China: అవాంచిత గర్భం రాకుండా ఉండడానికి కం*డో*మ్ లు వాడుతూ ఉంటారు. ఒకప్పుడు కండోమ్ అని పేరు చెప్పడానికే సిగ్గుపడేవారు. కానీ ఇప్పుడు కిరాణం షాపుల్లో కూడా కం*డో*మ్ లు విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. గతంలో ఎయిడ్స్ వ్యాధి ఎక్కువగా కావడంతో ఈ వ్యాధి నివారణకు 1995 సంవత్సరంలో కం*డో*మ్ ను అందుబాటులోకి తీసుకువచ్చారు. అప్పటినుంచి ఇప్పటివరకు ఎయిడ్స్ వ్యాధి భారీన పడకుండా.. అవాంచిత గర్భం రాకుండా కం*డో*మ్ లను వాడుతున్నారు. కం*డో*మ్ పై అవగాహన పెరగడంతోనే చాలామంది దీనిని ఉపయోగిస్తున్నారు. అయితే కం*డో*మ్ పై కూడా పన్ను ఉంటుందన్న విషయం చాలామందికి తెలియదు. ఈ దేశంలో కం*డో*మ్ పై 13 శాతం పన్ను విధిస్తున్నారు. ఈ పన్ను ఎందుకు విధిస్తున్నారో తెలుసా?
ప్రపంచవ్యాప్తంగా కం*డో*మ్ పై అవగాహన కల్పించడంతో చాలామంది ఎయిడ్స్ వ్యాధి నివారణకంటే అవాంచిత గర్భం రాకుండా ఉండడానికి కం*డో*మ్ వాడుతున్నారు. 2015 వ సంవత్సరంతో పోలిస్తే 2025వ సంవత్సరానికి 80% కం*డో*మ్ వాడకం పెరిగినట్లు తెలుస్తోంది. మన దేశంలో అత్యధికంగా కం*డో*మ్ వినియోగించే నగరం మధ్యప్రదేశ్లోని ఇండోర్. ఆ తర్వాత హైదరాబాద్ ఉన్నట్లు ఇటీవలే లెక్కలు తేల్చారు. అయితే మన దేశంలో కం*డో*మ్ వాడకంపై ఎలాంటి పనులు లేవు. కానీ స్థానికంగా సెస్ మాత్రం విధిస్తారు. కానీ భారతదేశానికి పొరుగున రుగున ఉన్న చైనాలో మాత్రం కం*డో*మ్ పై 13% పన్నును విధించారు. ప్రపంచవ్యాప్తంగా కం*డో*మ్ పై పన్ను విధించిన మొట్టమొదటి దేశం చైనా గా నిలిచింది. అయితే చైనా దేశం కేవలం కం*డో*మ్ పై మాత్రమే కాకుండా గర్భ నిరోధక మాత్రలు.. గర్భానికి సంబంధించిన మెడిసిన్స్ పై కూడా పన్నులు విధిస్తుంది.
అయితే ఇలా పన్నులు విధించడానికి ప్రత్యేకంగా కారణం ఉంది. చైనాలో కొన్ని గణాంకాల ప్రకారం జననాల రేటు తగ్గిపోతుంది. దీంతో పిల్లల సంరక్షణ తీసుకునేవారు ఎవరు లేకపోతున్నారు. అంతేకాకుండా జననాల రేటు తగ్గిపోవడంతో దేశీయంగా జిడిపి కూడా తగ్గుతుంది. ఇది ఆర్థిక వ్యవస్థ పై ప్రభావం పడుతున్నట్టు గుర్తించారు. ఇందులో భాగంగా గత అక్టోబర్లో చైనాలో పిల్లలను కనేందుకు ప్రత్యేకంగా ప్రోత్సాహకాలు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా పిల్లలు కనే మహిళలకు విద్యుత్ బిల్లులు, మొబైల్ రీఛార్జ్ వంటివి ఉచితంగా అందించారు. దీంతో జననాల రేటు పెరగకపోగా కం*డో*మ్ ల వినియోగం పెరిగింది. చాలామంది పిల్లల్ని కనేందుకు ఇష్టపడడం లేదు. దీనిని దృష్టిలో ఉంచుకున్న చైనా ప్రభుత్వం కం*డో*మ్ పై పన్నును విధించింది.
అయితే కం*డో*మ్ పై పన్ను విధించడంతో ఇప్పటికైనా చైనా ప్రజలు పిల్లల్ని కనేందుకు ఇష్టపడతారా? లేదా? అనేది తెలియాల్సి. అయితే కం*డో*మ్ వాడకం అందుబాటులోకి వచ్చినప్పటికీ కొన్ని దేశాల్లో ఎయిడ్స్ ప్రభావం తగ్గడం లేదు. అవగాహన లేని చాలామంది కం*డో*మ్ వాడడానికి ఇష్టపడడం లేదు. దీంతో అంటువ్యాధులు పెరిగిపోతున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కొందరు కోరుతున్నారు.