spot_img
Homeవింతలు-విశేషాలుInspirational Story Doctor Ganesh: పొట్టిగా ఉన్నాడని గేలి చేశారు.. సీన్ కట్ చేస్తే డాక్టరై...

Inspirational Story Doctor Ganesh: పొట్టిగా ఉన్నాడని గేలి చేశారు.. సీన్ కట్ చేస్తే డాక్టరై షాక్ ఇచ్చాడు.. స్ఫూర్తిదాయకమైన స్టోరీ ఇది!

Inspirational Story Doctor Ganesh: జీవితం అనేది అందరికీ వడ్డించిన విస్తరి కాదు. కొందరికి అవకాశాలు తలుపు తట్టుకుంటూ వస్తే.. మరికొందరికి అవకాశాలు రావడమే గగనమైపోతుంది. అవకాశాలు రానివారు సృష్టించుకుంటారు. అవకాశాల కోసం పరుగులు పెడుతుంటారు. ఆ తర్వాత సమాజానికి ఆదర్శంగా నిలుస్తుంటారు. ఇక ఇందులో ఇంకొక కేటగిరి వాళ్లు కూడా ఉంటారు. వాళ్లకు అన్ని అర్హతలు ఉంటాయి. కాకపోతే ఏదో ఒక లోపం వారిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. సమాజం కూడా లోపంతో బాధపడుతున్న వారిని మరింత ఇబ్బంది పెడుతుంది. అటువంటివారు తమ లోపాన్ని అధిగమించి ఉన్నత స్థానాలను అధిరోహిస్తారు. సమాజానికి ఆదర్శంగా ఉంటారు. అటువంటి వ్యక్తే ఇతడు కూడా.

అతని పేరు డాక్టర్ గణేష్. ఇతడు పుట్టినప్పుడు తక్కువ ఎత్తులో ఉన్నాడు. అతని తల్లిదండ్రులు ఎన్ని రకాలుగా ఆసుపత్రులలో చూపించినప్పటికీ ఎత్తు పెరగలేదు. దీంతో గణేష్ చాలా ఇబ్బందిపడ్డాడు. తన తోటి స్నేహితులు పొట్టోడు పొట్టోడు అంటూ ఎగతాళి చేసేవారు. కొన్ని పాఠశాలలు అతడిని చేర్చుకోవడానికి నిరాకరించాయి. ఇన్ని అవమానాలను ఎదుర్కొన అతడు చివరికి జీవితంలో తనకంటూ ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాడు.

డాక్టర్ కావాలని అనుకున్నాడు. అతడి సంకల్పానికి తండ్రి ప్రోత్సాహం కూడా తోడైంది. అయితే మెడికల్ కాలేజీలో సీటు లభించినప్పటికీ.. అతడిని చేర్చుకోవడానికి వైద్య కళాశాల యాజమాన్యం నిరాకరించింది. అతడి పొట్టితనం కారణంగా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వైద్య కళాశాలలో ప్రవేశించకుండా అడ్డుకుంది. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పక్షపాత నిర్ణయం పట్ల గణేష్ ఆందోళన వ్యక్తం చేశాడు. తనకు న్యాయం చేయాలని 2018 లో సుప్రీంకోర్టు దాకా వెళ్ళాడు. సుప్రీంకోర్టు ఎదుట తన బాధను మొత్తం చెప్పుకున్నాడు.

గణేష్ బాధను మొత్తం విన్న సుప్రీంకోర్టు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు మొట్టికాయలు వేసింది. అతడికి చదువుకునే అవకాశం కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో గణేష్ భావ్ నగర్ మెడికల్ కాలేజీలో ప్రవేశం పొందాడు. అక్కడే తన వైద్య విద్యను పూర్తి చేశాడు. ప్రస్తుతం అదే కాలేజీలో అతడు కన్సల్టెంట్ డాక్టర్ గా పనిచేస్తున్నాడు.. గణేష్ జీవితం కేవలం ఎత్తుకు సంబంధించింది మాత్రమే కాదు.. అతడు సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది కేవలం శారీరక లోపం గురించి మాత్రమే కాదు.. ఈ సమాజం మారాల్సిన తీరును.. మనుషులు ప్రేమించాల్సిన తీరును అతడు గట్టిగా నొక్కి చెప్పాడు. వైకల్యం అనేది శరీరానికి మాత్రమేనని .. మనసుకు కాదని.. వైకల్యంతో బాధపడుతున్న వారందరిని ఈ సమాజం దగ్గరికి తీసుకోవాలని.. వారిని ఆదరించాలని గణేష్ పదే పదే చెబుతున్నాడు. అన్నట్టు గణేష్ చదువుకుంటున్న వయసులో సర్కస్ కంపెనీ వాళ్ళు అతడి తల్లిదండ్రులను సంప్రదించారు. తమతో గణేష్ ని పంపించాలని కోరారు. దానికి అతడి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. తమ కుమారుడు గొప్ప భవిష్యత్తును నిర్మించుకోవాలని.. దానికోసం ఎంతైనా కష్టపడతామని వారు స్పష్టం చేశారు. వారి సంకల్పానికి తగ్గట్టుగానే గణేష్ డాక్టర్ అయ్యాడు. ఏ కాలేజ్ అయితే తనకు అడ్మిషన్ నిరాకరించిందో.. అదే కాలేజీలో అతడు ఇప్పుడు కన్సల్టెంట్ డాక్టర్ గా పనిచేస్తున్నాడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular