
తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో వినూత్నంగా ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు జరిగాయి. ఆగస్ట్ 30న అట్లాంటా, జార్జియా-ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సాహితీ విభాగం తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో వ్యావహారికి భాషోద్యమ పితామహుడు శ్రీ గిడుగు వేంకట రామమూర్తి గారి జయంతి సందర్బంగా ఈ వేడులు ఘనంగా నిర్వహించారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర అతిధులకు, వ్యక్తలకు ఆహ్వానం పలకారు. తెలుగు వ్యవహారిక భాషగా ఉండాలనే ఉద్యమంలో గిడుగు రాంమూర్తి తన సర్వసాన్ని త్యాగం చేశారని గుర్తు చేసుకున్నారు. వేడుకలని ఘనంగా నిర్వహిస్తున్న తానా ప్రపంచ సాహిత్య వేదికకు అభినందనలు తెలిపారు.