TANA: తానా మిడ్‌ అట్లాంటిక్‌ చెస్‌ టోర్నమెంట్‌ విజయవంతం.. విజేతలు ఎవరంటే?

ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) తానా లేదా ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఉత్తర అమెరికాలో నివసిస్తున్న తెలుగు ప్రజల సంఘం. తెలుగు సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడానికి, పరివ్యాప్తం చేయడానికి, తెలుగు ప్రజల, వారి సంతతి గుర్తింపుని కాపాడడానికి, తెలుగు సాహిత్య, సాంస్కృతిక, విద్యా, సాంఘిక, సేవా చర్చలకు ఓ వేదికగా నిలవడానికి ఈ సంఘం ఏర్పాటైంది.

Written By: Raj Shekar, Updated On : September 2, 2024 9:48 am

TANA(1)

Follow us on

TANA: తానా ఉత్తర అమెరికా తెలుగు వారి కోసం ఏర్పడిన సంఘమే అయినా క్రమంగా అమెరికాలోని తెలుగువారందరినీ ఏకం చేస్తోంది. ఏటా వివిధ కార్యక్రమాల ద్వారా ప్రోత్సహిస్తోంది. పండుగలు, వేడుకలు, క్రీడలు నిర్వహిస్తూ తామంతా ఒక్కటే అన్న భావనను చాటుతోంది. తెలుగుదనం ఉట్టిపడేలా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. కొత్తగా అమెరికా వెళ్లే వారికి దిశానిర్దేశం చేస్తోంది. తెలుగు వారసత్వాలను రాబోయే తరాలకు అందిస్తున్నారు. తానాలో సుమారు 50 వేల మందికిపైగా సభ్యులు ఉన్నారు. ఇక సేవా కార్యక్రమాల్లోనూ తానా ముందు ఉంటుంది. తెలుగువారితోపాటు అమెరికాలోని అనాథ పిల్లలు, ఒంటరి తల్లిదండ్రులను ఆదుకుంటోంది. అండగా నిలుస్తోంది. వివిధ సందర్భాల్లో వివిధ రూపాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. తెలుగు వారిలో పోటీతత్వం, స్నేహభావం పెంచేందుకు ఏటా సాంస్కృతిక వేడుకలు, ఐదేళ్ల కోసారి తానా సభలు, క్రీడా పోటీలు నిర్వహిస్తోంది. వేసవిలో తెలుగువారి పిల్లలకు శిక్షణ శిబిరాలు నిర్వహిస్తోంది. తద్వారా తెలుగువారంతా ఒక్కటే అన్న భావన కల్పిస్తోంది. తాజాగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మిడ్‌ అట్లాంటిక్‌ ఆధ్వర్యంలో ఫిలడెల్ఫియాలో నిర్వహించిన చెస్‌ టోర్నమెంట్‌ విజయవంతమైంది.

TANA(2)

ఉత్సాహంగా పాల్గొన్న తెలుగువారు..
తానా నిర్వహించిన చెస్‌ పోటీల్లో పాల్గొనేందుకు పలువురు ఉత్సాహం చూపించారు. తల్లితండ్రులు కూడా తమ పిల్లలను ఈ పోటీలకోసం తీసుకువచ్చారు. పిల్లలు చూపించిన ప్రతిభ అందరినీ ఆకట్టుకుంది. నిర్వాహకులు కూడా తగిన ఏర్పాట్లు చేయడంతో చదరంగం పోటీలు చక్కగా సాగాయి. వచ్చినవారు ఏర్పాట్లను చూసి నిర్వాహకులను అభినందించారు. ఈ టోర్నమెంట్‌కు డెరైక్టర్‌గా జాషువా మిల్టన్‌ ఆండర్సన్‌ వ్యవహరించారు. ఈ టోర్నమెంట్‌ను ఫణి కంతేటి ఆర్గనైజ్‌ చేశారు. తానా నాయకులు రవి పొట్లూరి (బోర్డ్‌ డెరైక్టర్‌), నాగ పంచుమర్తి (స్పోర్ట్స్‌ కోఆర్డినేటర్‌), వెంకట్‌ సింగు (మిడ్‌–అట్లాంటిక్‌ రీజినల్‌ కోఆర్డినేటర్‌) ఈ పోటీల విజయవంతానికి కృషి చేశారు. ఈ పోటీలకు రంజిత్‌ మామిడి, నాయుడమ్మ యలవర్తి, వెంకట్‌ ముప్పా, విశ్వనాథ్‌ కోగంటి, కృష్ణ నందమూరి, గోపి వాగ్వాలా, ప్రసాద్‌ క్రోతపల్లి. ప్రసాద్‌ కస్తూరి, సంతోష్‌ రౌతు వలంటీర్లుగా వ్యవహరించారు.

TANA(3)

విజేతలు వీరే..
ఈ చెస్‌ టోర్నమెంట్‌లో విజేతల వివరాలను ప్రకటించారు. ప్రణవ్‌ కంతేటి, సిద్ధార్థ్‌ బోస్, లలిత్‌ కృష్ణ ఉప్పు, అఖిల్‌ కపలవాయి, అధ్వైత్‌ ఆదవ్‌ వాసుదేవ్, దేబబ్రత చౌధురి, సజీవ్‌ సింగారవేలు, సాయిశ్రీసమర్థ్‌ పెన్నేటి, సహర్ష్‌ నన్నపనేని, ర్యాన్‌ బుచా, రేయాన్‌‡్షరెడ్డి ఎల్ల, జోసెఫ్, ఆద్య తాతి విజేతలుగా నిలిచారు.