https://oktelugu.com/

Dead Body: డెడ్‌ బాడీలు ఎందుకు నీటిలో మునగకుండా తేలుతాయి?

సాధారణంగా నీటిలో కొన్ని వస్తువులు మునిగితే.. మరికొన్ని తేలుతాయి. రాళ్లు వంటివి మునిగితే తేలిక వస్తువులు తేలుతాయి. అయితే నీటిలోకి ఓ మనిషి వెళ్తే మునిగిపోతారు. వారికి ఈత వస్తే బతుకుతారు. ఒకవేళ రాకపోతే అలా వాటర్‌లో మునిగిపోతుంటారు. అదే డెడ్ బాడీ అయితే మునగకుండా తేలుతుంది. మరి ఈ డౌట్ ఎప్పుడైనా మీకు వచ్చిందా? దీనికి గల కారణం ఏంటి? అనే విషయాలు పూర్తిగా తెలుసుకుందాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 11, 2024 / 02:05 AM IST

    float

    Follow us on

    Dead Body: మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతుంటాయి. ఎన్నో వాటిని చూస్తుంటాం. కానీ వాటిని పెద్దగా పట్టించుకోం. మరికొందరు ఎక్కడ ఉన్న కూడా వారికి డౌట్స్ వస్తాయి. ఉదాహరణకు ఏదైనా చెట్టు దగ్గర ఉంటే ఈ చెట్టు ఇంత పెద్దగా ఎలా పెరిగింది? ఈ చెట్టు ఆకులు ఎందుకు ఇలా ఉన్నాయి? అంటూ సందేహ పడుతుంటారు. అంటే ఇలాంటి వారికి ఏ వస్తువుని అయిన చూసిన కూడా వాళ్ల మదిలో ఎన్నో ప్రశ్నలు మొదలవుతాయి. కానీ ఈ డౌట్ అందరికి వచ్చి ఉంటుందని చెప్పలేం. సాధారణంగా నీటిలో కొన్ని వస్తువులు మునిగితే.. మరికొన్ని తేలుతాయి. రాళ్లు వంటివి మునిగితే తేలిక వస్తువులు తేలుతాయి. అయితే నీటిలోకి ఓ మనిషి వెళ్తే మునిగిపోతారు. వారికి ఈత వస్తే బతుకుతారు. ఒకవేళ రాకపోతే అలా వాటర్‌లో మునిగిపోతుంటారు. అదే డెడ్ బాడీ అయితే మునగకుండా తేలుతుంది. మరి ఈ డౌట్ ఎప్పుడైనా మీకు వచ్చిందా? దీనికి గల కారణం ఏంటి? అనే విషయాలు పూర్తిగా తెలుసుకుందాం.

    సాధారణంగా చాలా మంది స్విమ్మింగ్ చేస్తుంటారు. ముఖ్యంగా గ్రామాల్లో అయితే చెరువులు, కొలనుల దగ్గరకు స్నానానికి వెళ్తుంటారు. ఈ క్రమంలో ఈత కొడుతూ స్నానం చేస్తారు. అదే వారికి ఈత వస్తే ఎలాంటి సమస్య ఉండదు. హ్యాపీగా స్విమ్ చేస్తారు. అదే ఈత కనుక రాకపోతే మాత్రం వారు మునిగిపోతారు. అలా చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అయితే సాధారణ బాడీ నీటిలో తేలదు. అదే డెడ్ బాడీ నీటిలో మునగకుండా తేలుతుంది. దీనికి ఓ ముఖ్య కారణం ఉంది. వ్యక్తి లేదా జంతువు ఏదైనా చనిపోయినప్పుడు లోపల బ్యాక్టీరియా ఏర్పడుతుంది. ఇది వివిధ రకాలైన వాయువులను ఉత్పత్తి చేస్తుంది. దీంతో డెడ్ బాడీ సాంద్రత అనేది తగ్గిపోతుంది. ఈ కారణం వల్లనే డెడ్ బాడీ నీటిపై తేలుతుందని కొందరు అంటున్నారు. మరికొందరు ఏమో.. మరణించిన తర్వాత శరీరానికి ఎలాంటి ఆక్సిజన్ సరఫరా ఉండదు. దీంతో కార్బన్ డయాక్సైడ్ పూర్తిగా బయటకు వస్తుంది. వీటివల్ల లోపల ఉండే కణాలు చనిపోతాయి. అప్పుడు శరీరం లోపల గాలి ఉండే పరిమాణం పెరుగుతుంది. దీనివల్ల నీటి సాంద్రత తగ్గుతుంది. శరీర సాంద్రత కంటే నీటి సాంద్రత తగ్గడం వల్ల డెడ్‌బాడీ వాటర్‌లో తేలుతుందని కొందరు అంటున్నారు.

    ఈ డెడ్ బాడీ నీటిపై తేలడం అనేది సాంద్రత బట్టి ఆధారపడి ఉంటుందని కొందరు అంటున్నారు. ఎందుకంటే ఇది స్థానభ్రంశం చేసే నీటిపైన ఆధారపడి ఉంటుందట. దీనివల్ల బరువు వస్తువులు నీటిలో మునిగిపోతాయి. తేలిక వస్తువులు పైకి తేలుతాయి. మరణించిన వ్యక్తిలో ఎలాంటి బరువు లేకపోవడం వల్ల డెడ్ బాడీలు తేలుతాయి. చనిపోయిన తర్వాత ఆ బాడీ నీటితో ఉబ్బుతుంది. దీనివల్ల మునగకుండా పైకి తేలుతుందట.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలన్నీ కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది.