Homeవింతలు-విశేషాలుBasmati rice bag jacket: గోనె సంచుల కోటు.. ధర తెలిస్తే షాకే!

Basmati rice bag jacket: గోనె సంచుల కోటు.. ధర తెలిస్తే షాకే!

Basmati rice bag jacket: గోనె సంచులు.. తట్టు సంచులు.. గన్నీ సంచులు.. బొంత సంచులు.. పేరు ఏదైనా అన్నీ ఒకటే.. జనుముతో చేసే సంచులు. పర్యావరణ హితంగా తయారు చేసే ఈ సందచులను సరుకుల ప్యాకింగ్‌కు మనం ఎక్కువగా ఉపయోగిస్తాం. చినిగిపోతే.. ఇతర పనులకు వాడుతుంటాం. కానీ, అగ్రరాజ్యం అమెరికన్లు తమకు తెలివి ఎక్కువ అనుకుంటారు కదా… అందుకే మనం ప్యాకింగ్‌ కోసం వాడే సంచులతో వారు బట్టులు కుట్టుకుంటున్నారు. ఇటీవల బాస్మతి బియ్యం గోనె సంచులతో ఓ కోటు తయారు చేశారు. ఇది ఇప్పుడు నెట్టింట్లో సంచలనం సృష్టిస్తోంది. ఎందకంటే ఈ కోటు ధర భారీగా పలుకుతోంది.

వినూత్న ఫ్యాషన్‌..
ఫ్యాషన్‌ అంటే ప్యారీస్‌.. కానీ అమెరికాలోనూ ఇప్పుడు ఫ్యాషన్‌ ట్రెండ్‌ సంచలనం సృష్టిస్తోంది. బాస్మతి బియ్యం గోనె సంచులను ఉపయోగించి కోటులు తయారు చేసి, కొన్ని హై–ఎండ్‌ షాపుల్లో విక్రయిస్తున్నారు. ఈ కోటులు పర్యావరణ అనుకూల ఫ్యాషన్‌గా గుర్తింపు పొందాయి, ఫలితంగా వీటికి భారీ డిమాండ్‌ ఏర్పడింది. అమెరికాలో బాస్మతి బియ్యానికి మంచి డిమాండ్‌ ఉంది. వ్యర్థ పదార్థాలను ఉపయోగించి ఫ్యాషన్‌ ఉత్పత్తుల తయారీ పర్యావరణ స్పృహను ప్రోత్సహిస్తోంది. బాస్మతి గోనె సంచుల కోటు ఈ ట్రెండ్‌కు ఉదాహరణగా నిలుస్తుంది.

Also Read:  శ్రీశైలం వెళ్లే వారందరికీ ఇది షాకింగ్ న్యూస్

ఫుల్‌ డిమాండ్‌..
ఈ కోటుల ధర మొదట 500 డాలర్లుగా ఉండగా, డిమాండ్‌ పెరగడంతో రెండు వేల డాలర్లు (సుమారు రూ.1.75 లక్షలు)కు చేరింది. బాస్మతి బియ్యం సాంస్కృతిక ఆకర్షణ, ఫ్యాషన్‌లో వినూత్నత ఈ ధరల పెరుగుదలకు కారణాలు. ఈ ట్రెండ్‌ భారతీయ ఉత్పత్తుల గ్లోబల్‌ ఆకర్షణను చూపిస్తుంది. స్థిరమైన ఉత్పత్తి, సరసమైన ధరలు, మార్కెటింగ్‌ వ్యూహాలతో ఈ ట్రెండ్‌ దీర్ఘకాలంలో విజయవంతమవుతుంది. భారతీయ ఎగుమతిదారులకు ఇది కొత్త అవకాశాలను తెరుస్తుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular