Rithuparna Sahyadri: ఇప్పుడు ఏ నోట చూసినా Artificial Intelligence(AI) పేరు వినిపిస్తోంది. నేటి యువత సైతం ఏఐ నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. భవిష్యత్తులో కూడా ఏఐతోనే ఉద్యోగాలు ఉంటాయని కొందరు నిపుణులు చెబుతున్నారు. అయితే డాక్టర్ కావాల్సిన ఒక అమ్మాయి రైతుల కోసం ఉపయోగపడే ఒక ఏఐ రోబోను తయారుచేసింది. ఈమె ప్రతిభకు మెచ్చిన రోల్స్ రాయిస్ కంపెనీ రూ. 72 లక్షల ప్యాకేజీని అందించడానికి సిద్ధమైంది. దేశంలో అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు లభించిన అత్యంత అరుదైన ప్రాజెక్టు ఇది. ఇంతకీ ఆ యువతీ ఎవరు?
కర్ణాటకలోని మంగళూరుకు చెందిన రీతూపర్ణ సహ్యాద్రి కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్ లో రోబోటిక్స్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. వాస్తవానికి ఆమె నీట్ పరీక్షల్లో విజయం సాధించి డాక్టర్ కావాలని అనుకున్నారు. కానీ నీట్ లో ఫీల్ కావడంతో ఇంజనీరింగ్ ను ఎంచుకున్నారు. ఇదే ఆమె జీవితాన్ని మలుపులు తిప్పింది. ఆమె విద్యార్థిగా ఉన్న సమయంలోనే రైతులకు ఉపయోగపడే రోబో ప్రాజెక్టులో ముఖ్యపాత్ర వహించారు. ఈ రోబో రైతుల పనులను సులభతరం చేస్తుంది. ఈ లోపును రూపొందించినందుకు ఆమె అంతర్జాతీయ స్థాయిలో మెడల్స్ ను గెలుచుకున్నారు. దక్షిణ కన్నడ డిసి ఫెలోషిప్ కు కూడా ఎంపికయ్యారు.
అయితే తొలుత ఆమె రోల్స్ రాయిస్ లో ఇంటర్న్ షిప్ కోసం ప్రయత్నించారు. కానీ ఆమె ప్రతిపాదనను తిరస్కరించారు. దీంతో పట్టు వదలకుండా తనకు ఒక అవకాశం ఇవ్వాలని కోరారు. చివరికి రోల్స్ రాయిస్ కంపెనీ ఆమెకు ఒక పనిని అప్పగించి నెలలో పూర్తి చేయాలని చెప్పారు. కానీ ఆమె దాన్ని కేవలం ఒక వారంలోనే పూర్తి చేసి సంస్థకు అప్పగించారు. దీంతో కంపెనీ ఆమె అద్భుతమైన పనితీరును మెచ్చుకుంది. దీంతో రోల్స్ రాయిస్ మొదట్లో ఆమెకు ఇచ్చిన రూ.39.6 లక్షల రూపాయల నుంచి రూ.72.3 లక్షల రూపాయలకు పెంచింది. అయితే ప్రస్తుతం ఆమె అండర్ గ్రాడ్యుయేట్ చదువుతున్నందున దేశంలోనే రోల్స్ రాయిస్ కోసం పనిచేయనున్నారు. ఆ తర్వాత అమెరికాలోని టెక్సాస్ లో ఉన్న రోల్స్ రాయిస్ యూనిట్లో పూర్తిస్థాయిలో చేరుతారు.
రీతు పర్ణ రోబోటిక్ చదివిన కూడా రైతులకు ఉపయోగపడే రోబోను రూపొందించడమే ఆమె జీవితానికి ప్లస్ గా మారింది. అలాగే రానున్న కాలంలో ఏఐ లెవెల్ లో రోబోలు రూపొందే అవకాశముంది. నేటి కాలంలో ప్రతి రంగంలో ఏఐ చొచ్చుకు పోతుంది. రీతూ పర్ణ వచ్చే కాలంలో మరిన్ని విజయాలు సాధించే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఆమెను స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థులు ఏఐ రంగంలో రాణించాలని కొందరు సాంకేతిక నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే భవిష్యత్తు అంతా ఏఐ ఉద్యోగాలు ఉండే అవకాశం ఉంది. ఏఐ నాలెడ్జ్ ఉంటేనే కెరీర్ డెవలప్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.