Zurich Airport: బోయింగ్ ఈ పేరు వింటేనే ప్రయాణికుల్లో భయం.. ఎందుకంటే వరుస ప్రమాదాలు ఈ విమానాలకే జరుగుతున్నాయి. లోపాలు వెలుగు చూస్తున్నాయి. గుజరాత్ విమాన ప్రమాదం తర్వాత బోయింగ్ సంస్థ విమానాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. అయినా చిన్నచిన్న ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 767 విమానం సురిచ్ విమానంలో ఎమర్జెన్సీగా ల్యాండ్‌కు ప్రయత్నించింది. సాంకేతిక సమస్య లేదా వాతావరణ అస్థిరత కారణంగా తక్షణ నిర్ణయంతో ల్యాండింగ్‌ను రద్దు చేసి ‘‘గో–అరౌండ్’’ (బదులుగా మళ్లీ ఆకాశంలోకి వెళ్లి మరోసారి ప్రయత్నించేందుకు) నిర్ణయించుకున్నారు.
గో–అరౌండ్‌ని ఎందుకు ఎంచుకున్నారంటే?
విమాన సాంకేతిక ప్రమాణాల ప్రకారం, ల్యాండ్‌య్యే ముందు పునరాలోచన అవసరమైనప్పుడు పైలెట్లు విమానాన్ని తిరిగిపైకి తీసుకెళ్లే ‘గో–అరౌండ్‘ ప్రక్రియను అనుసరిస్తారు. ఇది అత్యవసర పరిస్థితుల్లో, విమానాశ్రయ పరిస్థితులు, రన్‌వే పరిశుభ్రత, పరిసరంలో ఇతర విమానాల పరిస్థితి, సాంకేతిక సమస్యలు మొదలైన దేనికైనా కారణంగా ఉంటాయి.
ప్రయాణికుల భద్రత కోసం..
సురిచ్ ఎయిర్‌పోర్టులో బోయింగ్ 767 చివరిదశలో ల్యాండింగ్‌ను రద్దు చేయడంతో, సంస్థ, పైలెట్లపై ప్రశంసలు వెల్లువెత్తాయి. సాంకేతిక సమస్యపై ముందస్తు అవకాశం ఉండగా, ప్రయాణికులకు కచ్చితమైన భద్రతను అందించడంలో సంస్థ అప్ గ్రేడ్ గా నిలిచింది.
ఇలాంటి ‘‘అత్యవసర గో–అరౌండ్’’లు అనూహ్య వాతావరణంలోనే జరగడం సాధారణం. కానీ బోయింగ్ 767 సెఫ్టీ రికార్డుపై ఇటీవలి కాలంలో మరింత దృష్టిపడుతున్న తరుణంలో, ఈ సంఘటన విమాన భద్రతా వ్యవస్థ నిబద్ధతను సూచించింది.
BOEING AGAIN ?
Boeing 767 nearly touched down at Zurich Airport before the pilots performed a quick go-around, aborting the landing at the last moment
The crew reportedly found the landing conditions unsafe and chose to circle for another approach
pic.twitter.com/S7wuQEcTll— Frontalforce (@FrontalForce) November 3, 2025