Countries with Population Declining : ఒకప్పుడు ప్రపంచ జనాభా ఊహించని స్థాయిలో పెరిగేది. అందువల్ల జనాభా నియంత్రణ అనే అంశం తెరపైకి వచ్చింది. దీంతో అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న, పేద దేశాలు జనాభా నియంత్రణకు నడుం బిగించాయి. అయితే పేద దేశాలను మినహాయిస్తే అభివృద్ధి చెందుతున్న, అభివృద్ధి చెందిన దేశాలలో జనాభా సంఖ్య పడిపోతుంది. దీంతో పిల్లల్ని కనాలి అనే డిమాండ్ ను ఆయా దేశాలు తెరపైకి తీసుకొస్తున్నాయి. అంతేకాదు పిల్లల్ని కనే దంపతులకు బహుమతులను, ఇతర నజరానాలను అందిస్తున్నాయి.. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఐదు దేశాలలో మాత్రం జనాభా తీవ్రంగా తగ్గిపోయింది. దీంతో అక్కడ దేశాలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇంతకీ ఆ ఐదు దేశాలు ఏమిటంటే..
Also Read : పక్షుల కోసం జీవితాన్ని అంకితం చేశావంటే.. నువ్వు దేవుడు సామి..
టర్కీ..
ఇస్లాం మతాన్ని ఆచరించే ఈ దేశంలో 2001లో బర్త్ రేట్ 2.38 గా ఉండగా.. 2025లో ఇది 1.48 కి తగ్గిపోయింది. బర్త్ రేట్ తగ్గిపోవడంతో అక్కడి ప్రభుత్వం ఆలోచనలో పడింది.. దీంతో దంపతులు ముగ్గురు పిల్లల్ని కంపల్సరీ కనాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కొత్త జంటలకు ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు ప్రణాళికల రూపొందించింది. దేశంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడిన నేపథ్యంలో నూతన దంపతులు ముగ్గురు పిల్లల్ని కనడానికి వెనకడుగు వేస్తున్నట్టు తెలుస్తోంది.
వియత్నామ్
ఈ దేశంలో 1999 నుంచి 2022 వరకు బర్త్ రేట్ 2.1 గా ఉండేది. 2024 నుంచి 1.91 కు పడిపోయింది. అయితే ఈ దేశంలో ఆర్థికంగా సంక్షోభమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో చాలా జంటలు పిల్లల్ని కనాలంటే ఆలోచిస్తున్నాయి. దీనికి తోడు నిరుద్యోగం.. ఆడపిల్లల సంఖ్య తక్కువ ఉండడంతో యువకులకు వివాహాలు జరగడం లేదు. దీంతో అక్కడ బర్త్ రేటు తగ్గిపోతుంది. ఇక చాలామంది యువతులు వివాహాలు చేసుకోవడానికి ఇష్టపడటం లేదు. గృహహింసకేసులు పెరిగిపోవడం కూడా ఒక కారణం అని తెలుస్తోంది.
చైనా
డ్రాగన్ దేశంలో గత మూడు సంవత్సరాలుగా జనాభా అనేది పూర్తిగా తగ్గిపోతోంది. ఒక నివేదిక ప్రకారం ఈ శతాబ్దం చివరి నాటికి డ్రాగన్ పాపులేషన్ 1.4 బిలియన్ల నుంచి 80 లక్షలకు పడిపోయే అవకాశం ఉంది. డ్రాగన్ దేశంలో వృద్ధ జనాభా ఎక్కువగా ఉంది. దీంతో పనిచేసే వారి సంఖ్య తగ్గిపోతుంది. ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ల సంఖ్య పెరిగిపోతుంది. ఇది డ్రాగన్ ఎకనామికల్ స్ట్రక్చర్ ను ఇబ్బందులకు గురిచేస్తోంది. . ఆ దేశంలో జీవన వ్యయం పెరిగిపోవడంతో చాలామంది పిల్లల్ని కనడానికి ఆసక్తిని చూపించడం లేదు. ఒకప్పుడు ఇదే దేశంలో జనాభా ఎక్కువగా ఉండటంతో ప్రభుత్వం నియంత్రణ విధానాన్ని అమలు చేసింది.. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది.
న్యూజిలాండ్
శీతల దేశంగా పేరుపొందిన ఈ ప్రాంతంలో బర్త్ రేటు 2023లో రికార్డు స్థాయిలో 1.56 వరకు పెరిగిపోయింది. ఇప్పుడు ఆ దేశంలో 15 సంవత్సరాల యువతుల నుంచి 49 సంవత్సరాల మహిళలు ఎక్కువగా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆ దేశంలో పిల్లల సంఖ్య తక్కువగా ఉండడం విశేషం. 2022లో ఈ రేటు 1.66 గా ఉండగా.. 2025లో అది ఇంకా తగ్గిపోయింది. అయితే ఈ దేశంలో జననాల సంఖ్య తగ్గిపోతున్న నేపథ్యంలో.. ప్రభుత్వం సరికొత్త పథకాలను రూపొందిస్తున్నది. దంపతులను ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నది.
ఉత్తరకొరియా
యూ ఎన్ బయటికి వెల్లడించిన లెక్కల ప్రకారం ఈ దేశంలో బర్త్ రేటు 1.78 గా ఉంది. అయితే ఇక్కడ ఆర్థిక సంక్షోభం తీవ్రంగా ఉంది. దీనికి తోడు ఆడవాళ్ళల్లో రకరకాల అనారోగ్య సమస్యలు ఉన్నాయి. మూడు పూటల ఆహారం లభించడమే అక్కడ కష్టంగా ఉంది. అలాంటి చోట పిల్లల్ని కనడం అంటే ఆడవాళ్లకు ప్రత్యక్ష నరకమే. అందువల్లే అక్కడ జననాల సంఖ్య తగ్గిపోతోందని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేస్తోంది..