Dr. Uma Aramandla Katiki: మహిళలను తమ కాళ్ల మీద తాము నిలబడేలా చేసిన మార్గదర్శకురాలు

Dr. Uma Aramandla Katiki: ‘ప్రార్థించే పెదవుల కన్నా.. చేసే సాయం మిన్న’ అంటారు పెద్దలు. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి.. అమెరికాలో స్థిరపడ్డ ప్రవాస భారతీయులు ఇప్పుడు మాతృభూమి రుణం తీర్చుకుంటున్నారు. ఇక్కడి పేదల కష్టాలు తీరుస్తూ వారికి ఉపాధి కల్పిస్తున్నారు. వారి భావి జీవితానికి బాటలు వేస్తున్నారు. తెలుగు నేలపై పుట్టిన డాక్టర్ ఉమా ఆరమండ్ల కటికి గారు ఇప్పుడు అమెరికాలో సేవే ప్రాధాన్యంగా ముందుకెళుతున్నారు. తానాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వైద్య శిభిరాలు, […]

Written By: NARESH, Updated On : December 17, 2022 10:08 am
Follow us on

Dr. Uma Aramandla Katiki: ‘ప్రార్థించే పెదవుల కన్నా.. చేసే సాయం మిన్న’ అంటారు పెద్దలు. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి.. అమెరికాలో స్థిరపడ్డ ప్రవాస భారతీయులు ఇప్పుడు మాతృభూమి రుణం తీర్చుకుంటున్నారు. ఇక్కడి పేదల కష్టాలు తీరుస్తూ వారికి ఉపాధి కల్పిస్తున్నారు. వారి భావి జీవితానికి బాటలు వేస్తున్నారు.

Dr. Uma Aramandla Katiki with Beneficiaries

తెలుగు నేలపై పుట్టిన డాక్టర్ ఉమా ఆరమండ్ల కటికి గారు ఇప్పుడు అమెరికాలో సేవే ప్రాధాన్యంగా ముందుకెళుతున్నారు. తానాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వైద్య శిభిరాలు, ఆధ్యాత్మిక, సాంస్కృతిక వ్యవహారాల్లో ఎంతో సేవ చేస్తున్నారు. అమెరికాలోనే కాదు.. తాజాగా హైదరాబాద్ వచ్చి కూడా ఇక్కడ మహిళల ఉపాధికి మార్గం చూపారు.

తానా, ఉమెన్స్ సర్వీసెస్ కోఆర్డినేటర్ డాక్టర్ ఉమా ఆరమండ్ల కటికి గారు ‘తానా, లీడ్ ద పాత్ ఫౌండేషన్’ సంయుక్త ఆధ్వర్యంలో లియో కేర్ ఫౌండేషన్ సహకారంతో హైదరాబాద్ మీర్ పేట్ లో ‘మహిళా సంవృద్ధి సహాయత’ కార్యక్రమంలో భాగంగా మహిళలకు ఉచితంగా కుట్టు మెషీన్ శిక్షణను అందించారు. పేద మహిళలకు ఈ శిక్షణ ఇచ్చి వారు గౌరవంగా బతికేలా.. నాలుగు రాళ్లు సంపాదించుకునేలా తీర్చిదిద్దారు. ఈ శిక్షణ పూర్తికావడంతో మహిళలు తమ కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించే అవకాశం పొందారు. ఈ సందర్భంగా శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి గారు, ఉమా ఆరమండ్ల కటికి గారు శిక్షణ సర్టిఫికెట్లు అందచేశారు.

Dr. Uma with TANA President Lavu Anjaiah

మహిళల అభివృద్ధి కోసం ఎప్పుడూ పాటుపడే.. ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో ముందుండే డాక్టర్ ఉమా ఆరమండ్ల కటికి గారి ఈ గొప్ప ప్రయత్నం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం అని.. ఉమా గారు తమ తల్లిదండ్రుల పేరుమీదుగా ఈ పేద మహిళలకు ఈ శిక్షణను సొంత ఖర్చులతో ఇప్పించారని వక్తలు కొనియాడారు.

