Homeటాప్ స్టోరీస్TANA President Naren Kodali: నరేన్ కొడాలి నాయకత్వంలో తానాలో కొత్త శకం ప్రారంభం!

TANA President Naren Kodali: నరేన్ కొడాలి నాయకత్వంలో తానాలో కొత్త శకం ప్రారంభం!

TANA President Naren Kodali: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 24వ మహాసభలు విజయవంతంగా ముగిశాయి. ఈ మహాసభల ముగింపు రోజున నరేన్ కొడాలి నూతన తానా అధ్యక్షుడిగా అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తానా ఆశయాలను మరింత ముందుకు తీసుకువెళ్లడం తన బాధ్యత అని, సభ్యులందరి విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా కృషి చేస్తానని స్పష్టం చేశారు.

Also Read: రాజ్యాంగాన్ని తుంగలో తొక్కిన వాళ్ళే రాజ్యాంగ పరిరక్షకులుగా దొంగ అవతారాలెత్తితే ఎలా?

నరేన్ కొడాలి మాటల్లో, “తానాను మన పెద్దలు ఎంతో గొప్ప లక్ష్యాలతో స్థాపించారు. ఈ ఏడాది తానా స్వర్ణోత్సవాలు జరుపుకోవడం, ఈ శుభసమయంలో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం నా అదృష్టంగా భావిస్తున్నాను.” గతంలో తాను తానాలో ఒక సైనికుడిగా పోరాడానని గుర్తు చేసుకుంటూ, “మీరు నాపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా, దాన్ని మరింత పెంచేలా పని చేస్తాను” అని దృఢంగా చెప్పారు.

TANA President Naren Kodali
TANA President Naren Kodali

సేవా, అభ్యున్నతి లక్ష్యంగా ముందుకు
తానాను మరింత బలోపేతం చేయడానికి సేవా, సాంస్కృతిక, విద్యా సంబంధిత కార్యక్రమాలను విస్తృతంగా చేపడతామని నరేన్ కొడాలి తెలిపారు. “ఈ లక్ష్యాలను సాధించడానికి నాతో కలిసి పనిచేయగల సమర్థవంతమైన బృందాన్ని ఏర్పాటు చేశాం. తానా అభివృద్ధి ఒక్కటే మా బృందం యొక్క ఏకైక లక్ష్యం” అని ఆయన పునరుద్ఘాటించారు. నువ్వు తానాకు రావాలని నన్ను గుర్తించి తానాలో తీసుకువచ్చిన మాజీ అధ్యక్షుడు సతీష్ వేమన, పెద్దలు జయరామ్ కోమటి, గంగాధర్ నాదెళ్ళ సహకారంతో కొత్తగా బాధ్యతలు చేపట్టిన నా కార్యవర్గంతో కలిసి తానాను అన్నీ విధాలుగా ముందుకు తీసుకువెళుతానని హామి ఇస్తున్నాను.

నరేన్ కొడాలితోపాటు తానా కొత్త టీమ్ కూడా బాధ్యతలు చేపట్టింది.

శ్రీనివాస్ లావు (ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్), సునీల్ పంత్రా (సెక్రటరీ), వెంకట(రాజా) కసుకుర్తి (ట్రజరర్), లోకేష్ కొణిదెల (జాయింట్ సెక్రటరీ), రాజేష్ యార్లగడ్డ (జాయింట్ ట్రజరర్), కృష్ణ ప్రసాద్ సోంపల్లి (ఇంటర్నేషనల్ కోర్డినేటర్), మాధురి ఏలూరి (హెల్త్ సర్వీస్ కో ఆర్డినేటర్), నాగ మల్లేశ్వరరావు పంచుమర్తి (స్పెషల్ ప్రాజెక్ట్స్ కో ఆర్డినేటర్), పరమేష్ దేవినేని (మీడియా కోఆర్డినేటర్), సాయి బొల్లినేని (కమ్యూనిటీ సర్వీస్ కోఆర్డినేటర్), సోహ్ని అయినాల (ఉమెన్స్ సర్వీసెస్ కో ఆర్డినేటర్), సాయిసుధ పాలడుగు (కల్చరల్ సర్వీసెస్ కో ఆర్డినేటర్), సునీల్ కాంత్ దేవరపల్లి (సోషల్ వెల్ఫేర్ కో ఆర్డినేటర్), శివలింగ ప్రసాద్ చావా (స్పోర్ట్స్ కో ఆర్డినేటర్), వెంకట్ అడుసుమిల్లి (ఎడ్యుకేషన్ కో ఆర్డినేటర్), డా.ఉమ.ఆర్. కటికి (ఆరమండ్ల) (ఎన్నారై స్టూడెంట్ కో ఆర్డినేటర్), వెంకట్ సింగు (బెనిఫిట్స్ కో ఆర్డినేటర్) గా బాధ్యతలు స్వీకరించారు.

