Countries Without Trees: ప్రకృతి మనకు ఎన్నో అందిస్తుంది. అందుకే ప్రకృతిని కాపాడుకోవడం మన నైతిక బాధ్యత. మానవ మనుగడ వాతావరణంపైనే ఆధారపడి ఉంటుంది. జీవరాశి మనుగడకు ప్రకృతి, పర్యావరణమే జీవాధారం. వాతావరణ సమతుల్యం దెబ్బతింటే భూమిపై జీవరాశి మనుగడ కష్టమవుతోంది. రుతువులు, కాలాలు, సీజన్లకు కారణం ప్రకృతే. ప్రకృతిలో ఉన్న చెట్ల ఆధారంగానే ఇప్పటికీ రుతువులు కొనసాగుతన్నాయి. అయితే కాస్త అటూ ఇటుగా వేసవి, వానాకాలం, శీతాకాలం సీజన్లు మారుతున్నాయి. చెట్లు లేకుంటే భూమిపై వర్షాలు కురవవు. వర్షాలు కురవకుంటే నీళ్లు దొరకవు. పంటలు పండవు. అప్పుడు జీవరాశి మనుగడే ఉండదు. కానీ ప్రపంచంలో ఇప్పటికీ కొన్ని దేశాల్లో చెట్లు మచ్చుకైనా కనిపించవు. మనం అడవులు తగ్గిపోతుండడంతో వాతావరణ సమతుల్యం దెబ్బతింటోంది. ఇలాంటి పరిస్థితిలో ప్రభుత్వాలు మొక్కలు నాటి చెట్లు పెంచుతోంది. కృత్రిమ అడవులు సృష్టిస్తోంది. వాతావరణ సమతుల్యం కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. గ్లోబల్‌వార్మింగ్ తగ్గించేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నాయి. మొక్కల వల్ల జీవరాశికి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అవి మన కార్బన్ డై ఆక్సైడ్‌ను పీల్చుకుని ఆక్సీజన్‌ను వదులుతాయి. అయితే భూమిపై వాతావరణం అంతా ఒకేలా లేదు. భౌగోళిక పరిస్థితులు, ధ్రువాలు, అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా మారుతోంది. ఈ కారణంగా ప్రపంచంలో కొన్ని దేశాల్లో చెట్లు పెరగడం లేదు. అలాంటి దేశాల్లోనూ మనుషులు జీవనం సాగిస్తున్నారు. అసలు చెట్లు లేకుండా ఆ దేశంలో ప్రజలు బతుకుతున్నారు..? అనే డౌట్ మీకు కూడా వస్తుందా..? చెట్లు లేని దేశాలు ఏంటో తెలుసుకుందాం.
గ్రీన్‌ల్యాండ్..
గ్రీన్‌లాండ్. ఈ పేరు వినగానే మీకు ముందుగా గుర్తుకొచ్చేది ఆకుపచ్చని ప్రదేశాలు. అందమైన గార్డెన్‌లు, దట్టమైన అడవులు, పచ్చని ప్రకృతిని ఊహించుకుంటారు. అయితే ఇవన్నీ ఊహించుకుంటే మీరు తప్పులో కాలేసినట్లే. పులిహోరలో పులి లేనట్లే.. గ్రీన్‌ల్యాండ్‌లో గ్రీనరీ లేదు. పేరులో గ్రీన్ ఉన్నా.. ఆ దేశంలో చెట్లు లేవు. వేల మైళ్ల దూరం ఈ దేశంలో ఒక్క చెట్టు కూడా కనిపించదు. గ్రీన్‌ల్యాండ్ ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపం. ఈ ప్రదేశం చుట్టూ హిమానీనదాలు కనిపిస్తాయి. వాస్తవానికి ఈ దేశం పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటుంది అందుకే ఎక్కువ మంది ఇక్కడ నివసించడానికి రారు. అందుకే ఆ దేశానికి గ్రీన్‌ల్యాండ్ అని పేరు పెట్టారు. తద్వారా వీలైనంత ఎక్కువ మందిని ఇక్కడ స్థిరపడటానికి ఆకర్షించారు.
ఖతార్..
గ్రీన్‌ల్యాండ్ తరహాలోనే ప్రపంచంలో మరో దేశం ఉంది. అక్కడ అంతే దేశ వ్యాప్తంగా చూసుకుంటే ఎక్కడా ఒక్క చెట్టు కూడా కనిపించదు. అదే ఖతార్. భారీ గ్యాస్ నిల్వలకు ప్రసిద్ధి చెందిన గల్ఫ్ దేశం సౌదీ అరేబియా. పర్షియన్ గల్ఫ్ దేశం మొత్తం ఎడారి కాబట్టి ఇక్కడ ఎక్కడా ఒక్క మొక్క కూడా కనిపించదు. చమురు నిల్వలు, ముత్యాల ఉత్పత్తి కారణంగా, ఈ దేశం ప్రపంచంలోని అత్యంత ధనిక దేశాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. అయితే ఇక్కడ చెట్లు లేకపోవడంతో పండ్లు, పూల కోసం ఇతర దేశాలపై ఆధారపడుతున్నారు. ఖతార్ ప్రపంచంలోనే అతిపెద్ద విమానయాన సంస్థలను కలిగి ఉంది. పెద్ద సంఖ్యలో ఆకాశహర్మ్యాలు, గృహాలను కలిగి ఉంది. కానీ అత్యంత విచారకరమైన విషయం ఏమిటంటే ఈ ధనిక దేశంలో ఒక్క చెట్టు కూడా లేకపోవడమే. ఖతార్‌లోని ఖాళీ స్థలంలో ఎక్కడ చూసినా ఎడారి మాత్రమే కనిపిస్తుంది. సంవత్సరంలో ఇక్కడ వర్షాలు చాలా తక్కువ కురుస్తాయి. కానీ ఇక్కడి ప్రజలు తమ దేశం వైపు తిరిగి చూడలేక 40 వేలకు పైగా చెట్లతో మానవ నిర్మిత అడవిని నిర్మిస్తున్నారు.
అంటార్కిటికా..
చెట్లులేని దేశాల జాబితాలో అంటార్కిటికా కూడా ఉంది. ఈ దేశంలో 98% మంచుతో కప్పబడి ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత శీతల ప్రదేశంగా పరిగణించబడుతుంది. వేసవిలో కూడా, ఇక్కడ సగటు ఉష్ణోగ్రత 20 డిగ్రీల వరకు ఉంటుంది. ఇక్కడ ఏ వృక్షజాలం పెరగడం అసాధ్యం.