ఈ సందర్భంగా తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి గారు మాట్లాడుతూ.. మహిళల అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు డాక్టర్ ఉమా గారు నిర్వహిస్తున్నారని.. మీర్ పేట పేద మహిళల కోసం వాళ్ల కాళ్ల మీద నిలబెడేలా కుట్టు శిక్షణ ఇప్పించారని.. ఇందుకోసం ఎంతో ఖర్చు చేసి వారి జీవితాల బాగు కోసం కృషి చేస్తున్నారని అంజయ్య ప్రశంసించారు.

Dr. Uma Aramandla Katiki

ఈ కార్యక్రమంలోనే తానా సీనియర్ మెంబర్, మోటీవిషనల్ స్పీకర్ కళారాణి కాకర్ల సైతం పాల్గొని మాట్లాడారు. ‘డాక్టర్ ఉమా గారు చేస్తున్న పలు కార్యక్రమాలు మహిళల అభివృద్ధికి పాటుపడుతున్నాయన్నారు. మహిళల సమస్యలపై ముందుండి.. మహిళలను నాయకులుగా తీర్చిదిద్దుతున్నాయన్నారు. తన చుట్టూ ఉండే వారిని కూడా ఇన్ స్పైర్ చేసి అందరికీ స్ఫూర్తి కలిగిస్తున్నారన్నారు. సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇస్తూ తన పిల్లలను కూడా అదే దారిలో నడిపిస్తున్నారని.. తను నడుస్తూ మిగతా వారిని కూడా సేవా దారిలో నడిచేలా రోల్ మోడల్ గా ఉమా వ్యవహరిస్తున్నారని కొనియాడారు.

శిక్షణలో సర్టిఫికెట్లు తీసుకున్న మహిళలు సైతం తమకు ఉచితంగా శిక్షణ ఇప్పించి తమకు ఓ మార్గం చూపిన డాక్టర్ ఉమా గారిని కొనియాడుతు వారి అనుభవాలు పంచుకున్నారు. అసలు కుట్టు మిషన్ అంటే కూడా తెలియని కూలీ పనులు చేసుకునే తమకు ఈరోజు శిక్షణ ఇచ్చి తమకు వృత్తిని సృష్టించి ఉపాధి కల్పించిన ఉమాగారికి.. తమకు సర్టిఫికెట్ ఇచ్చి మా కాళ్ల మీద మేం నిలబడేలా చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆమెకు జీవితాంతం రుణపడి ఉంటామని తెలిపారు.

Dr. Uma Aramandla Katiki

లియోకేర్ ఫౌండేషన్ సీఈవో లత గారు మాట్లాడుతూ.. ‘అమెరికా నుంచి వచ్చి ఇంతమంది మహిళలకు ఉమా గారు ఉపాధి కల్పించి.. వారి అభ్యున్నతకు పాల్పడుతూ.. ఇలాంటి బృహత్తర కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామిని చేసినందుకు మాకెంతో ఆనందంగా ఉందని’ అన్నారు. ఇలాంటి ప్రోగ్రాంలు భవిష్యత్తులో మరెన్నో కార్యక్రమాలు చేసేందుకు దోహదపడుతుందని.. ఉమా గారితో కలిసి మరిన్ని కార్యక్రమాలు చేస్తామని లత అన్నారు.

కుట్టు మెషీన్ శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్లు అందజేస్తున్న డా. ఉమా ఆరమండ్ల కటికి

ఈ కార్యక్రమంలో తానా, కన్వెన్షన్ 2023 కన్వీనర్ రవి పొట్లూరి, తానా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ లక్ష్మీ దేవినేని, చైతన్య స్రవంతి కోఆర్డినేటర్ సునీల్ పాత్రా, తానా శ్రేయోభిలాషి, మోటివేషనల్ స్పీకర్ కళారాణి కాకర్ల తదితరులు పాల్గొన్నారు.

కుట్టు మెషీన్ శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్లు అందజేస్తున్న డా. ఉమా ఆరమండ్ల కటికి, తానా అధ్యక్షులు లావు అంజయ్య గారు..

Tags