https://oktelugu.com/

Satsankalpa Foundation: ఘనంగా ‘ సత్సంకల్ప’ ద్వితీయ వార్షికోత్సవం!

సద్గురు శ్రీ శివానందమూర్తి చిత్రపటం వద్ద జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమం ప్రారంబమైంది. దీనికి ముఖ్య అతిథిగా రిటైర్డ్‌ దౌత్యవేత్త మిత్ర వశిష్ఠ, భారత దౌత్య కార్యాలయానికి చెందిన ప్రజ్ఞాసింగ్‌ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : May 26, 2024 / 03:55 PM IST

    Satsankalpa Foundation

    Follow us on

    Satsankalpa Foundation: అమెరికాలోని కనెక్టికట్‌లో మే 19న స్వచ్ఛంద సంస్థ సత్సంకల్ప ఫౌండేషన్‌ ద్వితీయ వార్షికోత్సవం వైభవంగా జరిగింది. భారతీయత పేరుతో ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రవాస భారతీయులకు మన దేశ సనాతన సంప్రదాయాల ఔన్నత్యాన్ని చాటిచెప్పడమే దీని ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి భారత్, కెనడా, స్కాట్‌లాండ్‌ దేశాలతోపాటు అమెరికాలోని పలు రాష్ట్రాల నుంచి 664 మందికిపైగా హాజరయ్యారు. మరో 300 మంది ఆన్‌లైన్‌ ప్రత్యక్ష ప్రసారంలో పాల్గొన్నారు.

    జ్యోతిప్రజ్వలనతో ప్రారంభం..
    సద్గురు శ్రీ శివానందమూర్తి చిత్రపటం వద్ద జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమం ప్రారంబమైంది. దీనికి ముఖ్య అతిథిగా రిటైర్డ్‌ దౌత్యవేత్త మిత్ర వశిష్ఠ, భారత దౌత్య కార్యాలయానికి చెందిన ప్రజ్ఞాసింగ్‌ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. సత్సంకల్ప ఫౌండేషన్‌ అధ్యక్షుడు, వ్యవస్థాపకుడు శ్రీధర్‌ తాళ్లపాక ప్రారంభోపన్యాసం చేశారు. ప్రతి ఒక్కరూ స్వీయ ధర్మ పరిశీలన చేసుకోవడం ముఖ్యమన్నారు. అది సమాజానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు.

    అతిథులకు సత్కారం..
    పరాయి దేశంలో ఉంటూ సనాతన ధర్మాన్ని పాటిస్తున్నందుకు ప్రొఫెసర్‌ ఎమిరటస్‌ పీఆర్‌ ముకుంద్, డాక్టర్‌ ఉమా వైజయంతిమాల కాళ్లకూరి, మధురెడ్డిని శివానంద స్మృతి పురస్కారంతో సంస్థ ప్రతినిధులు సత్కరించారు.

    ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు..
    కార్యక్రమంలో భాగంగా కనెక్టికట్‌లో ఉన్న వివిధ నాట్య సంస్థల నుంచి 28 మంది చిన్నారులు కూచిపూడి, భరతనాట్యం, కథక్, ఒడిస్సీ నృత్యాలను ప్రదర్శించారు. ఆయా సంస్థల నాట్య శిక్షకులను, సనాతన ధర్మాని పాటిస్తున్న మరో ఆరు సాంస్కృతిక సంఘాల సంస్థాపకులను కూడా సంస్థ సత్కరించింది. కార్యక్రమానికి విచ్చేసిన వారికి కృతజ్ఞతలు తెలియజేసి రెండు దేశాల జాతీయ గీతాలాపనతో కార్యక్రమం ముగించారు.