అలాగే ఫౌండేషన్ ట్రస్టీలుగా శ్రీకాంత్ దొడ్డపనేని, కిరణ్ దుగ్గిరాల, త్రిలోక్ కంతేటి, సతీష్ కొమ్మన, దేవేంద్ర రావు లావు, ఠాగూర్ మల్లినేని, సతీష్ మేకా, శ్రీనివాస్ ఓరుగంటి, మధుకర బి. యార్లగడ్డ, ఫౌండేషన్ డోనర్ ట్రస్టీలుగా శ్రీనివాస్ చంద్ గొర్రెపాటి, ప్రసాద నల్లూరి, బోర్డ్ డైరెక్టర్లుగా వెంకట్ కోగంటి, భరత్ మద్దినేని, జనార్ధన్ నిమ్మలపూడి, అనిల్ చౌదరి ఉప్పలపాటి, నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి బాధ్యతలు చేపట్టారు.

తానా ప్రాంతీయ ప్రతినిధులుగా న్యూ ఇంగ్లాండ్ – మౌనిక మణికొండ, న్యూయార్క్ – శ్రీనివాస్ భర్తవరపు, న్యూజెర్సీ – సుధీర్ చంద్ నారెపాలెపు, మిడ్ అట్లాంటిక్ – ఫణి కుమార్ కంతేటి, క్యాపిటల్ ఏరియా – సుధీర్ నాయుడు కొమ్మి, అప్పలాచియన్ – రవి చంద్ర వడ్లమూడి సౌత్ ఈస్ట్ – శేఖర్ కొల్లు, నార్త్ – రాంప్రసాద్ చిలుకూరి, ఒహియో వ్యాలీ – ప్రదీప్ కుమార్ చందనం, సౌత్ సెంట్రల్ – రవి కుమార్ పోట్ల, డిఎఫ్డబ్ల్యు – సతీష్ బాబు కోటపాటి, సౌత్ వెస్ట్ – మనోజ్ కుమార్ పాలడుగు, నార్త్ సెంట్రల్ – రామకృష్ణ వంకిన, సదరన్ కాలిఫోర్నియా – హేమకుమార్ గొట్టి, నార్తర్న్ కాలిఫోర్నియా – సుధీర్ ఉన్నం, నార్త్ వెస్ట్ – సుంకరి శ్రీరామ్ కూడా బాధ్యతలు చేపట్టారు.

కొత్త కార్యవర్గం – కీలక బాధ్యతలు
తానా నూతన కార్యవర్గంలో ముఖ్యమైన స్థానాలను చేపట్టినవారు:

ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్: శ్రీనివాస్ లావు

సెక్రటరీ: సునీల్ పంత్రా

ట్రెజరర్: వెంకట (రాజా) కసుకుర్తి

జాయింట్ సెక్రటరీ: లోకేష్ కొణిదెల

జాయింట్ ట్రెజరర్: రాజేష్ యార్లగడ్డ

ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్: కృష్ణ ప్రసాద్ సోంపల్లి

హెల్త్ సర్వీసెస్: మాధురి ఏలూరి

స్పెషల్ ప్రాజెక్ట్స్: నాగ మల్లేశ్వరరావు పంచుమర్తి

మీడియా కోఆర్డినేటర్: పరమేష్ దేవినేని

కమ్యూనిటీ సర్వీసెస్: సాయి బొల్లినేని

వుమెన్స్ సర్వీసెస్: సోహ్ని అయినాల

కల్చరల్ సర్వీసెస్: సాయిసుధ పాలడుగు

సోషల్ వెల్ఫేర్: సునీల్ కాంత్ దేవరపల్లి

స్పోర్ట్స్: శివలింగ ప్రసాద్ చావా

ఎడ్యుకేషన్: వెంకట్ అడుసుమిల్లి

ఎన్నారై స్టూడెంట్: డా.ఉమ.ఆర్. కటికి(ఆరమండ్ల)

బెనిఫిట్స్: వెంకట్ సింగు

ఫౌండేషన్ ట్రస్టీలు, బోర్డు సభ్యులు, ప్రాంతీయ ప్రతినిధులు
ఫౌండేషన్ ట్రస్టీలుగా శ్రీకాంత్ దొడ్డపనేని, కిరణ్ దుగ్గిరాల, త్రిలోక్ కంతేటి, సతీష్ కొమ్మన వంటి ప్రముఖులు బాధ్యతలు స్వీకరించారు. అలాగే బోర్డు డైరెక్టర్లుగా వెంకట్ కోగంటి, భరత్ మద్దినేని, జనార్ధన్ నిమ్మలపూడి తదితరులు ఎంపికయ్యారు.

 

TANA President Naren Kodali
TANA President Naren Kodali

అంతేకాకుండా, అమెరికాలోని న్యూయార్క్, న్యూజెర్సీ, కాలిఫోర్నియా, ఓహియో, టెక్సాస్ వంటి వివిధ ప్రాంతాలకు ప్రత్యేక ప్రతినిధులు కూడా నియమితులయ్యారు.

“తానా సైనికుడిని” అని చెప్పుకున్న నరేన్ కొడాలి నాయకత్వంలో, తానా సంస్థ సేవా, సాంస్కృతిక, విద్యా రంగాలలో కొత్త పురోగతిని సాధించడానికి సిద్ధంగా ఉంది. ఈ నూతన కార్యవర్గం తమ మాటలను ఆచరణలో చూపించడానికి సంకల్పంతో ముందుకు సాగుతోంది. తానా స్వర్ణోత్సవాల వేళ ఈ కొత్త అధ్యాయం తెలుగువారందరికీ మరింత ప్రయోజనకరంగా మారుతుందని ఆశిద్దాం.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular