74‑year‑old Marriage: సంసారానికి సరైన ఈడూ జోడు ఉండాలి అంటారు. కానీ నేటి కాలంలో ఆ విధానాన్ని ఎవరూ అనుసరించడం లేదు. వివాహానికి వయసును పెద్దగా లెక్కలోకి తీసుకోవడం లేదు. దీంతో ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయే సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వయసులో పెద్దవాళ్లయిన ఆడవాళ్ళ ను యువకులు పెళ్లి చేసుకుంటున్నారు. వయసులో పెద్దవాళ్లయిన మగవాళ్ళను యువతులు వివాహాలు చేసుకుంటున్నారు. ఇటీవల కాలంలో ఈ తరహా సంఘటనలు పెరిగిపోయాయి. అటువంటిదే ఈ సంఘటన కూడా.
అతని పేరు టార్మాన్. వయసు 74 సంవత్సరాలు వరకు ఉంటుంది. గతంలోని వివాహం జరిగింది. అతని భార్య చనిపోయినట్టు తెలుస్తోంది. పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయిపోయారు. వారికి వివాహాలు కూడా జరిగాయి. మనవళ్లు, మనవరాళ్లతో ఉత్సాహంగా గడపాల్సిన అతడు.. భార్య చనిపోవడంతో ఒంటరి అయిపోయాడు. ఆమె జ్ఞాపకాలలో నిత్యం కన్నీటి పర్యంతమయ్యేవాడు. ఆస్తి పరంగా.. అంతస్తులపరంగా టార్మాన్ కు తిరుగులేదు. కాకపోతే తనకంటూ ఒక తోడు లేకపోవడంతో నిత్యం అదే దిగులుతూ ఉండేవాడు. కుటుంబ సభ్యులు అతడిని ఎంతగా ఊరడించే ప్రయత్నం చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. దీంతో అతడు ఒక నిర్ణయం తీసుకున్నాడు.
తనకంటే 24 సంవత్సరాల చిన్నదైన ఆరికా ను అతడు వివాహం చేసుకున్నాడు. ఈనెల 1న తూర్పు జావా ప్రాంతంలో టార్మాన్ అరికా వివాహం జరిగింది.. అయితే ఇందుకోసం అతడు ఎదురు కట్నం చెల్లించాడు. ముందుగా ఆమెకు 60 లక్షలు చెల్లించాడు. తర్వాత 1.8 కోట్లు ఇచ్చాడు. తన పెళ్లికి వచ్చిన గెస్టులకు 6000 చొప్పున బహుమతి అందించాడు. అయితే ఫోటోగ్రాఫర్ కు డబ్బులు ఇవ్వకుండా అతడు తన భార్యతో వెళ్లిపోయాడు. అయితే వారిద్దరూ హనీమూన్ వెళ్లారని బంధువులు చెప్తున్నారు. తనకు డబ్బులు ఇవ్వకుండా ఆ దంపతులు వెళ్లిపోవడంతో ఫోటోగ్రాఫర్ గొడవ చేశాడు. అయితే వచ్చిన బంధుమిత్రులు సర్ది చెప్పడంతో అతడు ఊరుకున్నాడు. ప్రస్తుతం ఈ సంఘటన ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది.
వాస్తవానికి భర్త చనిపోయినప్పటికీ చాలామంది భార్యలు ఒంటరిగా ఉంటారు. ఎందుకంటే వారిలో ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉంటుంది. పైగా తమ పనులు తాము చేసుకునే సామర్థ్యం వారిలో ఎక్కువగా ఉంటుంది. కానీ ఇదే పురుషులలో ఉండదు. అందువల్లే భార్యలు చనిపోగానే వారిలో ఒక రకమైన భయం ఏర్పడుతుంది. చివరికి అది ఆత్మ న్యూనత కు దారి తీస్తుంది. మరో పెళ్లి చేసుకునేలాగా పురిగొల్పుతుంది. ఈ వ్యక్తి విషయంలో జరిగింది కూడా అదే.