Baby Elephant Latest Viral Video: సోషల్ మీడియాలో తాజాగా ఒక వీడియో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఆ వీడియోలో ఒక బుల్లి ఏనుగు పిల్ల.. చేసిన సందడి మామూలుగా లేదు. తనను కంటికి రెప్పలా కాపాడుకునే మావటి తో అది రకరకాలుగా సయ్యాటలాడింది. అతడు పడుకుంటే.. లేపింది. అతడు కప్పుకున్న దుప్పటిని తొండంతో పక్కన పెట్టింది. ఆ తర్వాత ఉన్నట్టుండి అతని మీద పడిపోయింది. తొండంతో అతడి శరీరం మొత్తాన్ని తడిమింది. ప్రేమతో నిమిరింది. ఈ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత్ తన సోషల్ మీడియాలో పంచుకున్నారు.. బుల్లి ఏనుగు పిల్ల చేసిన సందడి చూడండి అంటూ దానికి ఆయన ట్యాగ్ లైన్ జత చేశారు.
ఈ సంఘటన ఎక్కడ జరిగిందో సుశాంత చెప్పకపోయినప్పటికీ.. అది దక్షిణ భారతదేశంలోని ఓ రాష్ట్రంలో జరిగిందని అర్థమవుతోంది. దక్షిణ భారతంలో తమిళనాడు, కేరళ ప్రాంతంలో ఏనుగులు అధికంగా ఉంటాయి. ఈ ఏనుగులను మావటి లు సంరక్షిస్తూ ఉంటారు. వాటిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటారు. అందువల్ల ఏనుగులు మావటి ల మీద విపరీతమైన ప్రేమను చూపిస్తుంటాయి. వారి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. వారు పెట్టింది తింటూ ఉంటాయి. కొన్ని సందర్భాలలో మావటి లతో సయ్యాటలాడుతూ ఉంటాయి. దానికి సంబంధించిన వీడియోనే ఇప్పుడు సుశాంత సోషల్ మీడియాలో పంచుకున్నారు. ” ఏనుగులు చాలా అమాయకమైనవి. అవి ఎంత దృఢంగా ఉంటాయో.. అంతే స్థాయిలో సున్నితంగా ఉంటాయి. అవి తమ భావాలను ఎప్పటికప్పుడు పంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. మావటి స్నేహంగా ఉంటాడు కాబట్టి అతడితో బుల్లి ఏనుగు సయ్యాటలాడింది. పరాచకాలు ఆడింది. సంబరంగా తన భావాలను వ్యక్తీకరించింది. నిద్రలో ఉన్న మావటి ఏనుగు భావాలను గుర్తించలేకపోయాడు. అదేపనిగా ఏనుగు పిల్ల తన మీదికి వస్తుండడంతో ఏం చేయాలో తెలియక అలానే ఉండిపోయాడు. కొన్ని ప్రేమలు ఇలానే ఉంటాయి. మౌనంగా మనం చూస్తూ ఉండిపోవాలి. ఆ ప్రేమను గుండెల నిండా ఆస్వాదిస్తూ ఉండాలి. అంతేతప్ప వారించ కూడదు. ఎందుకంటే వారిస్తే తర్వాత ఏం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని” నెటిజన్లు పేర్కొంటున్నారు.. కాగా, ఈ వీడియో లో బుల్లి ఏనుగు చూసేందుకు చాలా అందంగా ఉందని.. అత్యద్భుతంగా ఉందని నెటిజన్లు పేర్కొంటున్నారు. బుల్లి ఏనుగులు మాత్రమే కాకుండా పెద్దపెద్ద ఏనుగులు కూడా ఇలాగే వ్యవహరిస్తాయని జంతు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. తమను లాలించే వ్యక్తిలో ఏనుగులు దేవుడిని చూస్తాయని.. అందువల్లే అవి అలా వ్యవహరిస్తాయని వారు వివరిస్తున్నారు. అంతేకాదు కొన్ని సందర్భాలలో అలిగి మారం కూడా చేస్తాయని పేర్కొంటున్నారు.
View this post on Instagram