Famous Recipes: ఆహారం కోసం మనిషి ఎంత దూరమైనా వెళ్తాడు. దేనికైనా వెనుకాడడు. ఆహార అన్వేషణతోనే మనిషి జీవితం మొదలైంది. ఇప్పుడు ఆహారంతోనే అతను చరిత్ర మరింత చిరస్థాయిగా నిలబడింది. అయితే ఆహారం తయారీలో మనిషి ఏటికేడు అభివృద్ధి చెందుతున్నాడు. పాత రుచులను కొనసాగిస్తూనే.. కొత్త వంటకాలను తయారు చేస్తున్నాడు. అయితే ఈ వంటకాల ద్వారా మన దేశంలో కొన్ని నగరాలు మరింత ఫేమస్ అయ్యాయి. వాటికంటూ భౌగోళికంగా మరింత గుర్తింపును సంపాదించుకున్నాయి. ఇంతకీ ఆ నగరాలు ఏమంటే..
Also Read: భారత్–పాక్ యుద్ధం జరిగితే.. ఆ దేశాలు ఎటువైపు?
ఇరుట్టు కడై హల్వా- తిరునల్వేలి
తమిళనాడు రాష్ట్రంలోని తిరునల్వేలి ఇరుట్టు కడై హల్వా కు ఫేమస్. గోధుమ, బెల్లం, నెయ్యి, యాలకులు, డ్రై ఫ్రూట్స్ తో దీన్ని తయారు చేస్తారు. ఈ ప్రాంతం తమిర భరణి నది పక్కన ఉంటుంది.. ఈ హల్వా కోసం ఎక్కడెక్కడి నుంచో పర్యాటకులు వస్తూ ఉంటారు.
ఘీవర్ – జైపూర్
తేనె గూడు లాంటి తీపి వంటకాన్ని జైపూర్ ప్రాంతంలో ఘీవర్ అని పిలుస్తుంటారు. ఇది సంక్రాంతి సమయంలో ఎక్కువగా అందుబాటులో ఉంటుంది.. రాజస్థాన్లోని జైపూర్, జోద్ పూర్ ప్రాంతంలో ఈ వంటకాన్ని తయారు చేస్తుంటారు.. మిగతా పట్టణాల్లో రకరకాల ఫ్లేవర్లలో ఇది అందుబాటులో ఉంటుంది. నెయ్యి లో గోధుమపిండితో తేనె గూడు లాంటి ఆకృతిని కాల్చిన తర్వాత.. దానిని బెల్లం పానకం లో ముంచి ఇస్తారు. ఇది స్వర్గపు అంచుల వరకు తీసుకెళ్తుందని దీనిని తిన్నవారు చెబుతుంటారు.
పెథాస్ – అగ్రా
ఆగ్రా నగరానికి తాజ్ మహల్ ఎంత ఫేమసో..పెథాస్ కూడా అంతే ఫేమస్. బూడిది గుమ్మడికాయ గుజ్జు, బెల్లం, నెయ్యి, ఎండు ద్రాక్ష, ఎండు ఫలాలు, యాలకులు, దాల్చిన చెక్క వంటి వాటితో ఈ వంటకాన్ని తయారు చేస్తారు. పర్యాటకులు ఈ వంటకాన్ని అమితంగా ఆస్వాదిస్తారు.
రసగుల్లా – కోల్ కతా
కోల్ కతా పేరు చెప్పగానే దుర్గాదేవి, హౌరా బ్రిడ్జి గుర్తుకు వస్తాయి. వీటితోపాటు రసగుల్లా కూడా కోల్ కతా ప్రాంతానికి ప్రత్యేకమైన వంటకం.. ఖర్జూర, బెల్లం, ఎండుఫలాలతో తయారుచేసిన రసగుల్లాలు అద్భుతంగా ఉంటాయి. బెంగాలీ వాసులు రకరకాల ఫ్లేవర్లలో రసగుల్లాలు తయారు చేస్తుంటారు. రసగుల్లాలు ఇక్కడి నుంచి ఇతర దేశాలకు కూడా ఎగుమతి అవుతుంటాయి.
పెడాలు – మధుర
శ్రీకృష్ణుని జన్మస్థలంగా మధురకు పేరు ఉంది. ఈ ప్రాంతంలో పెడ అనే టీవీ వంటకాన్ని తయారు చేస్తుంటారు. పాలు, మీగడ, చక్కెర, యాలకులు వంటి వాటితో దీనిని తయారు చేస్తారు. ఈ వంటకానికి విపరీతమైన డిమాండ్ ఉంటుంది. శ్రీకృష్ణుని జన్మాష్టమి రోజు పెడా లకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది.
కాజా – కాకినాడ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడలో “కాజా” అనే వంటకం విపరీతమైన ప్రాచుర్యం పొందింది.. ముందుగా బియ్యం లేదా మైదా లేదా గోధుమపిండితో కాజాలు తయారు చేస్తారు. అనేక ప్రక్రియల అనంతరం కాజాను ఆ తర్వాత చక్కెర పాకంలో ముంచుతారు. ఈ వంటకం చూసేందుకు జ్యూసీగా.. పొరలు పొరలుగా.. తింటుంటే నోటికి అద్భుతమైన రుచిని అందిస్తుంది.
మైసూర్ పాక్ – మైసూర్
మైసూర్లో 1935 లో కృష్ణరాజ్ వడియార్ -4 పరిపాలన కాలంలో ఈ వంటకం తయారు చేశారని చెబుతారు.. రాజ్ కోసం ప్యాలెస్ ప్రధాన వంట నిపుణుడు కాకాసుర మాధవ ఈ మిఠాయిని సృష్టించాడని తెలుస్తోంది. శనగపిండి, నెయ్యి, చక్కెరను ఉపయోగించి.. ఈ వంటకాన్ని తయారు చేశాడని సమాచారం. నాటి నుంచి ఇది అనేక రకాల మార్పులు చెందుతూ మైసూర్ పాక్ గా స్థిరపడిపోయింది.
ఖుర్బాని కా మీఠా
హైదరాబాద్ ను పరిపాలిస్తున్నప్పుడు నిజాం ప్రభువులు ఈ వంటకాన్ని ఎక్కువగా తినేవారు.. ఎండిన ఆఫ్రికాట్ లు, చక్కర పానకం, నెయ్యి, ఇతర ఎండు ఫలాలతో దీనిని తయారు చేస్తారు. ముఖ్యంగా ముస్లింలు తమ ఇంట్లో వేడుకలు జరిగినప్పుడు ఈ వంటకాన్ని తయారుచేస్తారు.. హైదరాబాదులోని అనేక హోటల్స్ ఖుర్బాని కా మీఠా సర్వ్ చేస్తున్నాయి.