https://oktelugu.com/

H1B Visa: ఇంటర్వ్యూలు లేకుండానే డైరెక్ట్‌గా అమెరికా వెళ్లొచ్చు.. ఎలా అంటే?

H1B Visa: మన దేశంలోని చాలామంది విద్యార్థులు అమెరికాకు వెళ్లాలని అనుకుంటున్నారు. హెచ్-1బీ , ఇతర వీసాల ద్వారా ఎక్కువ మంది విద్యార్థులు అమెరికాకు వెళుతున్నారు. అయితే అమెరికాకు వెళ్లాలని భావించే వాళ్లకు అమెరికా శుభవార్త చెప్పింది. వన్-టూ-వన్ ఇంటర్వ్యూలను తీసివేస్తున్నామని అమెరికా ప్రకటించింది. హెచ్-1బీ, ఎల్-1, ఓ-1 వంటి నాన్-ఇమ్మిగ్రెంట్ వర్క్ వీసాల కొరకు వేచి చూసే సమయాన్ని తగ్గించాలని అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ భావిస్తోంది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఉధృతి నేపథ్యంలో అమెరికా ఈ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 24, 2021 / 06:39 PM IST
    Follow us on

    H1B Visa: మన దేశంలోని చాలామంది విద్యార్థులు అమెరికాకు వెళ్లాలని అనుకుంటున్నారు. హెచ్-1బీ , ఇతర వీసాల ద్వారా ఎక్కువ మంది విద్యార్థులు అమెరికాకు వెళుతున్నారు. అయితే అమెరికాకు వెళ్లాలని భావించే వాళ్లకు అమెరికా శుభవార్త చెప్పింది. వన్-టూ-వన్ ఇంటర్వ్యూలను తీసివేస్తున్నామని అమెరికా ప్రకటించింది. హెచ్-1బీ, ఎల్-1, ఓ-1 వంటి నాన్-ఇమ్మిగ్రెంట్ వర్క్ వీసాల కొరకు వేచి చూసే సమయాన్ని తగ్గించాలని అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ భావిస్తోంది.

    కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఉధృతి నేపథ్యంలో అమెరికా ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఎవరైతే ఈ వీసాల కొరకు దరఖాస్తు చేసుకుంటారో వాళ్లు అమెరికన్ కాన్సులేట్ దగ్గర వ్యక్తిగత ఇంటర్వ్యూ కోసం హాజరు కావాల్సిన అవసరం ఏ మాత్రం లేదు. అమెరికా స్టేట్ డిపార్టుమెంట్ కరోనా మహమ్మారి వీసా ప్రొసీడింగ్స్ సామర్థ్యంను తగ్గించినట్టు వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రయాణాలు పుంజుకుంటున్నాయని పేర్కొంది.

    అభ్యర్థుల భద్రత కోసం తక్షణ ఉపశమన చర్యలకు సిద్ధంగా ఉన్నామని సంస్థ వెల్లడించింది. జాతి భద్రతే ప్రాధాన్యతగా భావించి వీసా కొరకు ఎదురు చూసే సమయాన్ని తగ్గిస్తున్నామని ఈ సంస్థ పేర్కొంది. 12 వీసా కేటగిరీలకు సంబంధించి అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. పరిమిత బేసిస్ తో ప్రాధాన్యతను బట్టి వీసా సర్వీసులను ఈ సంస్థ పునః ప్రారంభించడం గమనార్హం.

    ఈ ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో వీసాలను మంజూరు చేసినట్టు ఈ సంస్థ పేర్కొంది. వీసాలకు టెకీల్ల నుంచి ఎక్కువ డిమాండ్ వస్తోందని ఈ సంస్థ తెలిపింది. అమెరికా వెళ్లాలని భావించే వాళ్లకు అమెరికా స్టేట్ డిపార్టుమెంట్ చెప్పిన వార్త శుభవార్త అని చెప్పవచ్చు.