Extramarital Relationship: ఇది మామూలు దారుణం కాదు.. వినడానికి ఇబ్బందే.. చెప్పడానికి కూడా ఇబ్బందే. ఎందుకంటే ఈ సంఘటన అటువంటిది కాబట్టి. సభ్య సమాజం తలదించుకునేది కాబట్టి.. వాస్తవానికి ఇలాంటి సంఘటనలు జరిగిన తర్వాత పెడపోకడలు ఎలా ఉంటాయో.. వాటి వల్ల జరిగే అనర్ధాలు ఎంత దారుణంగా ఉంటాయో కళ్లకు కడతాయి. ఇటువంటి వాటిని చూస్తూ ఉండడం కంటే.. చెప్పుకొని గుండెలు బాదుకోవడం కంటే.. అసలు ప్రస్తావించకుండా ఉంటేనే మంచిది. కాకపోతే ఇటువంటి ఘటనల గురించి లోతుగా కాకుండా.. మామూలుగానైనా సమాచారం ఇవ్వాలి కాబట్టి రాయక తప్పడం లేదు. ఎందుకంటే ఇలాంటి కథనం చూసైనా సరే సమాజంలో కొంతలో కొంత మార్పు వస్తే మేము విజయవంతమైనట్టే.
అది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లలిత్పూర్ ప్రాంతం.. ఈ ప్రాంతంలో పాలి అనే ఒక గ్రామం ఉంటుంది. అక్కడ ఒక రైతు, తన భార్యతో కలిసి నివసిస్తున్నాడు. ఇతడికి ఇద్దరికీ కూతుర్లు.. 10 సంవత్సరాల క్రితమే వీరిద్దరికీ పెళ్లి చేశాడు.. వాళ్లకు పిల్లలు కూడా కలిగారు. అయితే వారిద్దరి సంసారం అన్యోన్యంగా సాగుతున్న క్రమంలోనే అనుకోకుండా ఒక మలుపు చోటుచేసుకుంది. అది వారి జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. ఎంతగా అంటే కనీసం వాటి గురించి చర్చించుకోవాలంటేనే భయం వేసేంతగా.. ఈ సంఘటనలో మనుషులు విలువలు మర్చిపోయారు. నైతిక విలువలను గాలికి వదిలేశారు.. బంధాలను పూర్తిగా పక్కన పెట్టారు. అంతిమంగా మృగాల మాదిరిగా వ్యవహరించారు.
పాలి ప్రాంతంలో ఆ ఇద్దరు అక్కా చెల్లెళ్ల సంసారాలు మొదట్లో బాగానే ఉండేవి. పైగా వీరికి పిల్లలు కూడా కలిగారు. సరిగ్గా ఆరునెలల క్రితం చెల్లి అక్క భర్త తో ప్రేమలో పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది.. దీంతో వారిద్దరు పారిపోయారు. మొదట్లో వారిద్దరి గురించి కుటుంబ సభ్యులకు పెద్దగా అనుమానం రాలేదు. అయితే ఆ తర్వాత ఇద్దరు ఇళ్లలో నుంచి పారిపోవడంతో అనుమానం వచ్చింది. వారిద్దరి గురించి వెతకడం మొదలుపెట్టారు. అయితే వారిద్దరూ పెళ్లి చేసుకున్నారని తేలింది.. పెళ్లి చేసుకున్నారని భావించిన తర్వాత వాళ్ళ మానానా వాళ్ళే ఉంటారని వదిలేశారు.
వారిద్దరి కోసం వెతుకుతున్న క్రమంలో అక్క, చెల్లి భర్త మధ్య ఆకర్షణ మొదలైంది.. అది కాస్తా ప్రేమగా మారింది.. అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. దీంతో వారిద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. చివరికి అన్నంత పనీ చేశారు. వీరిద్దరూ వివాహం చేసుకున్న తర్వాత పారిపోయిన వారిద్దరు కూడా తిరిగి వచ్చారు. పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీలు జరిగిన తర్వాత.. చివరికి ఎవరి పిల్లల్ని వారు తీసుకున్నారు.. ప్రస్తుతం వేరువేరు ప్రాంతాలలో సంసారం సాగిస్తున్నారు.. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. అదే సమయంలో సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసింది. ఇటువంటి ఘటనలు మానవ సంబంధాలను ప్రశ్నిస్తున్నాయి. మనుషులకంటే మృగాలే నయం అనేలా అనిపిస్తున్నాయి.