OG Movie OTT: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ఓజీ(They Call Him OG) చిత్రం విడుదలై 11 రోజులు పూర్తి అయ్యింది. సుమారుగా 12 ఏళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో భారీ వసూళ్లను, రికార్డ్స్ ని సొంతం చేసుకొని, ఇప్పటికీ డీసెంట్ రన్ ని సొంతం చేసుకుంటూ ముందుకెళ్తుంది. బాక్స్ ఆఫీస్ వద్ద 300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఓటీటీ లోకి ఎప్పుడొస్తుంది అని ఎదురు చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ సంస్థ భారీ రేట్ కి కొనుగోలు చేసింది. థియేటర్స్ లో విడుదల అయ్యాక నాలుగు వారాల తర్వాత ఓటీటీ లో విడుదల చెయ్యాలి అనే ఒప్పందాన్ని కుదిరించుకున్నారు మేకర్స్. ఈ కారణం చేతనే ఈ చిత్రం హిందీ నేషనల్ మల్టీప్లెక్స్ థియేటర్స్ లో విడుదల కాలేదు.
కాబట్టి ఈ చిత్రం ఎట్టిపరిస్థితిలోనూ ఈ నెలాఖరునే నెట్ ఫ్లిక్స్ లో విడుదల కాబోతుంది. తెలుగు, హిందీ, తమిళం తో పాటు ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. అయితే థియేటర్స్ లో ఆడియన్స్ కి తన టేకింగ్ తో డైరెక్టర్ సుజిత్ ఎలాంటి థ్రిల్లింగ్ అనుభూతిని కలిగించాడో, ఓటీటీ లో కూడా అదే రేంజ్ అనుభూతిని కలిగించే ప్రయత్నం చేస్తున్నాడట. ఈ సినిమా ఓటీటీ వెర్షన్ లో థియేటర్స్ లో చూడని ఎన్నో సన్నివేశాలను జత చేసి విడుదల చేయబోతున్నారట. ఇది అభిమానులకు కచ్చితంగా మంచి కిక్ ని ఇచ్చే అనుభూతిని కలిగిస్తుందని అంటున్నారు. దాదాపుగా పది నిమిషాల ఫుటేజ్ ని జత చేయబోతున్నారట. అయితే మొదటి వారం తర్వాత సినిమాలో నేహా శెట్టి ఐటెం సాంగ్ ని జత చేశారు. ఇది ఓటీటీ వెర్షన్ లో ఉంటుందా లేదా అనేది చూడాలి.
అదే విధంగా కొన్ని సన్నివేశాలను మొదటి వారం తర్వాత కట్ చేశారు. అవి కూడా ఓటీటీ వెర్షన్ లో జత చేసి విడుదల చేస్తారా అని అడుగుతున్నారు ఫ్యాన్స్. చూడాలి మరి ఈ సరికొత్త సన్నివేశాలు ఎలా ఉండబోతున్నాయి అనేది. థియేటర్స్ లో అద్భుతమైన రెస్పాన్స్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం, ఓటీటీ లో కూడా అదే రేంజ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంటుందా?, #RRR తరహా లో నేషనల్ లెవెల్ లో అత్యధిక కాలం ట్రెండ్ అవ్వబోతుందా? వంటి అంశాలు రాబోయే రోజుల్లో చూడాలి. కొత్త జనరేషన్ జనాలు మాత్రం ఈ సినిమా ని చూసి మెంటలెక్కిపోయి ఉన్నారు. ఇది కదా పవన్ కళ్యాణ్ సినిమా అంటే అని కామెంట్ చేస్తున్నారు. కాబట్టి ఓటీటీ లోకి వచ్చిన తర్వాత ఈ సినిమా ఇంకా పెద్ద రేంజ్ కి వెళ్తుందని అనుకోవచ్చు.