Homeవింతలు-విశేషాలుGod Fish: సముద్రం ఒడ్డున నిర్జీవంగా..ఆ చేప వినాశనానికి చిహ్నం.. యుగాంతం రాబోతోందా.. జనాల్లో భయాందోళనలు..

God Fish: సముద్రం ఒడ్డున నిర్జీవంగా..ఆ చేప వినాశనానికి చిహ్నం.. యుగాంతం రాబోతోందా.. జనాల్లో భయాందోళనలు..

God fish: సముద్రం… నదులన్నీ చివరకు చేరేది సముద్రంలోకే. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే నదీ జలాలు.. వాటితో కలిసి వచ్చే జీవరాశులు అన్నీ సముద్రంలోనే కలుస్తాయి. ఎన్ని నదులు కలిసినా.. సముద్రం పెరగదు.. ఎన్ని జీవరాశులు వచ్చినా… సముద్రంలో ఇంకా చోటు ఉంటుంది. ఇక లక్షల కోట్ల రకాల జలచరాలు సముద్రంలోనే జీవనం సాగిస్తుంటాయి. సముద్రంలోని చేపలపై ఆధారపడి వేలాది కుటుంబాలు ఉపాధి పొందుతుంటాయి. చేపల వేటకు వెళ్లే జాలర్లకు చాలా వరకు రోజూ దొరికే చేపలే లభిస్తాయి. కానీ, అప్పడప్పుడు అరుదైన చేపలు కూడా వలకు చిక్కుతాయి. ఒక్కోసారి ప్రమాదకరమైన సొర చేపలు కూడా చిక్కుతుంటాయి. అయితే లక్షలాది జలచరాల్లో కనిపించే అరుదైన జీవాలకు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంటుంది. దీంతో కొందరు జాలర్లు ఒక్క రోజులోనే లక్షాధికారిగా మారిన సందర్భాలూ ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ఇలా అరుదైన జాతిగా భావించే గాడ్స్‌ ఫిష్‌.. ఇప్పుడు కనిపించింది. అదీ నిర్జీవంగా సముద్రం ఒడ్డున పడి ఉంది. దీనిని చూసి అంతా షాక్‌ అవుతున్నారు.

అరుదైన చేప..
సాధారణంగా సముద్రంలో లక్షలాది చేప జాతులు కనిపిస్తాయి.. కానీ గాడ్స్‌ ఫిష్‌ అని పిలిచే ఈ చేప పేరులోనే కాకుండా ఆకారంలోనూ వింతగా ఉంటుంది. అంతేకాదు.. ఈ చేప ఎంతో అరుదుగా కనిపిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ చేప కనిపిస్తే సునామీ, వరదలు వంటి విపత్తులు సంభవిస్తాయని భావిస్తారు. వినాశనానికి చిహ్నంగా భావిస్తారు. ఇప్పుడు ఈ చేప కళేబరం సముద్రం ఒడ్డున దర్శనమివ్వడంతో ఇదేదో పెద్ద సంఘటనకు సంకేతమని జనాలు ఆందోళన చెందుతున్నారు. చనిపోయిన చేపలను చూసేందుకు చుట్టుపక్కల ప్రజలు పెద్దఎత్తున తరలివస్తున్నారు.

భిన్నమైన రూపం..
ఈ చేప పేరు డూమ్స్‌డే. ప్రపంచంలోని అరుదైన చేపలలో ఒకటి. ఈ చేపను ఫిష్‌ ఆఫ్‌ గాడ్‌ అని పిలుస్తారు. వింత ఆకారంలో ఉండే ఈ చేప మిగతా చేపలతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటుంది. ఇది చాలా అరుదైనది. సుమారు 12 అడుగుల పొడవుతో ఉంటుంది. సుమారు 30 అడుగుల వరకు పెరుగుతుంది. పెద్ద కళ్లు, దాని తలపై ఎర్రటి కుచ్చు ఉంటుంది. సాధారణంగా ఈ చేప సునామీలు, వరదలు వంటి విపత్తులను అంచనా వేస్తుంది. ఈ చేప కనిపిస్తే ఇలాంటివి జరుగుతాయని ప్రజల నమ్మకం.

వినాశనానికి సంకేతమని..
ఈ ఫిష్‌ ఆఫ్‌ గాడ్‌ చేపలు కనిపించడం వినాశనానికి సంకేతమని ప్రజలు నమ్ముతారు. ఇందుకు ఉదాహరణలు కూడా ఉండడమే ఇందుకు కారణం. 2011లో జపాన్‌లో భూకంపం రావడానికి ముందు ఒడ్డున తేలుతున్న 20 ఓర్‌ఫిష్‌ల ద్వారా భూకంపం వస్తుందని అంచనా వేశారు. భూకంపానికి ముందు, ఈ చేపలు సముద్రం ఒడ్డుకు తేలాయి. దాంతో భారీ విధ్వంసం జరిగింది. ప్రస్తుతం కాలిఫోర్నియాలోని సముద్రం ఒడ్డున ఈ చేప చనిపాయి కనిపించింది. దీంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. సముద్రం ఒడ్డున చచ్చిపడి ఉన్న ఈ చేపలను చూసిన స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఏం జరగబోతుందోనని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version