Homeవార్త విశ్లేషణCalifornia Ground Squirrels: శాకాహారులుగా ఉండాల్సిన ఈ ఉడతలు మాంసాహారులుగా మారిపోయాయి.. తలలు పట్టుకుంటున్న శాస్త్రవేత్తలు

California Ground Squirrels: శాకాహారులుగా ఉండాల్సిన ఈ ఉడతలు మాంసాహారులుగా మారిపోయాయి.. తలలు పట్టుకుంటున్న శాస్త్రవేత్తలు

California Ground Squirrels: ఈ భూమ్మీద ప్యూర్ వెజిటేరియన్ జంతువులు చాలానే ఉన్నాయి. వాటిల్లో ఉడతలు ముందు వరుసలో ఉంటాయి. అవి చిన్న చిన్న గడ్డి మొక్కలను తింటాయి. పండ్లను ఇష్టంగా ఆరగిస్తాయి. తర్వాత తమ పెంటల ద్వారా గింజలను విసర్జిస్తాయి. తద్వారా అడవి పెరుగుదలకు సహకరిస్తుంటాయి. ఒకరకంగా పర్యావరణహితకారులుగా ఉడతలు కొనసాగుతుంటాయి. అటువంటి ఉడతలు ఇప్పుడు ఒకసారి గా మారిపోయాయి.

Also Read:   ‘హరి హర వీరమల్లు’ బడ్జెట్ ఇంత తక్కువనా..? నిర్మాత పవన్ ని మోసం చేశాడా!

ఉడతలు చూసేందుకు చాలా ముద్దుగా ఉంటాయి. కొన్ని సందర్భాలలో అవి తాము సంపాదించిన ఆహారాన్ని మరిచిపోతాయి. అప్పుడు ఆ గింజలు మొలకెత్తుతాయి. అవి క్రమేపి చెట్లుగా ఎదిగి.. భారీ వృక్షాలుగా కనిపిస్తుంటాయి. ఒక రకంగా అడవులు ఏర్పడడంలో ఉడతలు తమ వంతు సహకారాన్ని అందిస్తుంటాయి. శాకాహారులుగా ముద్రపడిన ఉడతల్లో కాలిఫోర్నియా యు గ్రౌండ్ స్క్వేరల్స్ అనే ఉడతలు విభిన్నంగా ప్రవర్తిస్తున్నాయి. శాకాహారులుగా ఉండాల్సిన అవి ఒక్కసారిగా మాంసాహారులుగా మారిపోతున్నాయి. దీనికి సంబంధించి జర్నల్ ఆఫ్ ఎథాలజీలో ఒక కథనం ప్రచురితమైంది.. దాని ప్రకారం కాలిఫోర్నియా గ్రౌండ్ స్క్వేరల్స్ అనే ఉడత జాతి మిగతా వాటికంటే విచిత్రంగా ప్రవర్తిస్తోంది.

Also Read:  ప్రియుడితో ఏకాంతంగా.. భార్య చాటుబంధాన్ని భర్త రట్టు చేశాడిలా..

సాధారణంగా ఉడతలు చిన్న చిన్న గింజలను తింటాయి. మొక్కలను ఆరగిస్తుంటాయి. అయితే ఇటీవల కాలంలో కాలిఫోర్నియా ఉడతలు.. వోల్స్ అనే చిన్న చిన్న ఎలుకలను వేటాడుతున్నాయి. వాటిని వేటాడి చంపి తింటున్నాయి.. ఒక ల్యాండ్ ప్రాంతంలోని బ్రియోనెస్ రీజినల్ పార్కులో ఈ దృశ్యాలు కనిపించాయి. పరిశోధకులు గడిచిన రెండు నెలలుగా ఉడతలను పరిశీలించడం మొదలుపెట్టారు. ఉడతలు ఎలుకల శరీరం నుంచి తలను వేరు చేశాయి. ఆ తర్వాత వాటిని ఇష్టంగా తినడం మొదలుపెట్టాయి. అయితే ఈ ఉడతలు మాంసాహారానికి అలవాటు పడి మొక్కలను, పండ్లను తినడం మానేశాయి. శాకాహారులుగా ముద్ర పడిన ఈ జంతువులు ఇలా ఒకసారిగా మాంసాహారులుగా మారిపోడాన్ని శాస్త్రవేత్తల సైతం ఆశ్చర్యంగా భావిస్తున్నారు. అసలు ఇవి ఇలా ఎందుకు మారిపోయాయో అంటూ తలలు పట్టుకుంటున్నారు. అవి మాంసాహారులుగా మారిపోవడం వెనక కారణాలు ఏమైనా ఉన్నాయా.. అనే దిశగా శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version