H-1B Visa: అగ్రరాజ్యం అమెరికా విదేశీ ఉద్యోగులను తగ్గిస్తోంది. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు అయ్యాక విదేశీ ఉద్యోగులపై కక్ష గట్డాడు. ముఖ్యంగా భారతీయులను వెళ్లగొట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఈ క్రమంలో హెచ్–1బీ వీసా నిబంధనలు కఠినతరం చేశారు. వీసా ఫీజు రూ.లక్ష డాలర్లకు పెంచారు. తాజాగా వీసా కేటాయింపు ప్రక్రియలో ర్యాండమ్ లాటరీ వ్యవస్థను మార్చి, వేతనం, నైపుణ్యాల ఆధారంగా జారీ చేయాలని నిర్ణయించారు. ఈ మార్పులు ఫెడరల్ రిజిస్టర్లో ప్రచురితమయ్యాయి. 2027 ఆర్థిక సంవత్సరం క్యాప్ రిజిస్ట్రేషన్ నుంచి (ఫిబ్రవరి 27 నుంచి) అమలవుతాయి. ఇకపై అధిక వేతనాలు పొందే నిపుణులకు ఎంపిక అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి.
వేతన స్థాయుల విభజన ఇలా..
అమెరికా కార్మిక శాఖ, హెచ్–1బీ ఉద్యోగుల వేతనాలను నాలుగు లెవల్స్గా వర్గీకరించింది.
– ఎంట్రీ–లెవల్ వర్కర్లు – ర్యాండమ్ లాటరీలో ఒక్కసారి మాత్రమే పాల్గొంటారు (ఛాన్స్ 15% తగ్గుతుంది)
– మధ్యస్థ నైపుణ్యం – రెండుసార్లు ఎంపిక అవకాశం (31% ఛాన్స్).
– అధిక నైపుణ్యం – మూడుసార్లు ప్రవేశం (46% అవకాశం).
– అత్యధిక వేతనం – నలుసార్లు లాటరీలో పాల్గొనవచ్చు (61% ఎంపిక ఛాన్స్).
అమెరికా ఎంబసీ, కఠిన వీసా నియమాలు, సోషల్ మీడియా తపాసులు,
హెచ్–1బీ/హెచ్–4 అపాయింట్మెంట్ ఆలస్యాలతో భారతీయ వలసదారులు ఇబ్బంది పడుతున్నారు. చట్ట ఉల్లంఘనలకు క్రిమినల్ కేసులు, జరిమానాలు విధిస్తామని హెచ్చరించింది. ట్రంప్ పరిపాలన అక్రమ వలసలను అరికట్టి, సరిహద్దులు, పౌరుల భద్రతకు కట్టుబడి ఉందని స్పష్టం చేసింది.