https://oktelugu.com/

Pawan Kalyan: డ్యాన్స్ అదరగొడుతున్న అకిరా నందన్..సోషల్ మీడియా ని ఊపేస్తున్న వీడియో..సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడమే బ్యాలన్స్!

అకిరా లో కేవలం ఎడిటింగ్ స్కిల్స్ మాత్రమే కాదు, మంచి మ్యూజిక్ టాలెంట్ కూడా ఉంది. ఎన్నో సందర్భాలలో ఆయన అద్భుతంగా పియానో వాయిస్తూ కనిపించిన వీడియోలు సోషల్ మీడియా లో బాగా ట్రెండ్ అయ్యాయి. ఒక షార్ట్ ఫిలిం కి ఆయన సంగీత దర్శకుడిగా పనిచేసాడు.

Written By:
  • Vicky
  • , Updated On : August 19, 2024 / 12:46 PM IST

    Pawan Kalyan(7)

    Follow us on

    Pawan Kalyan: సోషల్ మీడియా లో ఈమధ్య పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా నందన్ బాగా ట్రెండ్ అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. మొదటి నుండి అకిరా నందన్ కి సంబంధించి ఏ చిన్న విషయాన్నీ అయినా రేణు దేశాయ్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అయితే అకిరా నందన్ ఎప్పటి నుండో ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ లో ఉన్నాడనే విషయం చాలామందికి తెలియదు. ఎడిటింగ్ మీద ప్రత్యేకమైన ఆసక్తి ఉన్న అకిరా నందన్ టాలీవుడ్ స్టార్ హీరోలందరి మీద ప్రత్యేకంగా ఎడిటింగ్స్ చేసాడు. ‘ది కోర్డ్ ఫాథర్’ అనే పేరుతో ఈ అకౌంట్ ఉంటుంది. ఈ అకౌంట్ లోకి వెళ్లి చూస్తే అకిరా నందన్ లో ఎంత గొప్ప టాలెంట్ ఉందో అర్థం అవుతుంది.

    అకిరా లో కేవలం ఎడిటింగ్ స్కిల్స్ మాత్రమే కాదు, మంచి మ్యూజిక్ టాలెంట్ కూడా ఉంది. ఎన్నో సందర్భాలలో ఆయన అద్భుతంగా పియానో వాయిస్తూ కనిపించిన వీడియోలు సోషల్ మీడియా లో బాగా ట్రెండ్ అయ్యాయి. ఒక షార్ట్ ఫిలిం కి ఆయన సంగీత దర్శకుడిగా పనిచేసాడు. ఈ షార్ట్ ఫిలిం లో అకిరా నందన్ సౌండ్ మిక్సింగ్ చూస్తే ఆశ్చర్యపోక తప్పదు, ఒక సరికొత్త అనుభూతి కలిగించాడు. అదే విధంగా అకిరా కరాటీ లో బ్లాక్ బెల్ట్ కూడా సంపాదించాడు. ఒక రోజు జిమ్ లో ఆయన వర్కౌట్స్ చేస్తూ మధ్యలో కర్రసాము చెయ్యడం, బాక్సింగ్ చెయ్యడం వంటివి మనం వీడియోస్ లో చూసాము. ఇవి ఇప్పటికీ ట్రెండింగ్ లో ఉంది. ఇవన్నీ పక్కన పెడితే అకిరా తన చిన్నతనం లో వేసిన డ్యాన్స్ కి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. పాత వీడియో అయ్యినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు మరోసారి ఆ వీడియో ని షేర్ చెయ్యగా , అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అప్పట్లో పవన్ కళ్యాణ్ ‘సత్యాగ్రహి’ అనే చిత్రాన్ని గ్రాండ్ గా లాంచ్ చేసాడు. ఈ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ , రేణు దేశాయ్ మరియు అకిరా నందన్ వచ్చారు. ఈ ఈవెంట్ లో అకిరా నందన్ తనకి తోచిన విధంగా ముద్దుగా డ్యాన్స్ చేస్తూ ఉండడాన్ని చూసి పవన్ కళ్యాణ్ మురిసిపోతూ ఉంటాడు.

    చిన్నప్పటి నుండే అకిరా నందన్ అంత హుషారుగా ఉండేవాడట. ఇలా మల్టీ టాలెంటెడ్ గా కనిపిస్తున్న అకిరా నందన్ గ్రాండ్ ఎంట్రీ కోసం పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం అకిరా ఫిలిం స్కూల్ లో ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. డ్యాన్స్ పరంగా కూడా ఆయన ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నాడట. మెగా ఫ్యామిలీ లో ఇప్పటి వరకు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ప్రతీ ఒక్కరికంటే అకిరా నందన్ చూసేందుకు ఎంతో అందంగా ఉన్నాడు. సరైన సినిమాలు చేసుకుంటూ పోతే పవన్ కళ్యాణ్ ని మించిన స్టార్ అవుతాడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.