TANA : తానా ఉత్సవాలు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం..ఒక్కో టికెట్ ధర ఎంతో తెలిస్తే మీ గుండె ఆగుద్ది!

ప్రముఖ సినీ సెలెబ్రిటీలు ఇక్కడికి వచ్చి లైవ్ పెర్ఫార్మన్స్ ఇస్తూ ఉంటారు. ఇక జులై 7 వ తారీఖున ప్రారంభం అవ్వబోతున్న ఈ తానా ఈవెంట్ కి ప్రముఖ గాయని చిత్ర మరియు సింహ లైవ్ కన్సర్ట్స్ ఇవ్వబోతున్నారు.

Written By: NARESH, Updated On : June 8, 2023 8:56 pm
Follow us on

TANA : ప్రతీ ఏడాది అమెరికా లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘తానా ‘ ఈవెంట్స్ జరిగే సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ ఏడాది కూడా జులై 7 వ తారీఖు నుండి ఈ తానా ఉత్సవాలు జరగనున్నాయి. తానా అంటే ‘తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా’ అన్నమాట, ఇప్పటి వరకు ఈ సంఘం నుండి 23 ఈవెంట్స్ జరిగాయి. ఈ ఈవెంట్స్ లో డ్యాన్స్ ప్రోగ్రామ్స్, లైవ్ కన్సర్ట్స్ , ఆటల పోటీలు ఇలా ఎన్నో ఉంటాయి.

ప్రముఖ సినీ సెలెబ్రిటీలు ఇక్కడికి వచ్చి లైవ్ పెర్ఫార్మన్స్ ఇస్తూ ఉంటారు. ఇక జులై 7 వ తారీఖున ప్రారంభం అవ్వబోతున్న ఈ తానా ఈవెంట్ కి ప్రముఖ గాయని చిత్ర మరియు సింహ లైవ్ కన్సర్ట్స్ ఇవ్వబోతున్నారు. ఈ ఈవెంట్ పెంన్సిల్వానియా కన్వెన్షన్ సెంటర్ లో జరగనుంది. ఈ ఈవెంట్ కి టికెట్ ప్రైజ్ లు ఎంతో ఒకసారి చూద్దాము.

ఈ ఈవెంట్ లో ఒక అడల్ట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే 175 డాలర్లు చెల్లించాలట, అంటే ఇండియన్ కరెన్సీ లెక్క ప్రకారం అక్షరాలా 14 వేల రూపాయిలు అన్నమాట. గత ఏడాది 225 డాలర్లు ఉండేది, ఇప్పుడు డిమాండ్ తగ్గిందో ఏమో తెలియదు కానీ 175 డాలర్లకు కుదించారు. ఇక 6 నుండి 17 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లకు రిజిస్ట్రేషన్ ఫీజు 75 డాలర్లు అట, గత ఏడాది 100 డాలర్లు ఉండేది.

ఇక భార్య భర్తలు ఈ ఈవెంట్ కి రావాలంటే 300 డాలర్లు చెల్లించాలి. అంటే ఇండియన్ కరెన్సీ లెక్కల ప్రకారం 25 వేల రూపాయిలు. గత ఏడాది 400 డాలర్లు ఉండేది. ఇక కుటుంబ సమేతంగా ఈ ఈవెంట్ కి రాదల్చుకున్న వాళ్ళు 375 డాలర్లు చెల్లించాలి. ఈ టికెట్ రేట్స్ చూస్తుంటే మైండ్ పోతుంది కదూ!, మరి సినిమా యాక్టర్లను ఆ రేంజ్ లో రప్పిస్తున్నారు, వాళ్లకి అయ్యే పారితోషికాలు అన్నీ లెక్కగడితే ఆ మాత్రం అవుతుంది కదా అని అంటున్నారు ట్రేడ్ పండితులు.

Tags