Maya Neelakantan: 11 ఏళ్ల భారతీయ రాక్‌ స్టార్‌.. గిటార్‌తో అమెరికాను షేక్‌ చేసింది.. వీడియో వైరల్‌!

11 ఏళ్ల మాయ తమిళనాడులోని చెన్నైకి చెందింది. ఆమెకు సొంత యూట్యూబ్ ఛానెల్ ఉంది. ఈ చిన్న గిటార్‌కి సంబంధించిన పలు వీడియోలు ఇందులో ఉన్నాయి.

Written By: Raj Shekar, Updated On : July 2, 2024 6:36 pm

Maya Neelakantan

Follow us on

Maya Neelakantan: ఆ చిన్నారి వయసు కేవలం 11 ఏళ్లు. తన గిటార్ నైపుణ్యంతో అమెరికా గాట్ టాలెంట్‌ను మెస్మరైజ్ చేసింది. ఆ చిన్నారి పేరు మాయ నీలకంఠన్. అమెరికా గాట్ టాలెంట్ కోసం ఇటీవల నిర్వహించిన ఆడిషన్‌లో మొత్తం షో దృష్టిని ఆకర్షించింది. అమెరికాలో పాపా రోచ్ లాఫ్ట్ రిసార్ట్ వేదికపై తన గిటార్ ప్రదర్శనతో ఆ షో జడ్జిలనే ఆశ్చర్యపరిచింది. మాయ తన అద్భుతమైన గిటార్ ప్రదర్శన ఆ వేదికపై ఉన్న దిగ్గజ జడ్జిలు సైమన్ కోవెల్, సోఫియా వెర్గారా, హెడీ క్లమ్, హౌవీ మాండెల్ మనసులు గెలుచుకుని ప్రశంసలందుకుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అసమాన ప్రతిభ ఆమెకు భారతదేశపు అత్యంత పిన్న వర్ధమాన రాక్ స్టార్‌గా పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టింది.

వేలాది మంది ఫిదా..
ఇదిలా ఉంటే మాయ గిటార్‌తో చేసిన మాయకు వేలాది మంది ఫిదా అయ్యారు. మాయ నీలకంఠన్‌కు ఫ్యాన్స్‌గా మారిపోయారు. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే పారిశ్రామిక దిగ్గజం ఆనంద్‌ మహీంద్రా సైతం మాయ గిటార్‌ మ్యూజిక్‌కు మెస్మరైజ్‌ అయ్యారు. ఇంత చిన్న వయసులోనే అపారమైన ప్రతిభను సొంత చేసుకోవడం గ్రేట్ అంటూ ప్రశంసించారు. త్వరలో ముంబైలో నిర్వహించే మహీంద్రా బ్లూస్ ఫెస్టివల్‌లో సంగీత ప్రదర్శన ఇవ్వాలని మాయాను ఆహ్వానించారు. దేవతలా భువి నుంచి వచ్చిన ప్రతిభాశాలి అంటూ ప్రశంసించారు.

ఎవరీ మాయ నీలకంఠన్..
11 ఏళ్ల మాయ తమిళనాడులోని చెన్నైకి చెందింది. ఆమెకు సొంత యూట్యూబ్ ఛానెల్ ఉంది. ఈ చిన్న గిటార్‌కి సంబంధించిన పలు వీడియోలు ఇందులో ఉన్నాయి. మాయ గిటార్‌పై కర్ణాటక సంగీతాన్ని ఆలపిస్తుంది. ఆమె గురువు ఆర్.ప్రసన్న. అమెరికాలోని పాపా రోజ్ లాస్ట్ రిసార్ట్ వేదికపై గిటార్‌తో కర్ణాటక నటభైరవి రాగం ఉపోద్ఘాతాన్ని సోలోగా ప్లే చేసినట్లు తెలిపారు. మెటల్ రాక్ బ్లూస్ పదబంధాలతోపాటు కర్ణాటక గమకాలు చాలా అలవోకగా ప్లే చేసిందని పలువురు మెచ్చుకున్నారు.

శిష్యురాలికి అభిమానిగా..
ఇక మాయ గురువు ప్రసన్న మాట్లాడుతూ కర్ణాటక సంగీతాన్ని గిటార్‌పై ప్లే చేయడం ఏళ్ల క్రితమే ప్రారంభించినట్లు తెలిపారు. అయితే ఇలా ఒక 11 ఏళ్ల బాలిక అమెరికాస్ గాట్ టాలెంట్ వంటి ప్రపంచ వేదికపై ప్లే చేయడం అనేది చాలా గొప్ప విషయమన్నారు. మాయ ప్రతిభకు తానే శిష్యురాలికి అభిమానిగా మారానని గర్వంగా చెప్పారు.