Garasia Tribe: మన దగ్గర ఒక అమ్మాయి లేదా అబ్బాయి పెళ్లీడు కు వచ్చిన తర్వాత.. ఒక సంబంధం చూసి పెళ్లి చేస్తాం. పెళ్లికి ముందు నచ్చిన అబ్బాయి తో ఇష్టం వచ్చినట్టు తిరుగుతాను.. ఏడాది తర్వాత మరొక అబ్బాయి తో ఉంటాను.. అతడు కూడా నచ్చకపోతే మరొక ఏడాదితో ఇంకొకడితో ఉంటాను అంటే.. మనవాళ్లు తోలు తీస్తారు. కేవలం అమ్మాయి విషయంలోనే కాదు.. అబ్బాయి విషయంలోనూ మన పెద్దవాళ్లు అలానే ఉంటారు. తిక తిక వేషాలు వేస్తే వీపు పగలగొడతారు. కానీ అక్కడ మాత్రం పెళ్లికి ముందు అమ్మాయి ఏదైనా చేయవచ్చు. అబ్బాయి కూడా స్వేచ్ఛగా ఉండవచ్చు. ఒకరకంగా చెప్పాలంటే నచ్చిన వాళ్ళతో సహజీవనం మొదలు పెట్టొచ్చు.
ఇదేదో బయట దేశంలో కాదు.. మనదేశంలో రాజస్థాన్, గుజరాత్ దగ్గర్లో ఉన్న గారాసియా తెగలో ఈ సాంప్రదాయం గడిచిన 500 సంవత్సరాలుగా కొనసాగుతోంది. ఇప్పటి కాలంలో ప్రేమ పెళ్లిళ్లు జరుగుతున్నాయి. కానీ అరెంజ్డ్ మ్యారేజీలు మాత్రమే జరిగేవి. నేటి కాలంలో యువత ఆధునికంగా ఉండడంతో తల్లిదండ్రులు కూడా వారి నిర్ణయానికి ఓకే చెబుతున్నారు.
ఇక గరాసియా తెగలో ఇలా ఉండదు. వారి సాంప్రదాయం ప్రకారం పెళ్లికి ముందే అన్ని జరిగిపోతుంటాయి. సహజీవనం మొదలు పెట్టిన తర్వాత వారు అని దర్జాగా చేసేస్తూ ఉంటారు. ఆ పని పూర్తి అయిన తర్వాత ఆర్థికంగా స్థిరపడాలని చెబుతుంటారు. కొన్ని సందర్భాలలో సహ జీవనం చేస్తున్న వారు పిల్లల్ని కూడా కంటారు. ఆర్థిక ఇబ్బందులు తగ్గిపోయిన తర్వాత పెళ్లి గురించి ఆలోచిస్తుంటారు. ఆర్థిక స్థిరత్వం సాధించడానికి ఎన్ని సంవత్సరాలు పట్టినా సరే అలాగే ఉంటారు. ఆర్థికంగా బాగున్న తర్వాతే పెళ్లి చేసుకుంటారు.
అక్కడ ఆడ మగ కలిసి సహజీవనం చేస్తుంటే ఎవరూ తప్పు పట్టరు. పైగా పెళ్లిని అక్కడ చివరి అంకం లాగా భావిస్తుంటారు. మన దగ్గర ఆడ మగ లివ్ ఇన్ రిలేషన్ లో ఉంటే నైతికంగా తప్పు అని భావిస్తుంటారు. అటువంటివారిని చీడ పురుగుల మాదిరిగా చూస్తుంటారు. కానీ గరాసియా తెగలో మాత్రం పూర్తి విభిన్నంగా ఉంటుంది. తమకు నచ్చిన వారితో ఉండొచ్చు. ప్రతి ఏడాది అక్కడ పండుగ జరుగుతూ ఉంటుంది. ఆ పండుగ సమయంలో అమ్మాయిలు అప్పటికి రిలేషన్ లో ఉన్నప్పటికీ.. కొత్త వ్యక్తి కనిపిస్తే అతడితో వెళ్లిపోవచ్చు. అబ్బాయిలకు కూడా ఈ స్వేచ్ఛ ఉంటుంది.
ఒకవేళ పిల్లలు కలుగుతే మాత్రం ఈ అవకాశం ఉండదు. అదే ఇంతటి స్థాయిలో స్వేచ్ఛ ఉన్నప్పటికీ ఎవరు అక్కడ ప్రశ్నించారు.. ఇక మన దగ్గర వరుడికి కట్నం అనేది ఉంటుంది. అక్కడ అమ్మాయిలకు ఇస్తుంటారు.. జాతర సమయంలో అమ్మాయి తనకు నచ్చిన అబ్బాయిని ఎంచుకున్నప్పుడు.. అమ్మాయి కుటుంబ సభ్యులకు అబ్బాయి కుటుంబ సభ్యులు డబ్బు ఇవ్వాల్సి ఉంటుంది.. ఒకవేళ పెళ్లి చేసుకోవాలనుకుంటే అబ్బాయి కుటుంబం ఆ ఖర్చు మొత్తం భరిస్తుంది. పెళ్లి మొత్తం అబ్బాయి ఇంట్లో జరుగుతుంది.
కేవలం యువ జంటలు మాత్రమే కాకుండా.. సహజీవన సాగించే వృద్ధ జంటలు కూడా అక్కడ చాలా ఉంటాయి. అక్కడ షాదీ కంటే మనసులు.. మనుషులు కలవడానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంటారు. కొన్ని సందర్భాలలో ఓల్డ్ ఏజ్ లో పెళ్లి చేసుకున్న జంటలు అక్కడ చాలానే ఉంటాయి. అంతేకాదు వాళ్ళ పిల్లలే పెళ్లిళ్లు చేయడం ఇక్కడ విశేషం.. ఒకవేళ సహజీవనం చేస్తున్నప్పుడు ఇబ్బందికర వాతావరణ ఏర్పడితే అబ్బాయి ధైర్యంగా బయటికి రావచ్చు. అమ్మాయి కూడా స్వేచ్ఛగా బయటికి రావచ్చు. స్త్రీల మీద అక్కడ ఆంక్షలు ఉండదు. లేనిపోని అపోహలు ఉండవు. అందువల్లే వారి వ్యవహారాల మీద అనేక డాక్యుమెంటరీలు రూపొందాయి.
