https://oktelugu.com/

Fish: మనకే కాదు.. చేపలకు కూడా డెంటిస్టులు ఉంటారు తెలుసా..

క్లీనింగ్ ఫిష్ చూడ్డానికి స్వల్ప పరిమాణంలో ఉంటాయి. వీటికి నేరుగా వేటాడే సామర్థ్యం ఉండదు. అందువల్లే పెద్ద పెద్ద చేపల నోట్లోకి ప్రవేశించి క్లీనింగ్ ప్రక్రియ చేపడతాయి. మృత చర్మాన్ని, ఇతర కణజాలాన్ని క్లీనింగ్ ఫిష్ ఆహారంగా తీసుకుంటాయి.

Written By:
  • Bhaskar
  • , Updated On : December 10, 2024 / 02:53 PM IST

    Fish

    Follow us on

    Fish: మనుషులకు అయితే డెంటిస్టులు ఎలా ఉంటారు.. చేపలకు కూడా అలానే ఉంటాయి. కాకపోతే అవి కూడా చేపలే కావడం విశేషం. పగడపు దిబ్బలపై నివసించే లాబ్రాయిడ్స్ జాతికి చెందిన చేపలు క్లీనర్ ఫిష్ గా పేరుపొందాయి. లాబ్రాయిడ్స్ లో గోబియోసోమా, నియాన్ గోబీ చేపలు క్లీనర్ ఫిష్ లు గా పనిచేస్తాయి. ఇవి పెద్ద పెద్ద చేపల నోటిలోకి సులభంగా వెళ్తాయి. మృత చర్మం, ఎక్టో పారాసైట్, ఉపరితల కణజాలాలను తొలగిస్తాయి. క్లీనర్ ఫిష్ లు పెద్ద చేపల నోట్లోకి వెళ్ళినప్పుడు ఏమీ అనవు. క్లీనర్ ఫిష్ లు సుదూరంగా ఉన్నప్పుడే పెద్ద చేపలు తమ నోటిని అమాంతం తెరిచి ఉంచుతాయి. అలా తెరిచి ఉంచడం వల్ల క్లీనర్ ఫిష్ లు నేరుగా నోటిలోకి వెళ్తాయి. దంతాల మధ్యలో ఇరుక్కున్న మృత చర్మాన్ని తొలగిస్తాయి. కణజాలాలను శుభ్రం చేస్తాయి. ఆ సమయంలో పెద్ద చేపలు వేటకు ఉపక్రమించవు. పైగా అవి నోటిని అమాంతం మూసేసుకొని ఉంటాయి. లోపల క్లీనింగ్ ప్రక్రియ మొత్తం పూర్తయిన తర్వాత.. క్లీనింగ్ ఫిష్ లు బయటికి వచ్చే సమయంలో.. సంకేతాలు ఇస్తాయి. దీంతో పెద్ద చేపలు నోరు తెరిచేస్తాయి. ఆ తర్వాత క్లీనింగ్ ఫిష్ లు బయటికి వెళ్లిపోతాయి. తమ నోటిని శుభ్రం చేసే క్లీనింగ్ ఫిష్ కు పెద్ద చేపలు ఎటువంటి హాని తలపెట్టవు. పైగా వాటిని అపురూపంగా చూసుకుంటాయి. తమ వేటాడిన మాంసాన్ని వాటికి కూడా ఇస్తాయి.

    క్లీనింగ్ ఫిష్ కు ఆహారం..

    క్లీనింగ్ ఫిష్ చూడ్డానికి స్వల్ప పరిమాణంలో ఉంటాయి. వీటికి నేరుగా వేటాడే సామర్థ్యం ఉండదు. అందువల్లే పెద్ద పెద్ద చేపల నోట్లోకి ప్రవేశించి క్లీనింగ్ ప్రక్రియ చేపడతాయి. మృత చర్మాన్ని, ఇతర కణజాలాన్ని క్లీనింగ్ ఫిష్ ఆహారంగా తీసుకుంటాయి. ఇలా ప్రతిరోజు ఒక్కో పెద్ద చేప నోట్లోకి ప్రవేశించి క్లీనింగ్ ప్రక్రియ చేపడతాయి. ఇలా క్లీనింగ్ ప్రక్రియ చేపట్టడం ద్వారా క్లీనింగ్ ఫిష్ ఆహారాన్ని సము పార్జించుకుంటాయి. పెద్ద చేపల నోట్లో క్లీనింగ్ ప్రక్రియ చేపట్టడం ద్వారా.. వాటికి ఎటువంటి దంత సమస్యలు రావు. నోటికి సంబంధించిన వ్యాధులు దరి చేరవు. వ్రాస్సే, స్లచిడ్, క్యాట్ ఫిష్, లంప్ సకర్స్, పైపు ఫిష్, గోబీస్ వంటివి క్లీనింగ్ ఫిష్ గా పేరుపొందాయి. ఇది ఎక్కువగా ఉష్ణ మండల సముద్రాలలో కనిపిస్తాయి.. వీటిల్లో అబ్లికేట్ చేపలు దీర్ఘకాలం క్లీనర్ ఫిష్ గా ఉండగా.. ఫ్యాకల్టెటివ్ చేపలు స్వల్పకాలం క్లీనర్ ఫిష్ గా ఉంటాయి. ఇవి సమూహాలుగా జీవిస్తుంటాయి. క్లీనింగ్ ఫిష్ తినడానికి పనికిరావు. ఇవి సముద్రంలో నివసించే చిన్న చిన్న పురుగులను తింటాయి. అందువల్ల వీటి శరీరం విషపూరితమై ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతుంటారు.. పెద్ద చేపల్లో క్లీనింగ్ ఫిష్.. క్లీనింగ్ ప్రక్రియ చేపట్టడం ద్వారా వాటి న్యూరో ఎండోక్రైన్ వ్యవస్థ ప్రభావితమవుతుంది. ఆర్జి నైన్, వాసోటోసిన్, ఐసోటోసిన్, సెరటో నైన్ అనే హార్మోన్లు ప్రభావితం అవుతుంటాయి.