Nikesh Arora Success Story : జీవితం అనేది కొందరికి మాత్రమే పూల పాన్పు. మిగతా వారికి ముళ్లదారి. అటువంటి దారుల్లో ధైర్యంగా అడుగులు వేస్తూ.. రక్తాలు కారుతున్నా.. గాయాలు అవుతున్నా.. ధైర్యంగా ముందడుగు వేసేవారే జీవితంలో నిలబడగలుగుతారు. ఆ జాబితాలో ఈయన ముందు వరుసలో ఉంటారు.
మనలో చాలామందికి ఒకసారి వైఫల్యం ఎదురైతే జీవితమంతా మునిగిపోయినట్టు భావిస్తుంటారు. కొంతమంది అసలు ప్రయత్నాలు చేయకుండానే చేతులు ఎత్తేస్తారు. కానీ, ఈయన మాత్రం దాదాపు 400 సార్లు తిరస్కారాలు ఎదుర్కొన్నారు. ఓటమి ఎదురైన ప్రతి సందర్భంలోనూ గెలుపు కోసం కలలు కన్నారు. ఆ గెలుపును దక్కించుకునేంతవరకు శ్రమించారు. చివరికి ఆయన శ్రమ ఫలించింది గెలుపు దక్కింది. గెలుపు దక్కిన మరుక్షణం ఆయన తనకు ఎదురైన 400 ఓటములను మర్చిపోయారు. తన సంకల్పాన్ని గుర్తు చేసుకుంటూ మరింత ధైర్యంగా ముందడుగులు వేశారు.
ప్రపంచంలో అత్యధిక వేతనాలు అందుకుంటున్న టాప్ సీఈఓ లను ఒకసారి పరిశీలిస్తే అందులో కచ్చితంగా నికేష్ అరోరా ఉంటారు. నికేష్ ప్రతిష్టాత్మకమైన ఫాలో ఆల్టో నెట్వర్క్ సంస్థలకు నాయకత్వం వహిస్తున్నారు. వారణాసి ఐఐటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివారు. ఆ తర్వాత అమెరికా వెళ్లారు. అప్పటికే నికేష్ తండ్రి విమానయాన రంగంలో న్యాయవాదిగా పనిచేసి పదవి విరమణ చేశారు. నికేష్ కు అమెరికా వెళ్లాలి అనే కోరిక ఉన్నప్పటికీ.. ఆ స్థాయిలో డబ్బు లేదు. దీంతో తండ్రి రిటైర్మెంట్ అయ్యాక వచ్చిన డబ్బులో కొంత మొత్తం తీసుకుని అమెరికా వెళ్లిపోయారు. అప్లికేషన్ ఫీజు లేని యూనివర్సిటీలకు మాత్రమే అతడు అప్లై చేసేవాడు. చివరగా అతడికి నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీలో ఉపకార వేతనంతో చదువుకునే అవకాశం లభించింది. అక్కడ అతడికి కంప్యూటర్ సైన్స్ బోధించి డబ్బులు సంపాదించుకునే అవకాశం కూడా యూనివర్సిటీ అందించింది. వాస్తవానికి అతనికి అప్పడికి కంప్యూటర్ తో పెద్దగా సంబంధం లేదు. కానీ, ఆ ఆఫర్ వదులుకుంటే డబ్బులు రావని ఓకే చెప్పేశాడు. ఆ తర్వాత కంప్యూటర్ నేర్చుకుని అమెరికా ఫ్లైట్ ఎక్కాడు. అమెరికాలో దిగిన తర్వాత నికేష్ చేతిలో ఉన్నది కేవలం 1700 మాత్రమే. దీంతో రాత్రిపూట ట్యూషన్ చెప్పేవాడు.. సెక్యూరిటీ గార్డుగా పని చేశాడు. చదువు పూర్తిగా గానే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేశాడు. ఎన్నో సంస్థలకు దరఖాస్తులు పంపాడు. ఇలా 400 సంస్థలకు అప్లై చేసుకుంటే ఒక అవకాశం కూడా రాలేదు. ఆ సంస్థలు అనేక కారణాలు చెప్పేవి.
చివరికి ఫెడిలిటీ ఇన్వెస్ట్మెంట్ అనే సంస్థలో తక్కువ జీతంతో ఉద్యమంలో చేరాడు. ఇదే సమయంలో బోస్టన్ కాలేజీలో చేరాడు. ఎంఎస్ ఫైనాన్స్ చేశాడు. ఆ తర్వాత సి ఎఫ్ ఏ కోర్స్ చదివాడు. 2004లో గూగుల్ సంస్థలు అడుగుపెట్టాడు. సంస్థ ఆదాయాన్ని 200 కోట్ల నుంచి 6000 కోట్లకు చేర్చాడు. మొదటి సామర్థ్యాన్ని జపాన్ కంపెనీ గుర్తించి భారీ ఆఫర్ ఇచ్చింది. కానీ అతడు ఫాలో ఆల్టో నెట్వర్క్ సంస్థలో పనిచేయడానికి ఇష్టాన్ని చూపించాడు. ఈ సంస్థ కార్పొరేట్ కంపెనీలకు సైబర్ రక్షణ కల్పిస్తుంది. 2018లో నికేష్ ఈ సంస్థలో చేరినప్పుడు 1800 కోట్ల విలువైన వ్యవస్థగా ఉండేది. ఇప్పుడు ఆ సంస్థ విలువ దాదాపు 11 లక్షల కోట్లకు చేరుకుంది. ప్రస్తుతం నికేష్ ఏడాదికి 1370 కోట్ల వేతనం అందుకుంటున్నాడు.