Black Widow Review : హాలీవుడ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే ప్రేక్షకుల్లో విపరీతమైన అటెన్షన్ అయితే ఉంటుంది. ఇక ఆ సినిమాను చూడడానికి ఇండియాలో కూడా సపరేట్ ఫ్యాన్స్ ఉన్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
అందుకే వాళ్ళు వాళ్ళ సినిమాలను భారీ రేంజ్ లో ఇండియాలో రిలీజ్ చేసుకొని భారీ వసూళ్లను కూడా రాబడుతున్నారు. ముఖ్యంగా విజువల్ వండర్ గా తెరకెక్కించడంలో హాలీవుడ్ మేకర్స్ ను మించిన వాళ్లు మరొకరు లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇలాంటి క్రమంలోనే ఇప్పుడు బ్లాక్ విడో అనే ఒక హాలీవుడ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఆ సినిమా ఎలా ఉంది. సక్సెస్ సాధించిందా లేదా అనే విషయాలు మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
కథ
ఇక ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే రష్యా కు చెందిన ఒక వ్యక్తి కొంతమంది అనాధ పిల్లలను కిడ్నాప్ చేస్తూ తను చెప్పినట్టు వాళ్ళు వినేలా వాళ్ళ మైండ్ సెట్ ని మారుస్తూ ఉంటాడు. ఇక అందులో భాగంగానే అమెరికాకు చెందిన కొన్ని రహస్యాలను తెలుసుకోవడానికి అందులో ఉన్న కొంతమందిని ఒక ఫ్యామిలీగా సృష్టిస్తాడు.
ఇక వెంటనే ఆ ఫ్యామిలీలో నుంచి ఇద్దరు పిల్లల్ని వేరు చేస్తాడు. ఇక పిల్లల్ని కూడా తన సైన్యంలో మళ్ళీ చేర్చుకుంటాడు. ఇక అప్పుడు అందులో ఉన్న స్కార్లెట్ జాన్సన్ (బ్లాక్ విడో) అతని మీద తిరుగుబాటు చేస్తుంది. మరి ఆ తిరుగుబాటులో ఆమె విజయాన్ని సాధించి అక్కడున్న అనాధ పిల్లలందరినీ కాపాడిందా లేదా అనే విషయాలు తెలియాలంటే ‘డిస్నీ ప్లస్ హాట్ స్టార్’ లో స్ట్రీమింగ్ అవుతున్న ‘బ్లాక్ విడో’ సినిమాను మీరు చూడాల్సిందే…
విశ్లేషణ
ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికొస్తే సినిమా మొదట్లో చాలా ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ అయినప్పటికీ ఆ తర్వాత స్టొరీ లోకి వెళ్తున్న కొద్ది సినిమా మీద ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతూ వస్తుంది. ఇక దర్శకుడు కథ బాగానే రాసుకున్నప్పటికీ స్క్రీన్ ప్లే విషయంలో మాత్రం మరికొంత జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేది. ఎందుకంటే ప్రతి సీన్ ని ఎక్కడ ఓపెన్ చేయాలి ఎక్కడ క్లోజ్ చేయాలి అనే విషయంలో దర్శకుడు చాలా వరకు తడబడ్డాడు..కేట్ షార్ట్ ల్యాండ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో మాత్రం చాలా వరకు విఫలమైందనే చెప్పాలి. స్క్రీన్ ప్లే ఒకటి కనక మొదటి నుంచి చివరి వరకు ఎంగేజ్ చేసేలా రాసుకోగలిగితే ఈ సినిమా ప్రేక్షకుడిని తప్పకుండా మెప్పించేది. ఇక విజువల్స్ పరంగా చూసుకుంటే ఈ సినిమా విజువల్స్ లో టాప్ నాచ్ లో ఉన్నాయనే చెప్పాలి. ఇక ఈ సినిమాలో గ్రాఫిక్స్ కి ప్రాధాన్యమున్న సీన్లు కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి.
అయినప్పటికీ సినిమాను ఎలా నడిపించాలో దర్శకుడికి అర్థం కాలేదు. ఆ డ్రైవింగ్ ఫోర్స్ అనేది కరెక్ట్ గా లేకపోవడం వల్లే సీన్ కి సీన్ కి మధ్య ప్రేక్షకుడు కనెక్ట్ అయ్యే విధంగా ఒక ఎమోషన్ ని బిల్డ్ చేయలేకపోయాడు. దానివల్లే ఈ సినిమా అనేది చాలా వరకు డిసప్పాయింట్ చేసిందనే చెప్పాలి…ఇక సూపర్ హీరో సినిమాలు అంటే మనలో చాలామంది ఇంట్రెస్ట్ పెట్టి మరి చూస్తుంటారు. కానీ కథ సరిగ్గా లేకపోతే అది ఎంత సూపర్ హీరో సినిమా అయిన కూడా డిసప్పాయింట్ చేయక తప్పదు…
ఆర్టిస్టుల పర్ఫామెన్స్
ఇక ఈ సినిమా ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే ‘స్కార్లెట్ జాన్సన్’ లీడ్ రోల్ లో నటించి సినిమా మొత్తానికి ఒక హైప్ నైతే తీసుకొచ్చింది. తన పర్ఫామెన్స్ అద్భుతంగా ఉన్నప్పటికీ తనకి ఇంకాస్త స్కోప్ ఉంటే బాగుండేది అనిపిస్తుంది.ఇక ఫ్లోరెన్స్ పగ్ తన పాత్ర పరిధి మేరకు ఓకే అనిపించాడు. డేవిడ్ హార్బర్ విలనిజంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడమే కాకుండా సినిమాలో కొన్ని సీన్స్ లో తన విలనిజాన్ని కూడా చూపించాడు…ఇక మిగిలిన ఆర్టిస్టులందరూ వాళ్ల పాత్రల పరిధి మేరకు ఒకే అనిపించారు…
టెక్నికల్ అంశాలు
ఇక ఈ సినిమాకి మ్యూజిక్ ని అందించిన లోల్ బార్ఫ్ మ్యూజిక్ పర్వాలేదు అనిపించినప్పటికీ బ్యాగ్రౌండ్ స్కోర్ లో కొంతవరకైతే వైవిధ్యాన్ని ప్రదర్శించాడు. ఇక సీన్ లోనే కంటెంట్ లేనప్పుడు తన మ్యూజిక్ తో ఆ సీన్ ను ఆయన మాత్రం ఎంతవరకు ఎలివేట్ చేయగలడు అనేది కూడా మనం ఇక్కడ గమనించాల్సి ఉంటుంది…ఇక సినిమాటోగ్రాఫర్ అయిన గాబ్రియెల్ బెరిస్టెన్ తన విజువల్స్ తో మాత్రం ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించాడనే చెప్పాలి. ప్రతి షాట్ ను కూడా చాలా డిఫరెంట్ వేలో ప్రజెంట్ చేశాడు. ఇక ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కు సంబంధించిన ఆ మూడ్ ను క్రియేట్ చేయడానికి తన విజువల్స్ తో చాలా ప్రయత్నం చేశాడనే చెప్పాలి…
ప్లస్ పాయింట్స్
స్కార్లెట్ జాన్సన్
విజువల్స్
గ్రాఫిక్స్
మైనస్ పాయింట్స్
స్క్రీన్ ప్లే
కొన్ని సీన్స్ లో ఎమోషన్స్ మిస్ అయ్యాయి…
రేటింగ్
ఇక ఈ సినిమాకు మేమిచ్చే రేటింగ్ 2/5
చివరి లైన్
ఖాళీగా ఉంటే ఒకసారి ఈ సినిమాను చూడవచ్చు…