https://oktelugu.com/

Hippo VS Lion : నీటిలో ఉన్నప్పుడు హిప్పో చాలా పవర్ ఫుల్.. సింహాన్ని ఏకంగా ఏం చేసిందంటే..

అసలే ఇది స్మార్ట్ ఫోన్ కాలం.. సోషల్ మీడియా బలంగా ఉన్న కాలం.. ప్రపంచంలో ఎక్కడ ఏ మూల ఎలాంటి సంఘటన జరిగినా వెంటనే తెలిసిపోతుంది. ఇక వింత సంఘటన అయితే సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.. ఈ సంఘటన కూడా అలాంటిదే..

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : September 1, 2024 / 08:37 AM IST

    Hippo VS Lion

    Follow us on

    Hippo VS Lion : “అనువుగానిచోట అధికులం అనరాదని” పెద్దలు ఏనాడో చెప్పారు. వారికి అనుభవానికి వచ్చింది కాబట్టి ఆ సూక్తిని ప్రవచించారు. అలాంటి సూక్తి ఓ సింహానికి నిజజీవితంలో ఎదురయింది. సింహం అడవికి మృగరాజు అయినప్పటికీ.. తనదైన రోజు కాకుంటే ఇబ్బంది పడక తప్పదు. సహజంగా నీటిలో ఉన్నప్పుడు హిప్పో చాలా బలంగా ఉంటుంది. ఉదాహరణకు మొసలి నీటిలో ఉన్నప్పుడు చాలా బలాన్ని కలిగి ఉంటుంది. బయటికి వస్తే బలహీనంగా ఉంటుంది. కోతులు కూడా చెట్ల మీద ఉన్నప్పుడు ప్రదర్శించే శక్తిని నేల మీద చూపించలేవు. సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్న ఓ వీడియో ప్రకారం జాంబియాలో లుయాంగ్వా అనే పేరుతో ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నది హిప్పోలకు ఆలవాలం. అలా ఓ భారీ హిప్పో నీటిలో ఈదుతోంది. దానికి సమీపంలో ఒక సింహం కనిపించింది. అంతే హిప్పో కోపం తారస్థాయికి చేరింది. మరో మాటకు తావు లేకుండా సింహం దగ్గరికి వెళ్ళింది. దానికి తన ప్రతాపాన్ని చూపాలని భావించింది. హిప్పో రాకను గమనించిన సింహం భయపడిపోయింది. ప్రాణాలు తీస్తుందనే భయంతో వేగంగా ఈదడం ప్రారంభించింది. అయితే హిప్పో మరింత వేగంగా వచ్చి సింహాన్ని ఒక్క తోపు తోసింది. దీంతో సింహానికి కళ్ళు బైర్లు కమ్మాయి. తట్టుకోలేక తన శక్తిని మొత్తం కూడ దీసుకుని మరింత వేగంగా ఈదడానికి ప్రయత్నించింది. ఈ క్రమంలో హిప్పో కూడా సింహాన్ని అంతే బలంగా తోసింది. ఈ క్రమంలో సింహం చాకచక్యంగా హిప్పోను దాటుకొని నిదానంగా ఒడ్డుకు చేరుకుంది.

    సింహానికి నూకల చెల్లెల

    ఈ దృశ్యాలను కొంతమంది పర్యాటకులు తమ కెమెరాలలో వీడియో తీశారు. దానిని సోషల్ మీడియా వేదికలలో షేర్ చేశారు. ఈ వీడియో కాస్త ప్రస్తుతం లక్షల్లో వ్యూస్ సొంతం చేసుకుంది. ” సింహం ఆద మరిచిపోయింది. హిప్పో ఎంటర్ అయింది. దెబ్బకు సినిమా మారిపోయింది. సింహానికి చుక్కలు కనిపించాయి.. స్థాన బలాన్ని మర్చిపోయి సింహం ఏదో చేద్దామనుకుంది. కానీ హిప్పో ముందు దాని ఆటలు సాగలేదు. అందు గురించే ఎంతటి బలమైన జంతువైనప్పటికీ.. తనది కాని స్థలానికి వచ్చినప్పుడు జస్ట్ అలా సైలెంట్ గా ఉండిపోవాలి. హిప్పో బతుకుపో అంటూ విడిచింది గాని.. కోపం కనుక దానికి తారాస్థాయిలో ఉంటే సింహానికి నూకలు చెల్లేవి. అయినప్పటికీ నీటిలో ఉన్నప్పుడు హిప్పో తన బలం చూపించింది. దీంతో సింహానికి నీటిలో చుక్కలు కనిపించే. అది కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది కావచ్చు. అది నడుస్తున్న తీరే అందుకు ఉదాహరణ అంటూ” నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.