ఒకవేళ బలవంతంగా తనను అతడికి కనుక ఇచ్చి పెళ్లి చేస్తే కఠినమైన నిర్ణయం తీసుకుంటానని హెచ్చరించింది. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఫలితంగా రెండు కుటుంబాలు సమస్య పరిష్కారం కోసం పోలీస్ స్టేషన్ దాకా వెళ్లాయి. అక్కడ కూడా పెళ్లి మండపంలో చోటు చేసుకున్న సన్నివేశమే పునరావృతమైంది. దీంతో పోలీసులు చేతులెత్తేశారు. ఇక అమ్మాయి తరఫున వారు అబ్బాయికి కట్నం కింద లక్ష రూపాయలు ఇచ్చారు. వాటిని తిరిగి ఇవ్వాలని పెళ్లి కుమారుడి తరఫున వారిని కోరితే.. డబ్బులు మొత్తం ఖర్చు అయిపోయాయని.. తాము ఇచ్చే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. దీంతో రెండు కుటుంబాల వారు ఎవరింటికి వారు వెళ్ళిపోయారు.
సంచలనం సృష్టించింది
కర్నూలు జిల్లాలో ఈ సంఘటన సంచలనం సృష్టించింది. ఈ సంఘటనపై జాతీయ మీడియాలు కూడా కథనాలు ప్రసారమయ్యాయి. వాస్తవానికి ఆ అబ్బాయికి ఎటువంటి పిచ్చి లేదని, అతడి మానసిక పరిపక్వత బాగానే ఉందని బంధువులు చెప్తున్నారు.. పెళ్లి వేదిక మీద పెళ్లి కుమారుడు కాస్త ఉత్కంఠకు గురయ్యాడని.. పెళ్లి కుమార్తె నుదుటన బొట్టు పెట్టే క్రమంలో కాస్త ఇబ్బంది పడ్డాడని.. అంత మాత్రం దానికి అతడికి లేని వ్యాధిని ఉందని చెప్పారని.. మానసిక పరిపక్వత సరిగ్గా లేదని ఆరోపించారని.. చివరికి పెళ్లి రద్దు చేశారని.. అతడి తరఫున బంధువులు వాపోతున్నారు. అలాంటి అనుమానం ఉన్నవారు అతడికి వైద్య పరీక్షలు చేయించాలని.. అప్పుడు అతడి శరీరంలో ఏముందో తేలుతుందని పేర్కొంటున్నారు..” అబ్బాయి నచ్చాడని ముందే వారే చెప్పారు. అనేకసార్లు సంప్రదించారు. మధ్యవర్తులతో కూడా మాట్లాడారు. చివరికి పెళ్లికి ఒప్పించారు. ఇప్పుడేమో ఇలా ఇబ్బంది పెడుతున్నారు.. పెళ్లి రద్దయిందనే బాధలో అతడు ఇప్పటికే మానసికంగా చితికిపోయాడు.. ప్రతి సందర్భంలో దానిని తలుచుకుంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.. ఇలా చేయడం వారికి న్యాయం కాదంటూ” పెళ్లి కుమారుడు తరఫు బంధువులు చెబుతున్నారు. అయితే పెద్ద మనుషుల సమక్షంలో ఈ పంచాయతీ జరుగుతున్నట్టు తెలుస్తోంది.