Keir Starmer Immigration: ఒకప్పుడు భారత దేశానికి వలస వచ్చి… 200 ఏళ్లు పాలించి.. ఇక్కడి సంపదను దోచుకుపోయిన దేశం బ్రిటన్. మనల్నే బానిసలుగా, కూలీలుగా మార్చారు బ్రిటిష్ పాలకులు. 200 ఏళ్ల చీకటి పాలన నుంచి 1947లో భారత్‌కు స్వాతంత్య్రం వచ్చింది. దీంతో తెల్లవారు దేశం విడిచిపోయారు. స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత ఓ భారత సంతతికి చెందిన వ్యక్తి బ్రిటన్‌కు ప్రధాని అయ్యారు. భారత్ కూడా ఆర్థికంగా బలపడింది. ఇప్పుడు బ్రిటన్‌కన్నా మన దేశం ముందు ఉంది. ఇలాంటి తరుణంలో బ్రిటన్ ప్రధానిగా గతేడాది ఎన్నికైన స్టీవ్ స్టార్మర్.. భారత వ్యతిరేక భావనతోనే ఉన్నారు. తాజాగా అమెరికా(America) మాదిరిగానే బ్రిటన్‌లోని అక్రమ వలసదారుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. ప్రధానంగా భారతీయ రెస్టారెంట్ల(Indian Restrarents)ను లక్ష్యంగా చేసుకున్నారు. ‘యూకే వైడ్ బ్లిట్జ్’ పేరుతో వలసదారులు పనిచేసే భారత రెస్టారెంట్లలో సోదాలు చేయిస్తున్నారు. వీటితోపాటు కార్‌వాష్ ఏరియాలు, కన్వీనియెన్స్ స్టోర్లు, బార్లలోనూ తనిఖీలు చేయిస్తున్నారు. వందల మందిని బ్రిటన్ పోలీసులు అరెస్టు చేస్తున్నారు. హంబర్సైడ్ ప్రాంతంలోని ఓ భారత రెస్టారెంట్‌లో చట్ట విరుద్ధంగా పనిచేస్తున్న ఏడుగురిని ఇమ్మిగ్రేషన్ అధికారులు అరెస్ట్ చేశారు. మరో నలుగురిని విచారణ చేస్తున్నారు. సౌత్ లండన్(South Londan)లోని ఓ భారత గ్రాసరీ వేర్‌హౌస్‌లో తనిఖీలు చేసి ఆరుగురిని అరెస్టు చేశారు. మరికొందరిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
అక్రమ వలసదారులకు చెక్ పెట్టేందుకే..
చట్టాలను ఉల్లంఘించిన వలసదారులకు, అక్రమంగా ఉపాధి పొందుతున్నవారిని గుర్తించేందుకే ఈ చర్యలు చేపట్టినట్లు యూకే ప్రభుత్వం తెలిపింది. ఈ క్రమంలో జనవరిలో 828 ప్రాంగణాల్లో తనిఖీలుచేసి 609 మంది అక్రమ వలసదారులను గుర్తించామని పేర్కొంది. ఈ వ్యవహారంపై ప్రధాని స్టార్మర్ స్పందించారు. బ్రిటన్‌లో అక్రమ వలసలు పెరిగాయని తెలిపారు. చాలా మంది చట్ట విరుద్ధంగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఇలాంటి వలసలను ముగిస్తామని తెలిపారు.
ఏడాది కాలంగా..
ఇదిలా ఉంటే.. కీర్ స్టార్మర్(keer Starmar)గతేడాది జూలైలో బ్రిటన్ ప్రధానిగా ఎన్నికయ్యారు. బోర్డర్ సెక్యూరిటీపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఇప్పటికే 4 వేల మంది అక్రమ వలసదారులను అడ్డుకున్నారు. సరిహద్దు రక్షణ, శరణార్థులకు సంబంధించిన బిల్లుపై యూకే పార్లమెంట్‌లో సోమవారం(ఫిబ్రవరి 10న) చర్చ కూడా జరిగింది. ఈ క్రమంలో భారత రెస్టారెంట్లపై దాడులు చేయడం చర్చనీయాంశమైంది. దీంతో బ్రిటన్‌లోని భారతీయుల్లో ఆందోళన నెలకొంది.