Chinar trees : మనుషులకు స్వార్థం ఎక్కువ. తాము మాత్రమే బతకాలని.. మిగతావన్నీ తమ కోసం త్యాగాలు చేయాలని ఆలోచించే ఏకైక జీవి మనిషి మాత్రమే. అందువల్లే ప్రకృతిపై పెత్తనం సాగిస్తూ ఉంటాడు. తన సుఖం కోసం.. తన సౌఖ్యం కోసం వనరులపై ఒత్తిడి పెంచుతూ ఉంటాడు. చివరికి తన మనుగడ కోసం ఎంతటి దారుణాల కైనా ఒడిగడుతూ ఉంటాడు.. అందువల్లే పర్యావరణం తీవ్ర ఒత్తిడికి గురవుతోంది. కాలుష్యం అంతకంతకు పెరుగుతోంది. ఇన్ని చేసినప్పటికీ మనిషి ఏమైనా బాగుపడుతున్నాడు అంటే.. లేదు. కనీసం వంద సంవత్సరాలు బతుకుతున్నాడా అంటే.. అది కూడా లేదు. నిత్యం రోగాలు.. జబ్బులు.. వంటి వాటితోనే పోరాటం చేస్తున్నాడు. ఒక మనిషి చేసిన అభివృద్ధి అనే విధ్వంసం వల్ల ప్రకృతి తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఇందులో ముఖ్యంగా అరుదైన వృక్షాలు, జంతువులు నాశనం అవుతున్నాయి. అయితే అలాంటి వాటిని కాపాడేందుకు తెరపైకి సరికొత్త ప్రయత్నాలు మొదలయ్యాయి.
Also Read : ఇదేం విడ్డూరం.. చెట్లను మొక్కలుగా మార్చుతున్నారు.. ఇదెలా సాధ్యం?
అరుదైన చెట్లకు ఆధార్ కార్డులు
మనిషి వికృత చేష్టల వల్ల అరుదైన వృక్షాలు నాశనమవుతున్నాయి. అలాంటి వాటి జాబితాలో చినార్ చెట్లు ముందు వరసలో ఉంటాయి. అయితే ఈ చెట్లు కాశ్మీర్ రాష్ట్రంలో మాత్రమే కనిపిస్తాయి. ఆ ప్రాంతానికి ఇవి ప్రత్యేకమైన పేరును సంపాదించి పెట్టాయి. ఈ మొక్కలను గతంలో మొదలు చక్రవర్తులు పర్షియా ప్రాంతం నుంచి తీసుకువచ్చారని తెలుస్తోంది. జమ్ము కాశ్మీర్లోని అక్బర్ దాల్ సరస్సు సమీపంలో నసీం బాగ్ వద్ద సుమారు 1200 చినార్ మొక్కలు నాటి రోజుల్లో మొగల్ చక్రవర్తులు నాటించారని తెలుస్తోంది. అయితే అప్పట్లో ఈ వృక్షాలు విస్తృతంగా ఎదిగినప్పటికీ.. గత కొంతకాలంగా తీవ్రమైన ముప్పును ఎదుర్కొంటున్నాయి. అభివృద్ధి.. పట్టణాలు పెరగడం.. విపరీతంగా వర్షాలు కురవడం.. పరుగు కాటకాలు ఏర్పడటం వల్ల ఈ వృక్షాలు మనుగడ ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. ఇక పర్యావరణంలో చోటుచేసుకున్న మార్పులు కూడా ఈ వృక్షాల మనుగడపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఈ క్రమంలో జమ్మూ కాశ్మీర్ అటవీశాఖ చినార్ వృక్షాలను రక్షించడానికి సరికొత్త విధానాన్ని తెరపై తీసుకొచ్చింది. 2021 నుంచి చినార్ వృక్షాలకు ఆధార్ గుర్తింపు కల్పించడం ప్రారంభించింది. ఇందులో భాగంగా ప్రతి చినార్ చెట్టుకు జియో ట్యాగింగ్ చేయడం ప్రారంభించింది. చెట్టుకు స్కాన్ చేయగల క్యూఆర్ ప్లేట్ ను కూడా అమర్చడం మొదలుపెట్టింది. అయితే వీటి ద్వారా ప్రతి చెట్టుకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుందని అట విశాఖ అధికారులు చెబుతున్నారు. ఏ చెట్టు ఎక్కడ ఉంటుందో కూడా వెంటనే తెలుస్తుందని.. దాని స్థితి.. ఎదుగుదల.. ఆరోగ్యం వంటి సమాచారం వెంటనే తెలుస్తుందని వారు అంటున్నారు..” చినార్ వృక్షాలు ప్రత్యేకమైనవి. అవి కాశ్మీర్ ప్రాంతంలో మాత్రమే కనిపిస్తాయి. ఇవి ఎత్తైన కాండంతో.. విశాలమైన ఆకులతో శరధృతువులో మాత్రమే బంగారు వర్ణంలో దర్శనమిస్తాయి. అరుదైన ఈ వృక్షాలను కాపాడుకోవాలని.. అప్పుడే కాశ్మీర్ రాష్ట్రానికి సొంతమైన వృక్షాలు మనగడ సాగిస్తాయని అటవీశాఖ అధికారులు నిర్ణయించడం.. ఆ దిశగా చర్యలు చేపట్టడం వల్ల చినార్ వృక్షాలు బతికి బటకట్టే పరిస్థితి ఏర్పడుతోంది