Lightning Strikes Plane: వర్షాలు పడినప్పుడు పిడుగులతో జాగ్రత్తగా ఉండాలి. మేఘాల్లో ఏర్పడే విద్యుత్ విస్పోటనం పిడుగు లాగా మారి భూమి పైకి పడుతుంది. ఇది మనుషులపై పడవచ్చు లేదా ఇళ్లపై పడొచ్చు లేదా కొన్ని ప్రత్యేకమైన చెట్లపై పడి ధ్వంసం అయ్యే అవకాశం ఉంటుంది. పిడుగు పడిన ప్రదేశంలో 30 వేల సెంటిగ్రేడ్ వరకు ఉష్ణోగ్రత ఉంటుంది. అందుకే పిడుగు పడిన చోట ఆ ప్రాంతం అంతా ధ్వంసం అయ్యే అవకాశం ఉంటుంది. అయితే మేఘాల నుంచి పడే ఈ పిడుగులు ఆకాశంలో ప్రయాణించే విమానంపై పడితే ఎలా? అన్న సందేహం చాలా మందిలో కలుగుతుంది. మరి విమానాలపై పిడుగులు పడితే ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం..
ఎప్పుడూ ఆకాశంలో వివరించే విమానాలపై పిడుగులు పడడం చాలా అరుదు. ఏడాదిలో ఒకటి లేదా రెండు విమానాలపై పిడుగులు పడుతూ ఉంటాయి. వాస్తవానికి విమానంలో వందల మంది ప్రయాణం చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు విమానంపై పిడుగు పడితే అంత మంది మరణించే అవకాశం ఉంటుంది. కానీ విమానంపై పిడుగు పడితే ఎలాంటి నష్టం జరగదు. ఎందుకంటే విమానం పూర్తిగా ఫెరడే కేజీ అనే లేయర్ తో తయారు చేస్తారు. ఈ లేయర్ వల్ల పిడుగు విమానం లోపలికి వెళ్లకుండా ఆపుతుంది. అంతేకాకుండా ఈ లోహం విద్యుత్ క్షేత్రాలను లోపలికి వెళ్లకుండా కాపాడుతుంది. అయితే విమానంపై పిడుగు పడిన అది పక్క నుంచి వెళ్ళిపోతుంది. సాధారణంగా విమానం ముందటి భాగం లేదా రెక్కలపై ఎక్కువగా పిడుగులు పడుతూ ఉంటాయి. అలా పడినప్పుడు దీని ప్రయాణంలో పక్కకు జరిగిపోతూ ఉంటుంది. అంతేకాకుండా అభిమానపు లోపలి పొర ఎగ్జాస్ట్ లేదా రెక్కల చివర నుంచి బయటకు వెళ్తుంది.
ఒకవేళ విమానం మధ్యలో పిడుగు పడినా కూడా గీతలు లాగా ఏర్పడుతాయి. కానీ పెద్దగా నష్టం ఉండదు. అయితే ఇవి కూడా పడకుండా లైట్నింగ్ ప్రొటెక్షన్ సిస్టం తో ఉంటాయి. ప్రయాణంలో పిడుగు పడితే ల్యాండ్ అయిన తర్వాత రక్షణ సిబ్బంది వెంటనే సరి చేస్తారు. అయితే 1930 నుంచి 1960 మధ్యల కాలంలో విమానాలపై పిడుగులు పడి ప్రమాదాలు జరిగాయి. కానీ నేటి కాలంలో సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. దీనివల్ల విమానాలపై పిడుగులు పడినా.. ఎలాంటి నష్టం లేకుండా తయారు చేస్తున్నారు. ఒక్కోసారి విమానం ప్రయాణించే సమయంలో వర్షం పడే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో కూడా సురక్షితంగా ప్రయాణం చేసే విధంగా టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చారు.