VN Parthiban: తనకు బంగారం కావాలన్నదని.. ఈ భూమ్మీద ఉన్న బంగారం మొత్తాన్ని వెలికి తీసి తన తల్లికి కానుకగా ఇస్తాడు కేజీఎఫ్ లో రాఖీ. అదంటే సినిమా కాబట్టి.. లిబర్టీ ఉంటుంది. కానీ నిజ జీవితంలో తల్లి మాటను జవ దాటకుండా నిజం చేయాలని చూసే కుమారులు చాలా మంది ఉన్నారు. ఆ జాబితాలో ఇతడికి మాత్రం ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇంతకీ అతను ఏం చేశాడంటే..
అది తమిళనాడు రాష్ట్రం.. ఆ వ్యక్తి పేరు పార్తీ బన్. ఇతను ఉన్నత చదువులు చదివాడు. ఉద్యోగం కూడా చేస్తున్నాడు. అయితే ఇటీవల అతడు ఒక అరుదైన రికార్డు సృష్టించాడు. తన ఈడు వాళ్ళు సాహసించని ఘనతను సొంతం చేసుకున్నాడు. తద్వారా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సృష్టించుకున్నాడు.. పార్తీ బన్ ప్రస్తుతం చెన్నైలోని ఓ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పని చేస్తున్నాడు.
ఇతను 1981లో డిగ్రీ చేస్తున్నప్పుడు.. తక్కువ మార్కులతో ఉత్తీర్ణత సాధించాడు. ఆ సమయంలో తాను పాస్ అయిన విషయాన్ని తల్లితో చెబితే.. ఇంత తక్కువ మార్కులు అని ఆమె నిరాశ వ్యక్తం చేస్తుంది. దీంతో.. ఆ సమయంలో ఆయన ఆమెకు ఒక మాట ఇచ్చాడు. ఇకపై తాను చదివే కోర్సుల్లో టాప్ మార్కులు తెచ్చుకుంటానని ఆమెకు మాట ఇచ్చాడు. ఇచ్చిన మాటను అతడు నిలబెట్టుకున్నాడు.
తల్లికి వాగ్దానం చేసినట్టుగానే పార్తీ బన్ వివిధ కోర్సులను చదవడం మొదలుపెట్టాడు. ఇప్పటివరకు అతడు ఏకంగా 150 డిగ్రీలు చేశాడు. ఈ వయసులో కూడా అతడు చదువుతూనే ఉన్నాడు. 200 డిగ్రీలు పూర్తి చేయడమే తన లక్ష్యమని అతని పేరు కొన్నాడు. అయితే ఇతను చదివిన వాటిల్లో ఎంఏ, ఎంఫిల్ వంటి కోర్సులు కూడా ఉండడం విశేషం. ఏది ఏమైనప్పటికీ పార్తీ బన్ కు చదువు మీద ఉన్న ధ్యాస చూసి చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సైన్స్ నుంచి మొదలుపెడితే సోషల్ వరకు ఆయన అందుకోని డిగ్రీ లేదంటే అతిశయోక్తి కాక మానదు.
ప్రొఫెసర్ గా పనిచేస్తూనే.. పార్తీ బన్ పరీక్షలకు హాజరయ్యేవాడు. నిత్య విద్యార్థి మాదిరిగా చదివేవాడు. పరీక్షలకు కచ్చితంగా హాజరయ్యేవాడు. తన పరపతి ఎక్కడ కూడా వినియోగించుకునేవాడు కాదు. పైగా పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించేవాడు. ప్రతి సబ్జెక్టును నేర్చుకోవాలనే కోరికను అతను వ్యక్తం చేసేవాడు. తద్వారా చదువు మీద తనకు ఉన్న ఆసక్తి ప్రదర్శించేవాడు.
తను మాత్రమే కాకుండా.. తాను పాఠాలు చెప్పే విద్యార్థులకు కూడా లక్ష్యాలను నిర్దేశించేవాడు. ఉన్నత చదువులు చదవాలని.. విభిన్నమైన కోర్సులను అభ్యసించాలని సూచించేవాడు. తద్వారా అతని విద్యార్థులు కూడా ఆయన చెప్పినట్టుగా కోర్సులు చదువుతున్నారు. విభిన్నమైన సబ్జెక్టులలో డిగ్రీలు చేస్తున్నారు. నేటి కాలంలో చదువుతున్న కోర్సులను పక్కనపెట్టి.. బ్యాక్ లాగ్స్ తో విద్యార్థులు తంటాలు పడుతున్నారు. ఇలాంటి రోజుల్లో ప్రొఫెసర్ ఉద్యోగం ఉన్నప్పటికీ.. పార్తీ బన్ ఏకంగా 150 డిగ్రీలు చేయడం విశేషం.