Indian Army: భారత సైన్యానికి సరికొత్త యూనిఫామ్.. శ‌త్రువుల గుండెల్లో ద‌డ పుట్టేలా..

Indian Army: ప్రపంచంలో అతి శక్తిమంతమైన సైన్యం కలిగిన దేశంగా భారతదేశం ఉంది. దాదాపు 13 లక్షల మంది సైనికులు భారత సైన్యంలో పని చేస్తున్నారు. ఈ సంగతులు అలా ఉంచితే.. భారత సైన్యంలో పని చేసే సోల్జర్స్‌కు సరికొత్త యూనిఫామ్ ఇవ్వబోతున్నారు అధికారులు. భారత ఆర్మీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా భారత సైన్యం, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ కలిసి యనిఫామ్ తయారు చేస్తున్నారు. మేక్ ఇన్ […]

Written By: Mallesh, Updated On : January 10, 2022 11:36 am
Follow us on

Indian Army: ప్రపంచంలో అతి శక్తిమంతమైన సైన్యం కలిగిన దేశంగా భారతదేశం ఉంది. దాదాపు 13 లక్షల మంది సైనికులు భారత సైన్యంలో పని చేస్తున్నారు. ఈ సంగతులు అలా ఉంచితే.. భారత సైన్యంలో పని చేసే సోల్జర్స్‌కు సరికొత్త యూనిఫామ్ ఇవ్వబోతున్నారు అధికారులు. భారత ఆర్మీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా భారత సైన్యం, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ కలిసి యనిఫామ్ తయారు చేస్తున్నారు.

Indian Army New Uniform

మేక్ ఇన్ ఇండియాలో భాగంగా తయారు చేస్తున్న యూనిఫామ్ కలర్ గతంలో మాదిరిగా ఆలివ్ గ్రీన్, మట్టి రంగు మిశ్రమమే అయినప్పటికీ ఈ సారి కొన్ని సరికొత్త ఫీచర్స్ యాడ్ చేస్తున్నారు. ఈ యూనిఫామ్ ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ కు కంఫర్టబుల్ గా ఉండేలా క్లాత్స్ డిజైన్ చేశారు. తక్కువ ఉష్టోగ్రతలలో, మైనస్ డిగ్రీలలో సైతం మన్నిక కలిగి ఉండేలా యూనిఫామ్ రూపొందించినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు.

Also Read: అసలు కరోనా వచ్చిందో లేదో ఎలా గుర్తించాలంటే? జాగ్రత్తలివీ!

యూనిఫామ్ క్లాత్స్ డిజైనింగ్ చక్కగా ఉండటంతో పాటు ఈ సారి వారి భుజం మీద ఉద్యోగ ర్యాంకులు సూచించే విధంగా ప్లాన్ చేశారు ఆర్మీ అధికారులు. ఈ నూతన యూనిఫామ్.. ఈ నెల 15న ఆర్మీ డే సందర్భంగా పరేడ్ లో ప్రదర్శించనున్నారు. ఇకపోతే ఈ యూనిఫామ్ స్పెషాలిటీ ఏంటంటే.. ఇది ధరించిన క్రమంలో గతంలో మాదిరిగా చొక్కాను ప్యాంట్ లో టక్ చేసుకోవాల్సిన అవసరం ఉండదట.

ఈ యూనిఫామ్ బహిరంగ మార్కెట్ లో లభించవు. చలికాలం, వానా కాలం, ఎండా కాలం ..అన్ని కాలల్లో సోల్జర్స్ ను ప్రొటెక్ట్ చేసేలా ఈ యూనిఫామ్ ఉంటుంది. భారత ఆర్మీ.. సోల్జర్స్‌కు దుస్తుల అలవెన్స్ కింద డబ్బులు ఇస్తుంటుంది. భారత ఆర్మీ ఇప్పటికి నాలుగు సార్లు ఆర్మీ సోల్జర్స్ యూనిఫామ్ మార్చింది. నూతనంగా డిజైన్ చేసిన ఈ యూనిఫామ్ ఆర్మీ సోల్జర్స్ కు కంఫర్టబుల్ గా ఉండేలా డిజైన్ చేసినట్లు ఆర్మీ అధికారి ఒకరు తెలిపారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ విభాగాలకు డిఫరెంట్ యూనిఫామ్స్‌ను అధికారులు డిజైన్ చేశారు.

Also Read: విశాఖపై బీజేపీ ఫోకస్.. తెరవెనుక రాజకీయం ఏంటి?

Tags